తక్కువ వడ్డీకే "పర్సనల్ లోన్" ఇస్తున్న బ్యాంకులివే! - ఎందులో ఎంత ఉందంటే?
పర్సనల్ లోన్ తీసుకునే ఆలోచనలో ఉన్నారా? - బెస్ట్ బ్యాంకు, ఫైనాన్స్ కంపెనీని ఎంచుకోండిలా!

By ETV Bharat Andhra Pradesh Team
Published : July 6, 2026 at 5:03 PM IST
Personal Loans Interest Rates List : మనందరికీ ఏదో ఒక సందర్భంలో డబ్బు అత్యవసరం అవుతుంది. అలాంటి టైమ్‌లో ఎక్కువమందికి ముందుగా గుర్తొచ్చేవి "పర్సనల్ లోన్స్ (వ్యక్తిగత రుణాలు)". పిల్లల చదువు, వివాహం, అత్యవసర వైద్య పరిస్థితి ఇలా దేనికి మనీ కావాలన్నా మెజార్టీ జనాలు పర్సనల్ లోన్స్ తీసుకోవడానికే ఆసక్తి చూపిస్తుంటారు. అత్యవసర పరిస్థితుల్లో డబ్బులు అవసరమైనప్పుడు ఈ రుణాలు మంచి ఫైనాన్సింగ్ ఎంపికగా ఉంటాయి. అయితే, చాలా బ్యాంకులు/ఎన్‌బీఎఫ్‌సీలు(నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ) మెరుగైన క్రెడిట్ స్కోరు(750+) గలవారికి సరసమైన వడ్డీ రేట్లకే పర్సనల్ లోన్ ఇస్తుంటాయి. వీటికోసం ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు.
కొన్ని సందర్భాల్లో రుణ సంస్థలు పరిమిత కాలానికి ప్రత్యేక వడ్డీ రేట్లను అందిస్తుంటాయి. అటువంటి ఆఫర్లు అమల్లో ఉన్నప్పుడు లోన్ కోసం అప్లై చేస్తే, తక్కువ వడ్డీ రేటుతో రుణాన్ని పొందడానికి అవకాశం ఉంటుందంటున్నారు ఆర్థిక నిపుణులు. అయితే, వివిధ బ్యాంకులు/ఎన్‌బీఎఫ్‌సీలు వ్యక్తిగత రుణాలపై వసూలు చేసే వడ్డీ రేట్లపై వ్యత్యాసాలు ఉంటాయి. అందుకే, పర్సనల్ లోన్‌కి అప్లై చేసే ముందు వివిధ రుణ సంస్థలు వసూలు చేసే వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్ ఫీజులను ఒకసారి సరిపోల్చుకోవాలని సూచిస్తున్నారు. ఆ తర్వాతే నిర్ణయం తీసుకోవడం మంచిదంటున్నారు.
వివిధ రుణ సంస్థలు పర్సనల్ లోన్స్‌పై వసూలు చేసే వడ్డీ రేట్ల వివరాలిలా..
| బ్యాంకు/ఎన్బీఎఫ్సీ పేరు | వడ్డీ రేటు సంవత్సరానికి (శాతంలో) | ప్రాసెసింగ్ ఫీజు (శాతంలో) |
| బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర | 8.75% | 1% వరకు |
| మహీంద్రా ఫైనాన్స్ | 8.00% | 2% వరకు |
| యూనియన్ బ్యాంక్ | 8.75% | 1% వరకు |
| పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకు | 9.60% | 1% వరకు |
| కెనరా బ్యాంకు | 9.70% | 0.5% వరకు |
| హెచ్ఎస్బీసీ బ్యాంకు | 9.75% | 2% వరకు |
| సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా | 9.85% | 1% వరకు |
| యూకో బ్యాంకు | 9.95% | 1% వరకు |
| కోటక్ మహీంద్రా బ్యాంకు | 9.98% | 5% వరకు |
| ఐసీఐసీఐ బ్యాంకు | 9.99% | 2% వరకు |
| హెచ్డీఎఫ్సీ బ్యాంకు | 9.99% | రూ.6,500 వరకు |
| ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంకు | 9.99% | 2% వరకు |
| పూనావాలా ఫిన్‌కార్ప్ | 9.99% | 3% వరకు |
