ETV Bharat / education-and-career
దీన్‌దయాళ్ పోర్ట్ అథారిటీ, ఈసీఐఎల్, ఎయిమ్స్ రాజ్‌కోట్‌లో ఉద్యోగాలు
దీన్‌దయాళ్ పోర్ట్ అథారిటీలో ఒప్పంద ప్రాతిపదికన 10 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు - ఈసీఐఎల్‌లో ప్రాజెక్ట్ ఇంజినీర్లు - ఎయిమ్స్ రాజ్‌కోట్‌లో ఒప్పంద ప్రాతిపదికన సీనియర్ రెసిడెంట్ పోస్టులు

By ETV Bharat Andhra Pradesh Team
Published : January 10, 2026 at 5:40 PM IST
Deendayal Port Authority Jobs: దీన్‌దయాళ్ పోర్ట్ అథారిటీ, ఖచ్ (గుజరాత్) ఒప్పంద ప్రాతిపదికన 10 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులను భర్తీ చేయనుంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూలతో నియామకాలు జరుగుతాయి. డ్రెజర్/టగ్స్, ఫ్లోటింగ్ క్రాఫ్ట్స్, లైబ్రరీ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి.
పోస్టు: అసిస్టెంట్ మేనేజర్ (డ్రెజర్/టగ్స్)
ఖాళీలు: 3
అర్హత: ఇంజినీర్స్ సర్టిఫికెట్స్ ఆఫ్ కాంపిటెన్సీ/ మెరైన్ ఇంజినీరింగ్ వర్క్‌షాప్‌లో నాలుగేళ్ల అప్రెంటిస్‌షిప్ లేదా ఇంజినీర్ రూమ్ ఆర్టిఫిషర్‌గా నాలుగేళ్ల అనుభవం/ ఇండియన్ నేవీలో వాచ్ కీపింగ్ ఇంజినీర్ ఆన్ ఓషన్ గోయింగ్ వెసల్స్‌గా రెండేళ్ల అనుభవం ఉండాలి.
పోస్టు: అసిస్టెంట్ మేనేజర్ (ఫ్లోటింగ్ క్రాఫ్ట్స్)
ఖాళీలు: 6
అర్హత: ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ డిగ్రీ. మెరైన్ ఎలక్ట్రికల్ ఇన్‌స్టాలేషన్‌లో మూడేళ్ల అనుభవం/ ఇండియన్ నేవీలో చీఫ్ ఎలక్ట్రికల్ ఆర్టిఫిషర్‌గా పనిచేయాలి.
పోస్టు: అసిస్టెంట్ మేనేజర్ (లైబ్రరీ)
ఖాళీలు: 1
అర్హత: లైబ్రరీ సైన్స్/ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ డిగ్రీ, మూడు నెలల వ్యవధి ఉండే కంప్యూటర్ అప్లికేషన్ సర్టిఫికెట్ కోర్సు పూర్తిచేయాలి. లైబ్రేరియన్‌గా మూడేళ్ల అనుభవం ఉండాలి.
షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత సమాచారం
విద్యార్హతలు, ఉద్యోగానుభవంతో అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేసి రాత పరీక్ష/ ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. రాత పరీక్ష/ ఇంటర్వ్యూ తేదీ, నిర్వహణ విధానం మొదలైన వివరాలను షార్ట్ లిస్ట్ చేసి వారికి తెలియజేస్తారు. రాత పరీక్ష/ ఇంటర్వ్యూల్లో అర్హత సాధించిన వారిని వైద్య పరీక్షల అనంతరం తుది ఎంపిక చేస్తారు. ప్రస్తుతం వాడుకలో ఉన్న ఈమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్లను మాత్రమే దరఖాస్తులో రాయాలి. పూర్తిచేసిన అప్లికేషన్ ప్రింట్‌అవుట్‌కు సంబంధిత ధ్రువపత్రాలను జతచేసి స్పీడ్/ రిజిస్టర్డ్ పోస్టులో పంపాలి.
