ETV Bharat / education-and-career
ఎన్‌సీఎల్‌లో సాంకేతిక కొలువులు - ఇలా దరఖాస్తు చేసుకోండి
టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం-ఓఎంఆర్/ కంప్యూటర్ బేస్డ్ రాతపరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో మల్టిపుల్ ఛాయిస్ విధానంలో పరీక్ష

By ETV Bharat Andhra Pradesh Team
Published : December 23, 2025 at 6:58 PM IST
NCL Latest Jobs Notification: కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్‌ఐఆర్) అనుబంధ సంస్థల్లో ఒకటైన నేషనల్ కెమికల్ ల్యాబొరేటరీ (ఎన్‌సీఎల్) టెక్నీషియన్, టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. ఇంజినీరింగ్ డిప్లొమా/బీఎస్సీ/ఐటీఐ చేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. ట్రేడ్ టెస్టు, రాత పరీక్షలతో నియామకాలు జరుగుతాయని తెలిపింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నవారికి ముందుగా ట్రేడ్ టెస్టు నిర్వహిస్తారు. అందులో ఎంపికైనవారికి రాత పరీక్ష ఉంటుంది.
టెక్నీషియన్ ఖాళీలు: 15
టెక్నీషియన్ పోస్టుకు అర్హతలు : పదో తరగతి, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్/ఫిట్టర్/కంప్యూటర్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ఎలక్ట్రీషియన్/ ప్లంబర్/ రిఫ్రిజిరేషన్ అండ్ ఏసీ టెక్నీషియన్/ వైర్‌మెన్/డ్రాఫ్ట్స్‌మెన్ (సివిల్) ట్రేడ్‌తో 55 శాతం మార్కులతో ఐటీఐ పూర్తిచేయాలి. రెండేళ్ల అనుభవం ఉండాలి.
వేతన శ్రేణి: నెలకు రూ.19,900-63,200.
పరీక్ష విధానం : ఓఎంఆర్/ కంప్యూటర్ బేస్డ్ రాతపరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలతో ఉంటుంది. ప్రశ్నపత్రం హిందీ, ఇంగ్లిష్ మాధ్యమాల్లో పదో తరగతి + ఐటీఐ స్థాయిలో ప్రశ్నలుంటాయని పేర్కొంది. మూడు పేపర్లు ప్రత్యేక వ్యవధుల్లో ఉంటాయి.
పేపర్-1లో మెంటల్ ఎబిలిటీ టెస్టు 50 ప్రశ్నలతో 100 మార్కులకు ఉంటుంది. ప్రశ్నకు రెండు మార్కులు. నెగిటివ్ మార్కులు లేవు. రీజనింగ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, జనరల్ ఇంటెలిజెన్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్, సిట్యుయేషనల్ జడ్జిమెంట్ నుంచి ప్రశ్నలు ఇస్తారు. ఈ పేపర్‌కు 60 నిమిషాల సమయం ఉంటుంది.
పేపర్-2లో ఇంగ్లిష్, జనరల్ అవేర్‌నెస్‌ల నుంచి 25 ప్రశ్నల చొప్పున వస్తాయి. ప్రశ్నకు మూడు మార్కులు. పేపర్ 2లో నెగిటివ్ మార్కులు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికీ ఒక మార్కు తగ్గిస్తారు. ఈ పేపర్‌కు 30 నిమిషాల సమయం ఉంటుంది.
పేపర్-3లో సబ్జెక్టు సంబంధిత ప్రశ్నలు 50 ఉంటాయి. ప్రశ్నకు మూడు మార్కులు. ఇందులో కూడా నెగిటివ్ మార్కులు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికీ ఒక మార్కు తగ్గిస్తారు. ఈ పేపర్‌కు 90 నిమిషాల సమయం ఉంటుంది.
టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు: 19
టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుకు అర్హతలు: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/మెకానికల్/ కంప్యూటర్ ఇంజినీరింగ్/ సివిల్ ఇంజినీరింగ్ బ్రాంచ్‌తో డిప్లొమాతో పాటు రెండేళ్ల అనుభవం ఉండాలి. లేదా కంప్యూటర్ సైన్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో బీఎస్సీ, ఏడాది అనుభవం ఉండాలి. విద్యార్హతల డిగ్రీని 60 శాతంతో పూర్తి చేయాలి.
వేతన శ్రేణి: నెలకు రూ.35,400-1,12,400.
పరీక్ష: ప్రశ్నపత్రం హిందీ, ఇంగ్లిషుల్లో 200 మార్కులకు ఉంటుంది. డిప్లొమా/ డిగ్రీ స్థాయిలో ప్రశ్నలు వస్తాయి. పరీక్ష వ్యవధి మూడు గంటలు.పేపర్-1, పేపర్-2 టెక్నీషియన్ పరీక్ష మాదిరిగానే ప్రశ్నలు ఉంటాయి. పేపర్-3లో సబ్జెక్టు సంబంధిత 100 ప్రశ్నలకు 300 మార్కులు. ప్రశ్నకు మూడు మార్కులు. ఇందులో నెగిటివ్ మార్కులు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికీ ఒకమార్కు తగ్గిస్తారు.
ప్రిపరేషన్ ఇలా: రెండు పోస్టులకు పేపర్-3లో సబ్జెక్టు సంబంధిత అంశాలకు అధిక ప్రాధాన్యం ఉంది. ముఖ్యాంశాలను అధ్యయనం చేసి పునశ్చరణ చేసుకుంటే ఇందులో ఎక్కువ మార్కులు తెచ్చుకోవచ్చు.
పేపర్-1లో ఉత్తీర్ణత కోసం వివిధ పోటీ పరీక్షల ప్రశ్నపత్రాలను సాధన చేయాలి.
ప్రతి పేపర్ పరీక్ష వేర్వేరు సమయాల్లో ఉంటుంది. నిర్ణీత వ్యవధిలోగా సమాధానాలు రాయడానికి ప్రయత్నించాలి.
నెగిటివ్ మార్కుల కారణంగా తెలిసిన ప్రశ్నలకే జవాబులు రాయాలి.
వయసు: 28 సంవత్సరాలు మించకూడదు. ఓబీసీ-ఎన్‌సీఎల్‌కు మూడేళ్లు, ఎస్సీ/ఎస్టీకి ఐదేళ్లు, దివ్యాంగులకు పది నుంచి పదిహేనేళ్ల సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: అన్‌రిజర్వుడ్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌లకు రూ.500. మహిళలు/ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/మాజీ సైనికోద్యోగులకు ఫీజు లేదు.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 12.01.2026
వెబ్‌సైట్: https://recruit.ncl.res.in/
3 ఏళ్లలో 10 ఉద్యోగాలకు ఎంపిక - ఐఈఎస్ లక్ష్యంగా యువకుడు
యువత కలల సాకారానికి "కౌశలం" - ఆన్లైన్లో కొనసాగుతున్న పరీక్షలు

