Bihar Election Results 2025

ETV Bharat / education-and-career

భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌లో ఉద్యోగాలు - ఐటీఐ చేసినా సరిపోతుంది

భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ ఉద్యోగాలకు ప్రకటన విడుదల - మంచి వేతనంతో ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌ ట్రెయినీ, టెక్నీషియన్‌-సీ ప్రభుత్వ ఉద్యోగాలు - పరీక్ష, మెడికల్ టెస్టుల ఆధారంగా ఎంపిక

Bharat Electronics Limited
Bharat Electronics Limited (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : October 15, 2025 at 7:14 PM IST

3 Min Read
Choose ETV Bharat

Engineering Assistant Trainee Jobs At Bharat Electronics Limited : ఉత్తర్​ప్రదేశ్​లోని ఘాజియాబాద్‌లో భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (బెల్‌) 49 పోస్టులను భర్తీ చేయనుంది. మొత్తం ఖాళీల్లో ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌ ట్రెయినీ-22, టెక్నీషియన్‌-సీలో 27 ఖాళీలు ఉన్నాయి. కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (సీబీటీ)తో అభ్యర్థులను ఎంపిక చేస్తారు. షార్ట్‌లిస్ట్‌ చేసిన అభ్యరులకు సమాచారాన్ని ఎస్‌ఎంఎస్, ఈ-మెయిల్‌ ద్వారా తెలియజేస్తారు. వీరు అడ్మిట్‌కార్డును బెల్​ అధికారిక వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. సీబీటీని దిల్లీ, ఎన్‌సీఆర్‌ పరిధిలో నిర్వహిస్తారు.

150 మార్కులకు పరీక్ష ఉంటుంది. ప్రశ్నపత్రంలో రెండు విభాగాలుంటాయి. పార్ట్‌-1లోని జనరల్‌ ఆప్టిట్యూడ్‌కు 50 మార్కులు ఉంటాయి. దీంట్లో భాగంగా మెంటల్‌ ఎబిలిటీ, అనలిటికల్, కాంప్రహెన్షన్‌ ఎబిలిటీ, లాజికల్‌ రీజనింగ్, బేసిక్‌ న్యూమరసీ, డేటా ఇంటర్‌ప్రెటేషన్, జనరల్‌ నాలెడ్జ్‌ నుంచి ప్రశ్నలు ఇస్తారు. పార్ట్‌-2లోని టెక్నికల్‌ ఆప్టిట్యూడ్‌ 100 మార్కులకు ఉంటుంది. అర్థమెటిక్​, మ్యాథ్స్ సబ్జెక్టులకు సంబంధిత ప్రశ్నలు ఇస్తారు.

జనరల్‌ అభ్యరులు 35 శాతం చొప్పున, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు 30 శాతం చొప్పున కనీసార్హతగా మార్కులు సాధించాల్సి ఉంటుంది. సీబీటీలో వచ్చిన మార్కుల ఆధారంగా షార్ట్‌లిస్ట్‌ చేసి మెడికల్​ టెస్టుల అనంతరం కేటగిరీలవారీగా తుది ఎంపిక చేస్తారు. ఈ పరీక్షను నవంబరు నెలలో నిర్వహించే అవకాశం ఉంది. ఎంపికైన ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌ ట్రెయినీలకు ఆరు నెలల శిక్షణ సమయం ఉంటుంది. ఈ సమయంలో నెలకు రూ.24 వేల చొప్పున స్టెపెండ్‌ చెల్లిస్తారు. ట్రైనింగ్​ తర్వాత గ్రెడేషన్‌ టెస్ట్‌లోనూ ఎంపికైనవారిని రెగ్యులర్‌ ఉద్యోగులుగా నియమిస్తారు.