| యాక్సిస్ బ్యాంకు | 9.99% | 2% వరకు |
| బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ | 10.00% | 3.93% వరకు |
| చోళమండలం ఐఎఫ్‌సీ | 10.00% | 4% వరకు |
| బ్యాంక్ ఆఫ్ బరోడా | 10.15% | 2% వరకు |
| ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు | 10.25% | 0.75% వరకు |
| పంజాబ్ నేషనల్ బ్యాంకు | 10.25% | 1% వరకు |
| ఇండస్ఇండ్ బ్యాంకు | 10.35% | 3.5% వరకు |
| బ్యాంక్ ఆఫ్ ఇండియా | 10.85% | 1% వరకు |
| ఆదిత్య బిర్లా ఫైనాన్స్ | 10.99% | 4% వరకు |
| టాటా క్యాపిటల్ | 10.99% | 3.5% వరకు |
| ఎల్ అండ్ టీ ఫైనాన్స్ | 11.00% | 3% వరకు |
| శ్రీరామ్ ఫైనాన్స్ | 11.00% | 5% వరకు |
| ఫెడరల్ బ్యాంకు | 12.00% | 2% వరకు |
నోట్ : పైన పేర్కొన్న పట్టికలో వ్యక్తిగత రుణాలపై అత్యల్ప వడ్డీ రేట్లు అందిస్తున్న బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీల వివరాలు మాత్రమే తెలిపాం. ముఖ్యంగా ఈ వడ్డీ రేట్లు అనేవి దరఖాస్తుదారుని క్రెడిట్ స్కోరు, లోన్ మొత్తం, నెలవారీ ఇన్కమ్, వృత్తి, వయసు, బ్యాంకుతో సంబంధాలు మొదలైన వాటిపై ఆధారపడి ఉంటాయని గుర్తుంచుకోవాలి.
మరణించిన వ్యక్తి ఆస్తులను "వారసులు" తెలుసుకోవడం ఎలా? - "CAS" ద్వారా ఈజీ అంటున్న నిపుణులు!
ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
పర్సనల్ లోన్ కోసం అప్లై చేసేటప్పుడు తప్పులు చేయకుండా మీరు కొన్ని నియమాలు పాటించాలి. లోన్ తీసుకునేటప్పుడు తగిన శ్రద్ధ వహించకపోతే, వ్యక్తిగత రుణం కూడా అనేక ఆర్థిక ఇబ్బందులను కలిగిస్తుందంటున్నారు. అందుకే, పర్సనల్ లోన్ మీకు అనుకూలంగా పనిచేసేలా చూసుకోవడానికి కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి అంటున్నారు నిపుణులు. అలాంటి వాటిల్లో కొన్నింటి గురించి ఇప్పుడు చూద్దాం.
ఈఎంఐలు : లోన్ తీసుకున్నాక మీరు టైమ్‌కు ఈఎంఐలు చెల్లించాలి. ఎందుకంటే ఇవి ఆలస్యం చేయడం లేదా అసలు కట్టకపోవడం వల్ల జరిమానాలను ఎదుర్కొవాల్సి ఉంటుందని చెబుతున్నారు నిపుణులు.
రుణ ప్రణాళిక : స్పష్టమైన చెల్లింపుల వ్యూహం లేకుండా లోన్ తీసుకోవడం వల్ల మీ నెలవారీ బడ్జెట్ అస్తవ్యస్తమయి డిఫాల్ట్‌లకు దారితీస్తుందంటున్నారు. పర్సనల్ లోన్‌పై డిఫాల్ట్ అవ్వడం వల్ల రుణగ్రహీతకు అనేక ఇబ్బందులు ఎదురవుతాయి.
బహుళ రుణాలు : ఒకసారి అనేక రుణాలు తీసుకోకూడదు. ఇది మీ క్రెడిట్‌కు అంత మంచిది కాదు. అంతేకాదు, బహుళ రుణాలు కొన్నిసార్లు మిమ్మల్ని రుణ ఉచ్చులోకి నెట్టే ఛాన్స్ ఉంది. వీటితో పాటు దరఖాస్తు టైమ్‌లో కూడా జాగ్రత్తగా అన్ని వివరాలు తెలుసుకుని పర్సనల్ లోన్ తీసుకోవడం మంచిదంటున్నారు నిపుణులు.
కొత్తగా జాబ్‌లో చేరారా? - మీ ఆర్థిక ప్రణాళిక ఇలా ఉంటే అప్పులకు "నో" ఛాన్స్!
మీ దగ్గర "క్రెడిట్ కార్డు" ఉందా? - ఇలా వాడితే తక్కువ ధరకే 'కిరాణా సామాను'!

