ETV Bharat / education-and-career

నిరుద్యోగులకు గుడ్​న్యూస్​ - జనవరి వరకు దరఖాస్తులకు అవకాశం

బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, హిందుస్థాన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్, రైల్‌ ఇండియా టెక్నికల్‌ అండ్‌ ఎకనామిక్‌ సర్వీస్‌ లిమిటెడ్‌, ఇండియన్‌ అగ్రికల్చరల్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌, పోర్ట్‌ అథారిటీలో ఉద్యోగావకాశాలు

LATEST JOBS NOTIFICATION
LATEST JOBS NOTIFICATION (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : December 25, 2025 at 8:20 PM IST

3 Min Read
Choose ETV Bharat

Latest Jobs Notification : బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, హెచ్‌ఎస్‌ఎల్‌ (హిందుస్థాన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్), రైట్స్‌ (రైల్‌ ఇండియా టెక్నికల్‌ అండ్‌ ఎకనామిక్‌ సర్వీస్‌ లిమిటెడ్‌), ఐకార్‌ (ఇండియన్‌ అగ్రికల్చరల్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌), పోర్ట్‌ అథారిటీలో పోస్టులను భర్తీ చేయడానికి భారీ నోటిఫికేషన్​ను విడుదల చేసింది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలి.

బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా : బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (బీఓఐ) ముంబయిలో అప్రెంటిస్‌ పోస్టులకు నోటిఫికేషన్​ విడుదల చేసింది. వివిధ జోనుల్లోని అప్రెంటిస్‌ల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

అప్రెంటిస్‌ మొత్తం ఖాళీలు : 400

అర్హత: డిగ్రీ తప్పనిసరి

వయసు: 01.12.2025 నాటికి 20 నుంచి 28 ఏళ్లు ఉండాలి. ఓబీసీకి మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు, ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్ల సడలింపు ఉంది.

స్టైపెండ్‌: నెలకు రూ.13,000.

దరఖాస్తు ఫీజు: ఓబీసీ,జనరల్, ఈడబ్ల్యూఎస్‌లకు రూ.800, ఎస్సీ, ఎస్టీలకు రూ.600, దివ్యాంగులకు రూ.400.

దరఖాస్తుకు చివరి తేదీ: 10.01.2026

ఎంపిక: రాత పరీక్ష

వెబ్‌సైట్‌: https://bankofindia.bank.in/career/recruitment-notice

హెచ్‌ఎస్‌ఎల్‌ : హిందుస్థాన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్, విశాఖపట్నంలో మేనేజర్ల పోస్టుకు నోటిఫికేషన్​ విడుదల చేసింది. ఫిక్స్‌డ్‌, ఒప్పంద టర్మ్‌ ప్రాతిపదికన మేనేజర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

సీనియర్‌ చీఫ్‌ ప్రాజెక్ట్‌ సూపరింటెండెంట్‌ (టెక్నికల్‌): 02

జనరల్‌ మేనేజర్‌ (హెచ్‌ఆర్‌,టెక్నికల్): 02

మేనేజర్‌ (హెచ్‌ఆర్‌): 03

డిప్యూటీ మేనేజర్‌ (ఫైనాన్స్‌,సేఫ్టీ): 02

డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌: 01

అర్హత: పోస్టును అనుసరించి కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత విభాగాల్లో డిగ్రీతో పాటు ఉద్యోగానుభవం కూడా ఉండాలి.

జీతం: జనరల్‌ మేనేజర్‌కు నెలకు రూ.1,00,000-2,60,000. డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌కు నెలకు రూ.80,000-2,20,000. మేనేజర్‌కు నెలకు రూ.60,000-1,80,000. డిప్యూటీ మేనేజర్‌కు నెలకు రూ.50,000-.1,60,000. సూపరింటెండెంట్‌కు నెలకు రూ.2,15,000.

వయసు: డిప్యూటీ జనరల్‌ మేనేజర్, మేనేజర్‌కు 45 ఏళ్లు, డిప్యూటీ మేనేజర్‌కు 35 ఏళ్లు, సూపరింటెండెంట్‌కు 56 ఏళ్లు మించకూడదు,జనరల్‌ మేనేజర్‌కు 52 ఏళ్లు.