సన్నద్ధత

  • ఇంజినీరింగ్‌ డిప్లొమా, ఐటీఐ ట్రేడ్‌లోని చాప్టర్​లను చదవాలి. ముఖ్యాంశాలను శ్రద్ధగా రివిజన్ చేసుకుంటే పార్ట్‌-2లో ఎక్కువ మార్కులు సంపాదించవచ్చు.
  • పార్ట్‌-1లోని జనరల్‌ ఆప్టిట్యూడ్‌ కోసం గతంలో జరిగిన వివిధ పోటీ పరీక్షల ప్రశ్నపత్రాలను ప్రాక్టీస్ చేయాలి.
  • ఆన్​లైన్​ పరీక్షను నవంబరులో నిర్వహించే అవకాశం ఉంది. ఇప్పటి నుంచే సన్నద్ధతను మొదలుపెడితే సమయం ఎక్కువగా వృథా కాకుండా ఉంటుంది. సానుకూల ఫలితాలను పొందే అవకాశం కూడా ఉంటుంది.
  • నెగటివ్‌ మార్కులు ఇందులో లేవు. అందువల్ల ముందుగా తెలిసిన ప్రశ్నలకు సమాధానాలు రాసి తర్వాత తెలియని ప్రశ్నల సమాధానాల కోసం ప్రయత్నించొచ్చు.

అర్హతలు

ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌ ట్రెయినీ : ఇంజినీరింగ్‌ డిప్లొమాలో ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్‌ సైన్స్, ఎలక్ట్రికల్, మెకానికల్‌ బ్రాంచ్‌లు కలిగి ఉండాలి.

టెక్నీషియన్‌-సీ : పదో తరగతి, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్‌ మెకానిక్, ఫిట్టర్‌ ట్రేడ్‌తో ఐటీఐ. ఏడాది సమయంలో నేషనల్‌ అప్రెంటిస్‌షిప్‌ సర్టిఫికెట్‌ కోర్సు పూర్తిచేయాలి.

జనరల్‌ అభ్యరులు 60 శాతం, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు 50 శాతంతో ఇంజినీరింగ్‌ డిప్లొమా లేదా ఐటీఐ పాసవ్వాలి.

వయసు: 01.10.2025 నాటికి 28 సంవత్సరాల వయసు మించకూడదు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీ-ఎన్‌సీఎల్‌కు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల వయోపరిమితి సడలింపు ఉంటుంది.

దరఖాస్తు ఫీజు : రూ.590. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మాజీ సైనిక ఉద్యోగులకు ఎటువంటి ఫీజు లేదు.

వేతన శ్రేణి : ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌ ట్రెయినీలకు నెలకు రూ.24,500 నుంచి 90,000 వేతనం ఉంటుది. టెక్నీషియన్‌-సీ ఉద్యోగులకు నెలకు రూ.21,500 నుంచి 82,000 అందుతుంది. మూలవేతనానికి అదనంగా డీఏ, పీఎఫ్, పెన్షన్, గ్రాట్యుటీ, గ్రూప్‌ ఇన్‌స్యూరెన్స్, వైద్య సదుపాయాలు ఉంటాయి.

ముఖ్యాంశాలు

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ : 30 అక్టోబరు 2025

  • ప్రభుత్వ, ప్రైవేట్‌ ఉద్యోగులు ధ్రువపత్రాల పరిశీలన సమయంలో నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్​ను సమర్పించాల్సి ఉంటుంది.
  • సీబీటీకి హాజరయ్యే ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మాజీ సైనికోద్యోగులకు స్లీపర్‌ క్లాస్‌ రైలు ఛార్జీలను మొత్తం చెల్లిస్తారు.
  • సీబీటీలో ఎంపికైనవారి అభ్యర్థుల వివరాలను వెబ్‌సైట్‌లో ప్రకటిస్తారు.

వెబ్‌సైట్‌: http://www.bel-india.in/

డిగ్రీ అర్హతతో ఆర్​బీఐలో ఉద్యోగాలు - ఎంపికైతే నెలకు రూ.రూ.1,50,000 జీతం! - చివరి తేదీ ఎప్పుడంటే?

తెలంగాణలో శిక్షణ - జర్మనీ, జపాన్​లో ఉద్యోగాలు!