ETV Bharat / education-and-career
"మారిటైమ్ కోర్సుల్లో" అడ్మిషన్లు - నౌకాయాన రంగంలో ఉద్యోగావకాశాలు!
ఇండియన్ మారిటైమ్ యూనివర్సిటీ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల - దరఖాస్తు, వివరాలివీ

By ETV Bharat Andhra Pradesh Team
Published : April 21, 2026 at 2:49 PM IST
IMU CET 2026 Admissions : ప్రపంచ వ్యాప్తంగా నౌకాయానం కీలకంగా మారింది. భారీ స్థాయిలో సరకు రవాణాలో నిపుణులు, నౌకల పాత్ర కీలకంగా మారింది. తద్వారా మారిటైమ్ కోర్సులకు డిమాండ్ ఏర్పడింది. ఈ క్రమంలోనే మారిటైమ్ యూనివర్సిటీ అడ్మిషన్ల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి దేశవ్యాప్తంగా క్యాంపస్‌లు, అనుబంధ కాలేజీలు ఉన్నాయి. ఈ కోర్సులు పూర్తిచేసిన విద్యార్థులకు డెక్, ఇంజినీరింగ్ విభాగాల్లో జాబ్స్ లభిస్తాయి.
ఐఎంయూ సెట్ :
- యూజీ కోర్సుల ప్రశ్నాపత్రం 200 మార్కులకు ఉంటుంది.
- ఎంబీఏ కోర్సులకు 120 ప్రశ్నలు ఉంటాయి.
- ఎంటెక్ కోర్సుల ఎగ్జామ్ పేపర్ 120 మార్కులకు ఉంటుంది. ఆంగ్లం, గణితంతో పాటు నేవల్ ఆర్కిటెక్చర్/ మెకానికల్ / సివిల్ / మెరైన్ వీటిలో ఏదో ఒక విభాగాన్ని సెలక్ట్ చేసుకోవాలి. అన్ని పరీక్షలూ ఆబ్జెక్టివ్ తరహాలో ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికీ పావు మార్కు తగ్గిస్తారు. మాదిరి ప్రశ్నలు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.
- ఐఎంయూ పీహెచ్‌డీ, ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ, ఎంఎస్ రిసెర్చ్ కోర్సులనూ అందిస్తోంది. వీటిలో ప్రవేశానికి ప్రత్యేకంగా నోటిఫికేషన్ ఉంటుంది. ఎగ్జామ్, ఇంటర్వ్యూలతో ఇందులో అవకాశం కల్పిస్తారు.
ఇవీ కోర్సులు :
- బీటెక్ : నేవల్ ఆర్కిటెక్చర్ అండ్ షిప్ బిల్డింగ్, నేవల్ ఆర్కిటెక్చర్ అండ్ ఓషన్ ఇంజినీరింగ్, మెరైన్ ఇంజినీరింగ్
- బీఎస్సీ : నాటికిల్ సైన్స్
- బీబీఏ : లాజిస్టిక్స్, రిటైలింగ్ అండ్ ఇ-కామర్స్. మారిటైమ్ లాజిస్టిక్స్
- డిప్లొమా : నాటికల్ సైన్స్ (కోర్సు వ్యవధి సంవత్సరం)
- అర్హత : ఇంటర్లో ఎంపీసీ గ్రూపులో 60 శాతం మార్కులు సాధించిన వారు బీటెక్, డిప్లొమా, బీఎస్సీ సంబంధించిన కోర్సులకు అప్లై చేసుకోవచ్చు. అలాగే 10వ తరగతి లేదా ఇంటర్మీడియట్ ఆంగ్ల సబ్జెక్టులో కనీసం 50 శాతం మార్కులు సాధించాలి.