ముఖ్యాంశాలు
వయసు: 28 సంవత్సరాలు మించకూడదు. ఓబీసీ (ఎన్‌సీఎల్)కు మూడేళ్లు, ఎస్సీ/ఎస్టీకి ఐదేళ్ల సడలింపు ఉంటుంది.
వేతన శ్రేణి: నెలకు రూ.40,000-1,40,000. మూలవేతనానికి అదనంగా వీడీఏ, హెచ్‌ఆర్‌ఏ, గ్రాట్యుటీ, ఎన్‌పీఎస్, గ్రూప్ ఇన్‌స్యూరెన్స్, ఉద్యోగి కుటుంబానికి వైద్య సదుపాయాలు ఉంటాయి.
చిరునామా: ద సెక్రటరీ, దీన్‌దయాళ్ పోర్ట్ అథారిటీ, పోస్ట్ బ్యాగ్ నం.50, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ బిల్డింగ్, టాగోర్ రోడ్, గాంధీధామ్ (ఖచ్), గుజరాత్ - 370 201.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 15.01.2026
పోస్టు ద్వారా దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 27.01.2026
వెబ్‌సైట్: www.deendayalport.gov.in
ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్), హైదరాబాద్ అప్రెంటిస్‌ల కోసం దరఖాస్తులు కోరుతోంది.
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్-200
డిప్లొమా అప్రెంటిస్-48
విభాగాలు: ఈసీఈ, సీఎస్‌ఈ/ఐటీ, మెకానికల్, ఈఈఈ, ఈఐఈ, సివిల్, కెమికల్.
అర్హత: డిప్లొమా లేదా బీఈ/ బీటెక్ (మెకానికల్/ఎలక్ట్రానిక్స్, ఈసీఈ) ఉండాలి.
వయసు: 31.12.2025 నాటికి 25 ఏళ్లు ఉండాలి. ఎస్సీ, ఎస్టీకి ఐదేళ్లు, ఓబీసీకి మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపుఉంటుంది.
స్టైపెండ్: నెలకు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌కు రూ.9,000, డిప్లొమా అప్రెంటిస్‌కు రూ.8,000.
ఎంపిక: ధ్రువపత్రాల పరిశీలన, విద్యార్హతల మెరిట్‌తో.
దరఖాస్తుకు చివరి తేదీ: 20.01.2026
వెబ్‌సైట్: https://www.ecil.co.in/jobs.html
ఈసీఐఎల్‌లో ప్రాజెక్ట్ ఇంజినీర్లు
ఈసీఐఎల్, హైదరాబాద్ ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది.
ప్రాజెక్ట్ ఇంజినీర్: 04
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్‌తో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.
వయసు: 33 ఏళ్లు.
వేతనం: నెలకు రూ.40,000 - రూ.55,000.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 20.01.2026.
ఎంపిక: ఇంటర్వ్యూతో
వెబ్‌సైట్: https://www.ecil.co.in/jobs.html
సీనియర్ రెసిడెంట్-41: ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్), రాజ్‌కోట్ ఒప్పంద ప్రాతిపదికన సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఎండీ, డీఎన్‌బీ, ఎమ్మెస్సీ, ఎంఎస్‌తో పాటు పని అనుభవం ఉండాలి.
వయసు: 12.01.2026 నాటికి 45 ఏళ్లు ఉండాలి. ఎస్సీ, ఎస్టీకి ఐదేళ్లు, ఓబీసీకి మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
వేతనం: నెలకు రూ.67,700.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 12.01.2026
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌లకు రూ.1000. ఎస్సీ, ఎస్టీలకు రూ.800.
ఎంపిక: ఇంటర్వ్యూతో
వెబ్‌సైట్: https://aiimsrajkot.edu.in/recruitmentnnew
శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో బృందం - స్వామివారి పాదాల చెంత PSLV C62 రాకెట్ నమూనా
ట్రావెల్స్ దోపిడీ నివారణకు రవాణా శాఖ చర్యలు - అందుబాటులోకి టోల్‌ఫ్రీ నంబరు

