ETV Bharat / education-and-career
మంగళగిరి 'ఎయిమ్స్'లో ఉద్యోగాలు - అర్హతలు, దరఖాస్తు ఎలా చేయాలంటే!
ఎయిమ్స్‌లో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా? - ఈ నోటిఫికేషన్‌పై ఓ లుక్కేయండి!

By ETV Bharat Andhra Pradesh Team
Published : August 21, 2026 at 12:24 PM IST
AIIMS Mangalagiri Recruitment 2026 : AIIMS(ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్)లో ఉద్యోగం సంపాదించాలని ఎదురుచూస్తున్న వారికి గుడ్‌న్యూస్. ఎయిమ్స్, మంగళగిరిలో(ఆంధ్రప్రదేశ్) 79 ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఈ పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఈ జాబ్స్‌కు సెలెక్ట్ కావొచ్చు. అర్హులైన వారు సెప్టెంబర్ 27 వరకు అప్లై చేసుకోవచ్చు. మరి, ఏ ఏ విభాగంలో ఎన్ని ఖాళీలున్నాయి? అర్హతలు, ఎలా దరఖాస్తు చేసుకోవాలి, జీతభత్యాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS), మంగళగిరి (ఆంధ్రప్రదేశ్), వివిధ విభాగాలలో 79 ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి పోస్టును బట్టి నెలకు రూ.1,01,500 నుంచి రూ.1,68,900 వరకు గౌరవ వేతనం లభిస్తుంది. తగిన అర్హతలు గల అభ్యర్థులు సెప్టెంబరు 27 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టుల వివరాలు :
- ప్రొఫెసర్ పోస్టులు - 17
- అడిషనల్ ప్రొఫెసర్ ఖాళీలు - 11
- అసోసియేట్ ప్రొఫెసర్ - 14
- అసిస్టెంట్ ప్రొఫెసర్ - 37
మొత్తం ఖాళీల సంఖ్య : 79
విభాగాలు : డెర్మటాలజీ, జనరల్ మెడిసిన్, మైక్రోబయోలాజీ, న్యూరాలజీ, అనస్థీషియా, కార్డియాలజీ, పీడియాట్రిక్స్, పాతాలజీ, రేడియాలజీ, ట్రామా & ఎమర్జెన్సీ మెడిసిన్, యూరాలజీ తదితర విభాగాల్లో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకునే అభ్యర్థులు పోస్టును బట్టి సంబంధిత విభాగాల్లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎండీ/ఎంఎస్/డీఎం/ఎంసీహెచ్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే, ఉద్యోగానుభవం కూడా అవసరం.
వయోపరిమితి :
- ప్రొఫెసర్ పోస్టులకు అప్లై చేయాలనుకునే అభ్యర్థుల వయసు ఆన్‌లైన్ అప్లికేషన్ గడువు తేదీ నాటికి 58 సంవత్సరాలు దాటకుండా ఉండాలి.
- అడిషనల్ ప్రొఫెసర్ ఖాళీలకు 58 సంవత్సరాలు, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు 50 సంవత్సరాలు, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు 50 సంవత్సరాలు మించకుండా ఉండాలి.
- నిబంధనల ప్రకారం, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులకు గరిష్ఠ వయోపరిమితిలో సడలింపునకు అవకాశం ఉంటుంది.
'బ్యాంక్ ఆఫ్ బరోడా' నుంచి భారీ నోటిఫికేషన్ విడుదల! - తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని పోస్టులున్నాయంటే?
శాలరీ :
ప్రొఫెసర్ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.1,68,900 జీతం వస్తుంది. అదే, అడిషనల్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు సెలెక్ట్ అయితే నెలకు రూ.1,48,200, అసోసియేట్ ప్రొఫెసర్‌కు రూ.1,38,300, అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు రూ.1,01,500 శాలరీ లభిస్తుంది.
దరఖాస్తు ఫీజు :
ఈ పోస్టులకు అప్లై చేయాలనుకునే జనరల్ అభ్యర్థులు రూ.31,00 చెల్లించాల్సి ఉంటుంది. అదే, ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులైతే 2,100 పే చేయాలి. దివ్యాంగులు జస్ట్ ప్రాసెసింగ్ ఫీజు రూ.100 చెల్లిస్తే సరిపోతుంది.
దరఖాస్తు విధానం :
అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లోకి వెళ్లి అప్లికేషన్ ఫామ్‌ను డౌన్లోడ్ చేసుకుని, సంబంధిత వివరాలు నింపి ఈమెయిల్ ద్వారా facultyrec@aiimsmangalagiri.edu.inకు పంపాలి.
ఎంపిక ప్రక్రియ :
ఈ పోస్టులకు అప్లై చేసిన వారికి ఎలాంటి రాత పరీక్ష లేదు. కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు :
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : సెప్టెంబరు 27, 2026.
ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు, దరఖాస్తు విధానం గురించి వివరంగా తెలుసుకోవడానికి ఈ లింక్‌పై క్లిక్ చేయండి.
'మూడు చేపల కథ' తెలియకుండా ఉద్యోగమా? - 'ప్లాన్ బి' రెడీ చేసుకోవాల్సిందే బ్రో!

