ETV Bharat / education-and-career
ఐఓసీఎల్‌లో నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు - ఇలా దరఖాస్తు చేసుకోండి
నెలకు రూ.25,000 నుంచి రూ. 1,05,000 జీతం - పరీక్ష కేంద్రాల సమాచారం, సీబీటీ తేదీ ఈ-మెయిల్ ద్వారా సమాచారం!

By ETV Bharat Andhra Pradesh Team
Published : December 24, 2025 at 3:53 PM IST
IOCL Recruitment Notification 2025: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్)లో జూనియర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్ (జేఈఏ), జేఈఏ (పీఅండ్‌యూ), జేఈఏ (పీ అండ్‌యూ-ఓఅండ్‌ఎం), ఫైర్ అండ్ సేఫ్టీ, జూనియర్ క్వాలిటీ కంట్రోల్ అనలిస్ట్ వంటి నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేయడానికి భారీ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలి.
జీతం : నెలకు రూ.25,000 నుంచి రూ. 1,05,000. మూలవేతనానికి అదనంగా హెచ్‌ఆర్‌ఏ, ప్రొడక్టివిటీ,డీఏ, పర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్‌లు, గ్రూప్ ఇన్‌స్యూరెన్స్, పీఎఫ్, ఎల్‌టీసీ, హౌస్ బిల్డింగ్, గ్రాట్యుటీ, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్సులు మొదలైన సదుపాయాలు ఉంటాయి.
పరీక్షా విధానం : ప్రశ్నపత్రం ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలతో 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. ప్రశ్నకు ఒక మార్కు. ఈ పరీక్షకు రుణాత్మక మార్కులు లేవు. సమయం 120 నిమిషాలు. ప్రశ్నపత్రంలో మూడు సెక్షన్లు ఉంటాయి. సెక్షన్-ఏలో సబ్జెక్టు నాలెడ్జ్. దీనికి 75 మార్కులు. సెక్షన్-బీలో న్యూమరికల్ ఎబిలిటీ. దీనికి 15 మార్కులు. సెక్షన్-సీలో జనరల్ అవేర్‌నెస్.దీనికి 10 మార్కులు కేటాయించారు. ప్రశ్నాపత్రం ఇంగ్లిష్, హిందీల్లో ఉంటుంది.
పరీక్ష కేంద్రాల సమాచారాన్ని, సీబీటీ తేదీని ఈ-మెయిల్ ద్వారా తెలియజేస్తారు. సంస్థ వెబ్‌సైట్‌లోనూ పూర్తి వివరాలు ప్రకటిస్తారు. సీబీటీలో జనరల్ అభ్యర్థులు 40 శాతం, ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు 35 శాతం వరకు కనీసార్హత మార్కులు సాధించాలి. అభ్యర్థులను పోస్టుకు ఇద్దరిని చొప్పున స్కిల్/ ప్రొఫిషియన్సీ/ ఫిజికల్ టెస్ట్‌లకు ఎంపిక చేస్తారు. ఇందులోనూ విజయవంతమైతే ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. అనంతరం కేటగిరీలవారీగా తుది ఎంపిక చేస్తారు.
సమయ నిర్వహణ : ఈ పరీక్షలో సబ్జెక్టు పరిజ్ఞానానికే ఎక్కువ మార్కులు కేటాయించారు. సబ్జెక్టు సంబంధిత ముఖ్యాంశాల అధ్యయనం, పునశ్చరణ ఎక్కువగా చేయాలి. జనరల్ అవేర్‌నెస్, న్యూమరికల్ ఎబిలిటీపై అవగాహన కోసం పోటీ పరీక్షల పాత ప్రశ్న పత్రాలను సాధన చేయాలి. వ్యవధిలోగా సమాధానాలు గుర్తించడమూ చాలా ముఖ్యం. సమయ నిర్వహణపై పట్టు సాధించడం కోసం మాక్ టెస్టులు రాయడం, సాధన చేయడం చాలా ఉపయోగపడుతుంది. ఎటువంటి రుణాత్మక మార్కులు లేవు కాబట్టి అన్ని ప్రశ్నలకూ సమాధానాలు రాయొచ్చు. ముందుగా తెలిసినవీ, ఆ తర్వాత తెలియని ప్రశ్నలు ప్రయత్నించవచ్చు.