- బీబీఏ కోర్సులకు ఇంటర్మీడియట్లో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత అయిన అన్ని గ్రూపుల విద్యార్థులూ దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంటెక్, ఎంబీఏ, పీజీ డిప్లొమా కోర్సులు :
- ఎంటెక్ : డ్రెడ్జింగ్ అండ్ హార్బర్ ఇంజినీరింగ్, ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్, నేవల్ ఆర్కిటెక్చర్ అండ్ ఓషన్ ఇంజినీరింగ్, మెరైన్ టెక్నాలజీ.
- ఎంబీఏ : పోర్ట్ అండ్ షిప్పింగ్ మేనేజ్‌మెంట్, ఇంటర్నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ అండ్ లాజిస్టిక్స్ మేనేజ్‌మెంట్, పోర్ట్ అండ్ షిప్పింగ్ లాజిస్టిక్స్, మారిటైమ్ మేనేజ్‌మెంట్(ఆన్‌లైన్).
- అర్హత : 60 శాతం మార్కులతో అనుబంధ లేదా సంబంధ బ్రాంచీలో బీటెక్ ఉత్తీర్ణతతో ఎంటెక్ సంబంధించిన కోర్సులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంబీఏ కోర్సులకు 50 శాతం మార్కులతో ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉన్నావారు అర్హులు.
- పీజీ డిప్లొమా : మెరైన్ ఇంజినీరింగ్ కోర్సు (కాలపరిమితి ఒక సంవత్సరం)
- అర్హత : బీటెక్/బీఈ 50 శాతం మార్కులతో నావల్ ఆర్కిటెక్చర్/ మెకానికల్ ఇంజినీరింగ్ ఉత్తీర్ణత.
- ఆన్‌లైన్ ద్వారా పీజీ డిప్లొమా ఇన్ మెరైన్ లా కోర్సును అందిస్తున్నారు. ఈ కోర్సు కాల వ్యవధి ఒక సంవత్సరం. ఇందుకోసం డిగ్రీలో 50 శాతం మార్కులు సాధించాలి. వీరు ఎగ్జామ్ లేకుండానే నేరుగా జాయిన్ కావొచ్చు.
ప్రవేశం :
ఈ సంస్థల్లోని సీట్లకు వివిధ మార్గాల్లో ప్రవేశం పొందొచ్చు. బీబీఏ కోర్సులకు సీయూఈటీ యూజీ/ఇంటర్మీడియట్ మార్కులతో అవకాశం కల్పిస్తారు. పీజీలో కొన్ని కోర్సులకు గేట్/ సీయూఈటీ పీజీ స్కోరుతో అప్లై చేసుకోవచ్చు. సీమ్యాట్/ క్యాట్/ మ్యాట్ స్కోరుతో ఎంబీఏ సీట్లకు పోటీ పడొచ్చు. కొన్ని కోర్సులకు అకడమిక్ మార్కుల మెరిట్‌తోనూ తీసుకుంటారు. బీఎస్సీ, డిప్లొమా బీటెక్ కోర్సులకు ఐఎంయూ సెట్ స్కోరుతో ప్రవేశాలు కల్పిస్తారు.
వివరాలు :
ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ : ఏప్రిల్ 24 కాగా బీబీఏ కోర్సుకు జూన్ 17 వరకు ఛాన్స్ ఉంది.
దరఖాస్తు ఫీజు : ఎస్సీ, ఎస్టీలకు రూ.800. మిగిలిన వారికి రూ.1200. బీబీఏ కోర్సుకు మాత్రం ఎస్సీ, ఎస్టీలకు రూ.140. ఇతరులకు రూ.200గా ఉంది.
ఎగ్జామ్ తేదీ : మే 24
వెబ్‌సైట్ : https://www.imu.edu.in/
నిరుద్యోగులకు తీపి కబురు - 3003 పోస్టుల భర్తీకి "SSC" నోటిఫికేషన్
ఇంటర్ తర్వాత "మేనేజ్‌మెంట్ కోర్సు"ల్లో చేరాలనుకుంటున్నారా? - "IIFT" కాకినాడ నోటిఫికేషన్ వచ్చేసింది

