ETV Bharat / education-and-career

ఇంజినీర్స్‌ ఇండియా లిమిటెడ్​లో డిప్యూటీ మేనేజర్ పోస్ట్​లు

కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్​లో ఒప్పంద ప్రాతిపదికన వివిధ పోస్టులు-కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రిసెర్చ్​లోను పలు అప్రెంటీస్​ పోస్టుల భర్తి

EIL LATEST JOBS NOTIFICATION
EIL LATEST JOBS NOTIFICATION (EENADU)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : December 30, 2025 at 4:14 PM IST

3 Min Read
Choose ETV Bharat

EIL LATEST JOBS NOTIFICATION: దేశంలోని పలు కేంద్ర సంస్థలు, రాష్ట్ర సంస్థల నుంచి ఉద్యోగాలకు సంబంధించిన ప్రకటన వెలువడింది. డిప్యూటీ మేనేజర్‌, ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌, ఆఫీస్‌ అటెండెంట్‌, ట్రేడ్‌ అప్రెంటిస్‌ విభాగంలో దరఖాస్తులను సంస్థలు ఆహ్వానిస్తున్నాయి. కావాల్సిన అర్హతలు కలిగి ఉద్యోగాన్వేషణలో ఉంటే మీరు చూసేయండి.

ఈఐఎల్‌లో

ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్ భారత్‌లో ప్రముఖ ఇంజినీరింగ్ సంస్థ. దీన్ని 1965లో స్థాపించారు. కేంద్ర ప్రభుత్వంలోని నవరత్న ప్రభుత్వ రంగ సంస్థల్లో ఇది ఒకటి. ఆయిల్, గ్యాస్, పెట్రోకెమికల్స్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, సస్టైనబుల్ ఎనర్జీ రంగాల్లో కన్సల్టెన్సీ సేవలు అందిస్తోంది. ఇంజినీర్స్‌ ఇండియా లిమిటెడ్ ప్రస్తుతం న్యూదిల్లీ మేనేజీరియల్‌ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది.

పోస్టులు: మేనేజర్‌-2, డిప్యూటీ మేనేజర్‌ (కాస్ట్‌ ఇంజినీరింగ్‌)-2, డిప్యూటీ మేనేజర్‌ (మెకానికల్‌/ మెటలర్జీ ఇంజినీరింగ్‌)-1 ఉన్నాయి.

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్‌ డిగ్రీ (బీఈ/ బీటెక్‌/ బీఎస్సీ)తో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.

వేతనం: నెలకు మేనేజర్‌కు రూ.80,000 - 2,20,000, డిప్యూటీ మేనేజర్‌ రూ.70,000.

వయసు: మేనేజర్‌కు 36 ఏళ్లు, డిప్యూటీ మేనేజర్‌కు 32 ఏళ్లు మించకూడదు.

ఎంపిక: విద్యార్హతలు, షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూలతో.

వెబ్‌సైట్‌: https://engineersindia.com/Index

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 09.01.2026.

సీఎస్‌ఎల్‌లో ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌లు

కొచ్చిన్‌ షిప్‌యార్డ్ లిమిటెడ్ భారతదేశంలోని అతిపెద్ద షిప్‌ బిల్డింగ్, షిప్ రిపేర్ సంస్థ. ఇది కేరళలోని కొచ్చిలో ఉంది. దీన్ని 1972లో స్థాపించారు. ఈ షిప్‌యార్డ్, దేశంలో మొదటి గ్రీన్‌ఫీల్డ్ షిప్‌యార్డ్‌గా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ విమానవాహక నౌకలు, డిఫెన్స్ నౌకలు, కమర్షియల్ షిప్‌లు కొత్తగా నిర్మిస్తారు. కేరళలోని కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌ ప్రస్తుతం ఒప్పంద ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.

పోస్టులు: ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌(మెకానికల్‌): 01, ఆఫీస్‌ అటెండెంట్‌: 01

అర్హత: ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌కు 60 శాతంతో మెకానికల్‌ ఇంజినీరింగ్‌ డిప్లొమా, ఆఫీస్‌ అటెండెంట్‌కు ఇంటర్మీడియట్‌తో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.

వేతనం: నెలకు ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌కు రూ.24,400; ఆఫీస్‌ అటెండెంట్‌కు మొదటి ఏడాది. రూ.20,200; రెండో ఏడాది రూ.20,900; మూడో ఏడాది రూ.21,600.

వయసు: 30 ఏళ్లు మించకూడదు.

దరఖాస్తు ఫీజు: జనరల్‌ రూ.300; ఎస్సీ/ఎస్టీకి ఫీజు లేదు.

వెబ్‌సైట్‌: https://cochinshipyard.in/

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 20.01.2026.

