ETV Bharat / education-and-career

డిగ్రీ పాసయ్యారా? - బ్యాంక్​ ఆఫ్ బరోడాలో అప్రెంటిస్ ఖాళీలు!

తెలుగు రాష్ట్రాల్లో భారీగా BOB అప్రెంటిస్​ పోస్టులు​ - నెలకు మంచి స్టైపెండ్‌ కూడా!

Bank of Baroda Apprentice Notification 2026
Bank of Baroda Apprentice Notification 2026 (Getty Images)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : June 4, 2026 at 1:36 PM IST

3 Min Read
Choose ETV Bharat

Bank of Baroda Apprentice Notification 2026 : బ్యాంక్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు గుడ్​న్యూస్. భారత ప్రభుత్వ రంగానికి చెందిన "బ్యాంక్​ ఆఫ్ బరోడా(BOB)" దేశవ్యాప్తంగా అప్రెంటిస్ శిక్షణ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ క్రమంలోనే అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను స్వీకరిస్తోంది. మరి, ఈ పోస్టులకు ఎవరు అర్హులు? తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి? శిక్షణ ఎన్ని రోజులు? ఎలా దరఖాస్తు చేసుకోవాలి? సహా తదితర వివరాలు ఇప్పుడు చూద్దాం.

ప్రభుత్వ అనుబంధ సంస్థల్లో ఒకటైన "బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా" దేశవ్యాప్తంగా 5000 అప్రెంటిస్‌ల కోసం ప్రకటన విడుదల చేసి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అభ్యర్తులు ఈ పోస్టులకు తాము కోరుకున్న రాష్ట్రంలో పోటీ పడొచ్చు. ఇందుకోసం ఆ రాష్ట్ర భాషలో అవగాహన ఉండాలి. పరీక్షలో మంచి ప్రతిభ కనబరిచినవారు సంవత్సరం పాటు అప్రెంటిస్‌గా కొనసాగవచ్చు. ఈ టైమ్​లో ప్రతి నెలా రూ.15,000 స్టైపెండ్‌ చెల్లిస్తారు. అప్రెంటిస్‌ అనుభవంతో ప్రైవేటు బ్యాంకులు, బీమా, ఇతర ఆర్థిక సంస్థల్లో జాబ్స్ సాధించడం ఈజీగా అవుతుంది. ముఖ్యంగా బ్యాంకు ఉద్యోగాలు సాధించడం లక్ష్యంగా పెట్టుకున్న అభ్యర్థులకు ఈ నోటిఫికేషన్ మంచి అవకాశం చెప్పుకోవచ్చు. తగిన, అర్హతలు, ఆసక్తి గల అభ్యర్థులు జూన్‌ 8, 2026 వరకు అప్లై చేసుకోవచ్చు.

ఖాళీల వివరాలు :

మొత్తం పోస్టులు : 5000

బ్యాంక్​ ఆఫ్ బరోడా విడుదల చేసిన ఈ నోటిఫికేషన్​లో ఏపీలో 188, తెలంగాణలో 83 పోస్టులు ఉన్నాయి.

అర్హతలు :

  • ఈ పోస్టుల​ కోసం దరఖాస్తు చేసే అభ్యర్థులు కచ్చితంగా భారతీయులై ఉండాలి.
  • అలాగే, గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో డీగ్రీ పాసై ఉండాలి.
  • పరీక్షలో అర్హతకు విభాగాలవారీ కనీస మార్కుల రూల్ లేదు. మొత్తం మీద కనీస మార్కులు పొందినవారికి ఛాన్స్ కల్పిస్తారు. బ్యాంకు వీటిని నిర్ణయిస్తుంది.
  • రాష్ట్రాలు, కేటగిరీల వారీ మెరిట్‌ ప్రకారం జాబితా రూపొందిస్తారు. వీరికి స్థానిక భాషలో ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు.
  • పది లేదా ఇంటర్‌లో ఆ భాషను చదువుకున్నవారు లాంగ్వేజ్‌ టెస్టు రాయనవసరం లేదని గుర్తుంచుకోవాలి.
  • స్థానిక భాషలో అర్హులకు సర్టిఫికెట్లు పరిశీలించి, వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఏ సమస్యా లేనివారిని అప్రెంటిస్‌గా సెలెక్ట్ చేస్తారు.

వయోపరిమితి :

ఈ నోటిఫికేషన్​కు అప్లై చేసుకునే అభ్యర్థుల వయస్సు మే 1, 2026 నాటికి 20-28 ఏళ్లలోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు కేటగిరీల వారీగా గరిష్ఠ వయసులో సడలింపు ఉంది.

యూనివర్సిటీల్లో 1,523 ఉద్యోగాలకు నోటిఫికేషన్ - దరఖాస్తుకు చివరి తేదీ, ఖాళీల వివరాలిలా!

అప్లికేషన్ ఫీజు :

ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు అప్లికేషన్​ ఫీజు రూ.200గా ఉంది. మహిళలు, ట్రాన్స్‌జండర్లకు రూ.600, మిగిలిన అందరూ రూ.800 చెల్లించాలి. జీఎస్‌టీ అదనంగా ఉంటుంది.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు ఆఖరు తేదీ :

అర్హులైన అభ్యర్థులు జూన్‌ 8, 2026 వరకు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.

పరీక్ష :

ఈ నోటిఫికేషన్​కు సంబంధించిన ప్రశ్నాపత్రం వంద మార్కులకు ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటుంది. ప్రతి సరైన జవాబుకూ ఒక మార్కు. నెగటివ్ మార్కులు లేవు.

పరీక్షలో జనరల్‌/ఫైనాన్షియల్‌ అవేర్‌నెస్, క్వాంటిటేటివ్‌ అండ్‌ రీజనింగ్‌ ఆప్టిట్యూడ్, కంప్యూటర్‌ నాలెడ్జ్, జనరల్‌ ఇంగ్లిష్‌ ఒక్కో విభాగం నుంచీ 25 చొప్పున 100 క్వశ్చన్స్ వస్తాయి. 60 నిమిషాల పాటు పరీక్ష ఉంటుంది.

పరీక్ష తేదీ : తర్వాత ప్రకటిస్తారు.

వెబ్‌సైట్‌ : https://www.apprenticeshipindia.gov.in/

అప్లికేషన్ విధానం :

  • బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో అప్రెంటిస్‌గా సేవలందించడానికి అర్హులైన అభ్యర్థులు ముందుగా ప్రభుత్వ అప్రెంటిస్‌ పోర్టళ్లలో వివరాలు నమోదు చేసుకోవాలి.
  • ఆ తర్వాత బ్యాంక్ ఆఫ్ బరోడా అధికారిక వెబ్​సైట్ ఓపెన్ చేసి అప్లై చేసుకుంటే సరిపోతుంది.
  • బ్యాంక్ ఆఫ్ బరోడా అప్రెంటిస్ నోటిఫికేషన్​కు సంబంధించిన మరిన్ని వివరాల కోసం ఈ లింక్​పై క్లిక్ చేయండి.

"ఇండియన్ నేవీ"లో చేరాలనుకుంటున్నారా? - "అగ్నివీర్​" దరఖాస్తు తేదీలు వచ్చేశాయి!

అప్రెంటిస్​ ట్రైనింగ్​ కోసం NPCIL నోటిఫికేషన్​ - నెలకు స్టైపెండ్​ రూ.12వేల పైనే!