ఎంపిక: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 13-01-2026.

వెబ్‌సైట్‌:https://indiansalt.com/career.php

రైల్‌ ఇండియా: రైల్‌ ఇండియా టెక్నికల్‌ అండ్‌ ఎకనామిక్‌ సర్వీస్‌ లిమిటెడ్‌ (రైట్స్‌), గురుగ్రామ్‌ రెగ్యులర్‌ ప్రాతిపదికన మేనేజర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. నోటిఫికేషన్​ను విడుదల చేసింది

డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌(సివిల్, మెరైన్, స్ట్రక్చరల్‌ ఎక్స్‌పర్ట్‌): 01

గ్రూప్‌ జనరల్‌ మేనేజర్‌(హెచ్‌ఆర్‌): 01

డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌(హెచ్‌ఆర్‌): 02

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగాలో డిగ్రీ (సివిల్‌ ఇంజినీరింగ్‌), పీజీడీబీఏ/ఎంబీఏ/ పీజీడీఎం/పీజీడీబీఎం/ పీజీడీహెచ్‌ఆర్‌ఎంతో పాటు ఉద్యోగానుభవం కూడా ఉండాలి.

వయసు: 41 ఏళ్ల నంచి 53 ఏళ్లు వరకు ఉండాలి.

వేతన శ్రేణి: నెలకు రూ.70,000 - రూ.2,80,000.

దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీలకు రూ.600, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు మాత్రం రూ.300.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 27.01.2026

ఎంపిక: ఇంటర్వ్యూ

వెబ్‌సైట్‌: https://www.rites.com/Career

ఐఎఆర్‌ఐ: ఇండియన్‌ అగ్రికల్చరల్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఐకార్‌), న్యూదిల్లీలో ల్యాబ్‌ అసిస్టెంట్లు పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. నోటిఫికేషన్​ను విడుదల చేసింది. ఒప్పంద ప్రాతిపదికన పోస్టులను భర్తీచేయనుంది.

ల్యాబ్‌ అసిస్టెంట్‌ : 01

అర్హత: ఇంటర్మీడియట్‌ (సైన్స్‌ సబ్జెక్ట్‌) ఉత్తీర్ణతతో పాటు సంబంధిత రంగంలో అనుభవం కూడా ఉండాలి.

జీతం: నెలకు రూ.42,000.

వయసు: 35 సంవత్సరాలు మించకూడదు

ఇంటర్వ్యూ తేదీ: 06.01.2026.

వేదిక: ఐఏఆర్‌ఐ, డివిజన్‌ ఆఫ్‌ ఫుడ్‌ సైన్స్‌ అండ్‌ పోస్ట్‌ హార్వెస్ట్‌ టెక్నాలజీ, పుసా క్యాంపస్, న్యూదిల్లీ.

వెబ్‌సైట్‌: https://www.iari.res.in/bms/announcements/jobs.php

పోర్ట్‌ అథారిటీ : పోర్ట్‌ అథారిటీ ముంబయిలో ఒప్పంద ప్రాతిపదికన జూనియర్‌ ఇంటర్న్‌ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. నోటిఫికేషన్​ను విడుదల చేసింది.

జూనియర్‌ ఇంటర్న్‌(ఎలక్ట్రికల్‌): 05

అర్హత: ఎలక్ట్రికల్‌ డిప్లొమాతో పాటు అనుభవం కూడా ఉండాలి.

వయసు: 35 ఏళ్లు మించకూడదు.

జీతం: నెలకు రూ.40,000.

ఎంపిక: షార్ట్‌ లిస్టింగ్, విద్యార్హతలు, టెస్ట్‌/ఇంటర్వ్యూ.

దరఖాస్తుల చివరి తేదీ: 12.01.2026.

వెబ్‌సైట్‌:https://mumbaiport.gov.in

ఐఓసీఎల్​లో నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు - ఇలా దరఖాస్తు చేసుకోండి

ఎన్‌సీఎల్‌లో సాంకేతిక కొలువులు - ఇలా దరఖాస్తు చేసుకోండి