హోటల్‌ మేనేజ్‌మెంట్‌ జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌-2026

జాతీయ పరీక్షల నిర్వహణ సంస్థ (ఎన్‌టీఏ) నిర్వహించే నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌-2026 ప్రకటన వెలువడింది. ఈ ప్రవేశ పరీక్షలో సాధించిన ర్యాంక్‌తో దేశవ్యాప్తంగా ఉన్న నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ కేటరింగ్‌ టెక్నాలజీకి అనుబంధ సంస్థల్లో బీఎస్సీ (హాస్పిటాలిటీ అండ్‌ హోటల్‌ అడ్మినిస్ట్రేషన్‌) కోర్సుల్లో ప్రవేశం పొందవచ్చు. దేశవ్యాప్తంగా సుమారు 12,000కు పైగా సీట్లు ఉన్నాయి. ఈ స్కోరుతో పలు ఇతర సంస్థల్లో ప్రవేశం లభిస్తుంది.

కోర్సు: బీఎస్సీ (హాస్పిటాలిటీ అండ్‌ హోటల్‌ అడ్మినిస్ట్రేషన్‌)

అర్హత: ఇంగ్లిష్‌ ఒక సబ్జెక్టుగా 10+2 (ఇంటర్మీడియట్‌) లేదా తత్సమాన విద్యార్హత.

దరఖాస్తు ఫీజు: జనరల్‌లకు రూ.1000, ఈడబ్ల్యూఎస్‌కు రూ.700, ఎస్సీ/ఎస్టీ, దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్‌లకు రూ.450.

పరీక్ష తేదీ: 25.04.2026.

వెబ్‌సైట్‌: https://exams.nta.nic.in/nchm-jee/

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 25-01-2026.

ట్రేడ్‌ అప్రెంటిస్‌ పోస్ట్​లు

నేషనల్‌ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్, స్టీల్‌ లిమిటెడ్‌ ఛత్తీస్‌గఢ్‌ అప్రెంటిస్‌ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

ఖాళీలు: కంప్యూటర్‌ ఆపరేటర్‌ అండ్‌ ప్రోగ్రామింగ్‌ అసిస్టెంట్‌: 40, వెల్డర్‌: 20, మెకానికల్‌ - ఫిట్టర్‌: 20, ఎలక్ట్రికల్‌ - ఎలక్ట్రీషియన్‌: 20.

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఐటీఐతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.

వయసు: 30 సంవత్సరాలు మించకూడదు. స్టైపెండ్‌: నెలకు రూ.9,600.

ఎంపిక: ఇంటర్వ్యూతో

ఇంటర్వ్యూ తేదీలు: జనవరి 12, 13, 14, 15.

వేదిక: ఎన్‌ఎండీసీ స్టీల్‌ లిమిటెడ్, నగర్నార్, జగదల్‌పుర్, బస్తర్‌ జిల్లా, ఛత్తీస్‌గఢ్‌ - 494001.

వెబ్‌సైట్‌: https://nmdcsteel.nmdc.co.in/SteelCareers

సీఎస్‌ఐఆర్‌ సంస్థలో

సీఎస్‌ఐఆర్ (కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రిసెర్చ్) భారతదేశంలోని ప్రముఖ ఆర్​ అండ్​ డీ సంస్థ. దీన్ని 1942లో స్థాపించారు. సీఎస్‌ఐఆర్​కి దేశవ్యాప్తంగా 37 ల్యాబ్‌లు ఉన్నాయి. విజ్ఞానం, సాంకేతికత, పారిశ్రామిక అభివృద్ధి కోసం ఈ సంస్థ పనిచేస్తుంది. ఆరోగ్యం, వ్యవసాయం, పర్యావరణం వంటి రంగాల్లో పరిశోధనలు జరుపుతోంది. సీఎస్‌ఐఆర్‌ - నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓషనోగ్రఫీ (ఎన్‌ఐఓ), ముంబయి అప్రెంటిస్‌ల కోసం దరఖాస్తులు కోరుతోంది. టెక్నీషియన్‌ అప్రెంటిస్‌షిప్‌ (డిప్లొమా)-04, గ్రాడ్యుయేట్‌ (నాన్‌- ఇంజినీరింగ్‌) అప్రెంటిస్‌షిప్‌-10 ఖాళీలు

అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా, బ్యాచిలర్‌ డిగ్రీతో పాటు అనుభవం ఉండాలి.

స్టైపెండ్‌: నెలకు డిప్లొమా టెక్నీషియన్‌ అప్రెంటిస్‌కు రూ.8,000, గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌కు రూ.9,000.

వయసు: డిప్లొమా టెక్నీషియన్స్‌కు 18 నుంచి 24 ఏళ్లు, గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌కు 21 నుంచి 26 ఏళ్లు మించకూడదు.

ఇంటర్వ్యూ తేదీ: 08-01-2026

వేదిక: సీఎస్‌ఐఆర్‌- నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓషనోగ్రఫీ, రీజనల్‌ సెంటర్, లోఖండ్వాలా రోడ్, అంధేరి వెస్ట్, ముంబయి.

ఆర్థిక ఇబ్బందులు అవరోధాలు కావు - కృషి, పట్టుదలతో కానిస్టేబుల్​ ఉద్యోగాలు

నర్సింగ్​ విద్యార్థులకు గుడ్​న్యూస్​ - జర్మనీలో​ అధిక వేతనంతో ఉద్యోగాలు