ETV Bharat / education-and-career

ఇంటర్​తో ​ఎయిర్​ఫోర్స్​లో "మెడికల్ అసిస్టెంట్ జాబ్స్​" - ఇప్పుడే అప్లై చేసుకోండిలా!

భారత వాయుసేనలో పని చేసే అద్భుత అవకాశం - మెడికల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల!

IAF Medical Assistant Jobs
IAF Medical Assistant Jobs (Getty Images)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : July 7, 2026 at 10:51 AM IST

2 Min Read
Choose ETV Bharat

IAF Medical Assistant Jobs : ఇండియన్ ఎయిర్​ఫోర్స్​లో కొలువు సాధించాలనుకునే అభ్యర్థులకు గుడ్​న్యూస్. భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన భారత వాయుసేన ఎయిర్‌మెన్ ఇంటేక్ 02/2027 కోసం గ్రూప్-"Y" (నాన్-టెక్నికల్) మెడికల్ అసిస్టెంట్ ట్రేడ్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన పురుష అభ్యర్థుల నుంచి ఆన్​లైన్​లో జులై 6వ తేదీ నుంచి దరఖాస్తులు కోరుతోంది. మరి, ఈ పోస్టులకు ఉండాల్సిన అర్హతలేంటి? వయోపరిమితి, అప్లికేషన్ ఫీజు ఎంత? ఎలా అప్లై చేసుకోవాలి? దరఖాస్తుకు చివరి తేదీ, పరీక్ష తేదీలకు సంబంధించిన పూర్తి వివరాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.

ఇండియన్ ఎయిర్​ఫోర్స్ ఎయిర్‌మెన్ ఇంటేక్ 02/2027 కోసం గ్రూప్-"వై" (నాన్-టెక్నికల్) మెడికల్ అసిస్టెంట్ ట్రేడ్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసి దరఖాస్తులు స్వీకరిస్తోంది. అర్హులైన పురుష అభ్యర్థులు జులై 06 నుంచి 26వ తేదీలోగా ఆన్​లైన్​లో అప్లై చేసుకోవచ్చు. 2026 సెప్టెంబర్ 22, 23 తేదీల్లో ఎంపిక పరీక్ష నిర్వహిస్తారు.

నోటిఫికేషన్ వివరాలు :

పోస్టు : గ్రూప్- 'Y' (నాన్-టెక్నికల్) మెడికల్ అసిస్టెంట్ (02/2027)

అర్హతలు :

  • ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలనుకునే అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులతో 10+2 / ఇంటర్​లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇంగ్లిష్ సబ్జెక్టులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
  • లేదా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇంగ్లిష్‌తో రెండు సంవత్సరాల ఒకేషనల్ కోర్సు(వృత్తి విద్య) కంప్లీట్ చేసి ఉండాలి.
  • లేదా డిప్లొమా/బీ.ఫార్మా/బీఎస్సీ (ఫార్మసీ)లో ఉత్తీర్ణత సాధించి నియామక సమయానికి స్టేట్ ఫార్మసీ కౌన్సిల్ లేదా ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (PCI)లో చెల్లుబాటు అయ్యే రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలి.

పరీక్ష లేకుండానే నేవీలో "275 ఉద్యోగాలు" - రూ.లక్షకు పైగా వేతనం!

గరిష్ఠ వయోపరిమితి :

ఇంటర్ అభ్యర్థులు జులై 1, 2006 నుంచి జులై 1, 2010 మధ్య జన్మించి ఉండాలి. డిప్లొమా/బీ.ఫార్మా / బీఎస్సీ (ఫార్మసీ) అవివాహిత అభ్యర్థులు జులై 1, 2003 నుంచి జులై 1, 2008 మధ్య, వివాహిత అభ్యర్ధులు జులై 1, 2003 నుంచి జులై 1, 2006 మధ్యలో జన్మించి ఉంటే ఈ పోస్టులకు అర్హులు.

వేతనం :

ఈ పోస్టులకు ఎంపికైన వారికి శిక్షణ టైమ్​లో నెలకు రూ.14,600 లభిస్తుంది. ట్రైనింగ్ కంప్లీట్ అయ్యాక రూ.26,900+ ఇతర అలవెన్సులు అందుతాయి.

సెలక్షన్ ప్రాసెస్ :

ఈ పోస్టులకు అభ్యర్థుల ఎంపిక మూడ ఫేజ్​లలో ఉంటుంది. ఫేజ్‌-1(ఆన్‌లైన్‌ రాత పరీక్ష), ఫేజ్‌-2(PET, అడాప్టబిలిటీ టెస్ట్-1,2, సర్టిఫికెషన్‌ వెరిఫికేషన్‌), ఫేజ్‌-3(వైద్య పరీక్షలు, మెరిట్‌ జాబితా) ఆధారంగా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది.

దరఖాస్తు విధానం :

తగిన అర్హతలు, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా అప్లై చేసుకోవాలి.

పరీక్ష ఫీజు : రూ.550+ జీఎస్‌టీ చెల్లించాల్సి ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు :

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం : జులై 6, 2026.

ఆన్‌లైన్ అప్లికేషన్​కు చివరి తేదీ : జులై 26, 2026.

ఆన్‌లైన్ పరీక్షలు ప్రారంభం : 22, 23 సెప్టెంబరు 2026.

ప్రొవిజనల్ సెలెక్ట్ లిస్ట్‌ : మే 2027 చివరి వారం

ఎన్‌రోల్‌మెంట్ లిస్ట్ : 01 జూన్ 2027.

ఇండియన్ ఎయిర్​ఫోర్స్ ఎయిర్‌మెన్ ఇంటేక్ 02/2027 గ్రూప్-"వై" (నాన్-టెక్నికల్) మెడికల్ అసిస్టెంట్ ట్రేడ్ పోస్టులకు సంబంధించిన పూర్తి నోటిఫికేషన్​, అప్లికేషన్ ప్రాసెస్​ పూర్తి సమాచారం కోసం ఈ లింక్​పై క్లిక్ చేయండి.

త్వరలో రైల్వే నుంచి మరో నోటిఫికేషన్​! - జులై 15 నుంచి దరఖాస్తులు!

రైల్వేలో 6,565 టెక్నీషియన్ పోస్టులకు "నోటిఫికేషన్" విడుదల - 'సికింద్రాబాద్' జోన్​లో ఎన్ని ఉన్నాయంటే?​