ETV Bharat / education-and-career

స్కూల్, కాలేజీల్లో "పీఈటీ" కావడం మీ లక్ష్యమా? - నోటిఫికేషన్ వచ్చేసింది!

AP PECET 2026 దరఖాస్తులు షురూ - ఆలస్య రుసుముతో గడువు ఎప్పుడంటే!

ap_pecet_2026_notification
ap_pecet_2026_notification (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : February 23, 2026 at 1:03 PM IST

2 Min Read
Choose ETV Bharat

AP PECET 2026 : స్కూళ్లు, కళాశాలల్లో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ కావాలన్నది మీ లక్ష్యమా? అయితే, ఆ అవకాశం వచ్చేసింది. ఆయా కోర్సుల్లో ప్రవేశానికి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నోటిఫికేషన్ జారీ చేసింది. బీపీఈడీ, డీపీఈడీ కోర్సుల్లో సీట్లు భర్తీ చేయనున్న ఏపీ పీఈసెట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఆన్​లైన్ దరఖాస్తుల ప్రక్రియ ఇప్పటికే ఫిబ్రవరి 13న ప్రారంభం కాగా మే 25 వరకు ఫైన్​ చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు.

‘అగ్నివీర్‌’ నియామకాలకు దరఖాస్తుల ఆహ్వానం - ఆ రోజే చివరి తేదీ

ఏపీ పీఈసెట్ (APPECET-2026) నోటిఫికేషన్ ద్వారా 2026-27 విద్యా సంవత్సరంలో రాష్ట్రంలోని యూనివర్శిటీలు, అనుబంధ కాలేజీల్లో బీపీఈడీ, (B.P.Ed), డీపీఈడీ (D.P.Ed) కోర్సుల్లో అడ్మిషన్లు కల్పిస్తారు. అర్హులైన అభ్యర్థులు ఫైన్ లేకుండా ఏప్రిల్ 30వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. వెయ్యి రూపాయల ఫైన్ చెల్లించి మే 15వ తేదీ వరకు, రూ.2 వేల ఆలస్య రుసుము చెల్లించి మే 25 వరకు దరఖాస్తు చేసుకునేందుకు వీలుంది.

ఏపీ పీఈసెట్ 2026 (APPECET-2026) ప్రవేశ పరీక్షలను ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నిర్వహిస్తోంది. ఫిబ్రవరి 13 నుంచి మే 25 వరకు దరఖాస్తుల స్వీకరణ, మే 24 - 25 తేదీల్లో దరఖాస్తుల్లో తప్పొప్పుల సవరణకు అవకాశం ఉంది. ఇక మే 28 నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉండగా, జూన్ 3 నుంచి 8 వరకు ఫిజికల్, స్కిల్ టెస్టులు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలను ఆచార్య నాగార్జున యూనివర్శిటీ ప్రాంగణంలో ఉదయం 7 గంటల నుంచి నిర్వహిస్తారు.

డీపీఈడీ కోర్సుల్లో ప్రవేశానికి ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండాలి. అదే విధంగా బీపీఈడీ కోర్సుల్లో ప్రవేశానికి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు. దరఖాస్తు ఫీజు ఓసీలు రూ.900, బీసీలు రూ.800, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు రూ.700 చెల్లించాల్సి ఉంటుంది.

దరఖాస్తులు ఇలా

  • ముందుగా https://cets.apsche.ap.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి హోం పేజీలోని ఫీజు పేమెంట్ లింక్ పై క్లిక్ చేయాలి.
  • ఫీజు చెల్లించిన తర్వాత ఫిల్ అప్లికేషన్ ఫారమ్ లింక్ పై క్లిక్ చేయాలి.
  • ముందుగా పేమెంట్ రిఫరెన్స్ ఐడీ, క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి.
  • వివరాలు ఇచ్చిన తర్వాత అప్లికేషన్ ఫారమ్ ఓపెన్ అవుతుంది. మీ విద్యా అర్హత వివరాలతో పాటు ఫొటో, సంతకం చిత్రాలను ఇచ్చిన సైజులో అప్ లోడ్ చేయాలి.
  • చివరగా సబ్మిట్ చేస్తే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తయినట్లే. చివరగా ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ ద్వారా రిజిస్ట్రేషన్ కాపీని భద్ర పరుచుకోవాలి.
  • పరీక్షలకు ముందుగా విడుదల చేసే హాల్ టికెట్లను రిజిస్ట్రేషన్ నంబర్ లేదా సంబంధిత వివరాలు అందించే డౌన్లోడ్ చేసుకోవచ్చు.

పదో తరగతి విద్యార్థులు పరీక్షలకు భయపడుతున్నారా? - ఈ టిప్స్​ పాటించండి

సెంట్రల్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్​లో జాబ్స్​ - ఇలా దరఖాస్తు చేసుకోండి