వయసు: 31.12.2025 నాటికి అభ్యర్థి 26 సంవత్సరాలు మించకూడదు. ఓబీసీ-ఎన్‌సీఎల్‌కు మూడేళ్లు, ఎస్సీ/ఎస్టీకి ఐదేళ్లు, దివ్యాంగులకు పది నుంచి పదిహేనేళ్ల సడలింపు మాత్రం ఉంటుంది.
పోస్టులు:
- పోస్టు: జూనియర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్ (జేఈఏ)(ప్రొడక్షన్)
మొత్తం ఖాళీలు: 232
అర్హత: కెమికల్ టెక్నాలజీ/ కెమికల్ టెక్నాలజీ (ఫెర్టిలైజర్/ పెట్రో కెమికల్ ఇంజినీరింగ్/ పెట్రో కెమికల్ టెక్నాలజీ/కెమికల్ ఇంజినీరింగ్/ రిఫైనరీ అండ్ పెట్రో కెమికల్ ఇంజినీరింగ్ బ్రాంచ్‌తో డిప్లొమా లేదా బీఎస్సీ (మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ/ ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ)
- పోస్టు: జేఈఏ(పీఅండ్‌యూ)
మొత్తం ఖాళీలు: 37
అర్హత: ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రికల్ పవర్ సిస్టమ్ /మెకానికల్ బ్రాంచ్‌తో ఇంజినీరింగ్ డిప్లొమా లేదా బీఎస్సీ (ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ/ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్,కెమిస్ట్రీ/ ) సెకండ్ క్లాస్ బాయిలర్ కాంపిటెన్సీ సర్టిఫికెట్ (బీసీసీ)/ బాయిలర్ అటెండెంట్‌లో నేషనల్ అప్రెంటిస్‌షిప్ సర్టిఫికెట్ కూడా ఉండాలి.
- పోస్టు: జేఈఏ(పీ అండ్‌యూ-ఓఅండ్‌ఎం)
మొత్తం ఖాళీలు: 22
అర్హత: ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్/ఎలక్ట్రికల్/ ఎలక్ట్రికల్ పవర్ సిస్టమ్/ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ (ఇండస్ట్రియల్ కంట్రోల్) బ్రాంచ్‌తో డిప్లొమా.
- పోస్టు: ఫైర్ అండ్ సేఫ్టీ
మొత్తం ఖాళీలు: 51
అర్హత: ఇంటర్మీడియట్‌తో పాటు ఫైర్ సబ్-ఆఫీసర్స్ కోర్సు సర్టిఫికెట్, హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. ఎత్తు 165 సెం.మీ. (ఎస్టీలకు 5 సెం.మీ. వరకు మినహాయింపు), ఛాతీ 81-86 సెం.మీ., బరువు మాత్రం 50 కేజీల వరకు ఉండాలి.
- పోస్టు: జూనియర్ క్వాలిటీ కంట్రోల్ అనలిస్ట్
మొత్తం ఖాళీలు: 20.
అర్హత: బీఎస్సీ (ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ/ ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ).
వివరాలు :
విద్యార్హతల డిప్లొమా, డిగ్రీలను ప్రత్యేక వర్గాలకు చెందినవారు 45 శాతం, జనరల్ అభ్యర్థులు 50 శాతంతో పూర్తిచేయాలి. జనరల్/ఈడబ్ల్యూఎస్/ ఓబీసీ-ఎన్‌సీఎల్‌లకు రూ.300. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ మాజీ సైనికోద్యోగులకు ఎటువంటి ఫీజు లేదు.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 09.01.2026
ఎన్‌సీఎల్‌లో సాంకేతిక కొలువులు - ఇలా దరఖాస్తు చేసుకోండి
యువత కలల సాకారానికి "కౌశలం" - ఆన్లైన్లో కొనసాగుతున్న పరీక్షలు

