ETV Bharat / education-and-career
ఐఐటీ మద్రాస్‌లో "ప్రాజెక్ట్ ఇంజినీర్" ఉద్యోగాలు - నెలకు రూ.లక్ష వరకు జీతం - రేపే లాస్ట్ డేట్!
- సీనియర్ ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్న ఐఐటీ మద్రాస్ - ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసుకునే అవకాశం!

Published : June 2, 2026 at 2:55 PM IST
|Updated : June 2, 2026 at 3:34 PM IST
IIT Madras Notification 2026: దేశంలోనే ప్రముఖ సంస్థ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ (IIT Madras) గుడ్‌న్యూస్ చెప్పింది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన సీనియర్ ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అర్హత గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మరి ఈ పోస్టులకు అర్హులు ఎవరు? ఎలా అప్లై చేసుకోవాలి? జీతం సహా తదితర వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.
పోస్టు పేరు - సీనియర్ ప్రాజెక్ట్ ఇంజినీర్
ఖాళీలు - 08
అర్హతలు: ఎలక్ట్రానిక్స్ / ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో 4 సంవత్సరాల డిగ్రీ (B.E / B.Tech) లేదా అప్లైడ్ ఫిజిక్స్/తత్సమాన విభాగంలో M.Sc. ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే సంబంధిత పరిశ్రమ లేదా పరిశోధనా సంస్థల్లో 2 నుంచి 3 సంవత్సరాల అనుభవం ఉండాలి. SPICE మోడలింగ్, TCAD సిమ్యులేషన్, ఫోటోనిక్స్ డివైజ్ డిజైన్, PIC & EIC టేప్‌అవుట్ అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.
ఉద్యోగ కాలపరిమితి: ఈ పోస్టులకు ఎన్నికైన అభ్యర్థులు కాంట్రాక్ట్ ప్రకారం ఒక సంవత్సరం ఉద్యోగం చేయాల్సి ఉంటుంది. అయితే, అభ్యర్థి పనితీరును బట్టి దీనిని 5 సంవత్సరాల వరకు పొడిగించే అవకాశం ఉంటుంది.
వేతనం: ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులను నెలకు రూ.75 వేల నుంచి రూ.1లక్ష వరకు ఇస్తారు. ఒకవేళ మీ పనితీరును బట్టి కాంట్రాక్ట్ పొడిగిస్తే ప్రతీ సంవత్సరం 5 శాతం ఇంక్రిమెంట్ ఉంటుంది.
పని చేయాల్సిన విభాగాలు: ఎంపికైన అభ్యర్థులు రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ టీమ్స్‌లో పని చేయాల్సి ఉంటుంది. అందులో PDK అండ్ EPDA టీమ్, PIC డిజైన్ అండ్ సిమ్యులేషన్ టీమ్, ప్యాకేజింగ్ అండ్ అసెంబ్లీ టీమ్, ఎలక్ట్రానిక్స్ IC డిజైన్ అండ్ టేప్‌అవుట్ టీమ్ వంటి విభాగాల్లో వర్క్ చేయాలి.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష/స్కిల్ టెస్ట్/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. ముందుగా అభ్యర్థులు సమర్పించిన వివరాల ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేస్తారు. ఎంపికైన వారి సంఖ్యను బట్టి ఐఐటీ మద్రాస్ (రాత పరీక్ష/స్కిల్ టెస్ట్) నిర్వహిస్తుంది. షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులను ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఇంటర్వ్యూ సమయానికి ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రింటవుట్, ఒరిజినల్ సర్టిఫికెట్లను వెంట తీసుకురావాలి. తక్కువ మంది షార్ట్‌లిస్ట్ అయితే నేరుగా ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఒకవేళ సంఖ్య ఎక్కువ ఉంటే వాళ్లకు రాత పరీక్ష లేగా స్కిల్ టెస్ట్ నిర్వహించి ఇంటర్వ్యూకు సెలెక్ట్ చేస్తారు.
దరఖాస్తు విధానం :
- ఈ పోస్టులకు కేవలం ఆన్‌లైన్ ద్వారా మాత్రమే అప్లై చేసుకోవాలి. అందుకోసం ముందుగా ఐఐటీ మద్రాస్ అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
- ఆ వివరాలతో లాగిన్ అయ్యి మీరు అప్లై చేయాలనుకునే పోస్టులను ఎంపిక చేసుకుని వ్యక్తిగత వివరాలు, అర్హతలు, అనుభవం వంటి వివరాలు ఎంటర్ చేసి కావాల్సిన డాక్యుమెంట్స్‌ను అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాలి.
ఇవి గుర్తుంచుకోవాలి :
- అభ్యర్థులు కేవలం ఆన్‌లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. అప్లికేషన్ హార్డ్ కాపీని సంస్థకు పంపాల్సిన అవసరం లేదు. దీనిని కేవలం పరీక్ష లేదా ఇంటర్వ్యూ సమయానికి వెంట తెచ్చుకుంటే సరిపోతుంది.
- ఉద్యోగాలు పూర్తిగా కాంట్రాక్ట్ ప్రాతిపదికన మాత్రమే ఉంటాయి. పర్మినెంట్ చేయమని అడిగే హక్కు అభ్యర్థులకు ఉండదు.
- ఒకవేళ అభ్యర్థులు ఇప్పటికే ఐఐటీ మద్రాస్‌కు సంబంధించిన ఏదైనా ప్రాజెక్ట్‌లో పనిచేస్తుంటే, అప్లికేషన్ సమయంలో NOC సమర్పించడం తప్పనిసరి.
- ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: జూన్ 3, 2026. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.
"పీహెచ్డీ" చేయాలనుకుంటున్నారా? - CSIR-యూజీసీ నెట్‌కు ఇప్పుడే అప్లై చేసుకోండిలా!
బీఎస్ఎన్ఎల్ JTO రిక్రూట్మెంట్ - తెలుగు రాష్ట్రాల్లోనూ ఖాళీలు - మొదటి నెల నుంచే మంచి జీతం!

