ETV Bharat / business

మీకు వచ్చే SMS చివర "ఈ అక్షరాలు" ఉంటున్నాయా? - సైబర్ స్కామ్​కు ఆస్కారం!

- ఎస్​ఎంఎస్ విషయంలో TRAI కొత్త రూల్స్ - తెలుసుకుంటేనే సైబర్ నేరాల నుంచి రక్షణ!

SMS Scam Alert
SMS Scam Alert (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : March 1, 2026 at 1:58 PM IST

3 Min Read
Choose ETV Bharat

SMS Scam Alert : నేటి డిజిటల్ యుగంలో సైబర్ నేరాలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. నేరగాళ్లు టెక్నాలజీని వాడుకుంటూ రోజుకో కొత్త తరహా పంథాను ఎంచుకుంటున్నారు. అందులో భాగంగానే అమాయక ప్రజలను దోచుకునేందుకు ఎస్​ఎంఎస్​ల(SMS)​ ద్వారా ఆఫర్స్, రివార్డ్స్, గిఫ్ట్స్​లు అంటూ నకిలీ లింక్​లు పంపుతుంటారు. అలాంటి వాట్ల ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా మీ ఖాతా ఖాళీ అవ్వడం పక్కా అని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఇదే, క్రమంలో ఎస్​ఎంఎస్​ల ఆధారంగా​ జరిగే సైబర్ నేరగాలను అరికట్టేందుకు TRAI(Telecom Regulatory Authority of India) కొన్ని నిబంధనలను తీసుకొచ్చింది.

ఈ నిబంధనలలో భాగంగానే మీ ఫోన్​కు వచ్చే మెసేజ్​ల హెడర్ చివరన ఉండే(సఫిక్స్) P, S, T, G వంటి ఆంగ్ల అక్షరాలు ఉండాలని నిర్ణయించింది. అయితే, చాలా మందికి మొబైల్​కు వచ్చే ఎస్​ఎంఎస్​ల అడ్రస్ చివర ఉండే ఈ అక్షరాల అర్థాలు తెలిసి ఉండవు. కానీ, వాటి అర్థాలు తెలిసి ఉంటే మాత్రం సైబర్ ఫ్రాడ్​ల నుంచి రక్షించుకోవచ్చంటున్నారు నిపుణులు. అసలు, ఆ అక్షరాల అర్థాలేంటి? వాటి ద్వారా సైబర్ స్కామ్​ల బారిన పడకుండా ఎలా కాపాడుకోవచ్చో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

సైబర్‌ మోసాలు చాలా వరకూ ఎస్‌ఎంఎస్‌ల ఆధారంగానే జరుగుతుంటాయి. వీటిని అరికట్టేందుకు సంక్షిప్త సందేశాలు పంపే సంస్థలు ట్రాయ్‌ డీఎల్‌టీ (డిస్ట్రిబ్యూటెడ్‌ లెడ్జర్‌ టెక్నాలజీ) వ్యవస్థలో నమోదు చేసుకోవాలని అదేశించింది TRAI. అప్పుడే అధీకృత ఎస్‌ఎంఎస్‌లు పంపించేందుకు వీలవుతుందని పేర్కొంది. ఈ క్రమంలోనే TRAI TCCCPR 2025 సవరణ ప్రకారం, ప్రతీ మెసేజ్ హెడర్ చివరన తప్పనిసరిగా P, S, T, G అనే సఫిక్స్​లు ఉంటున్నాయి. ఈ నిబంధన మే 6, 2025 నుంచి అమలులోకి వచ్చింది. వినియోగదారులకు మెసేజ్ స్వభాన్ని ఈజీగా గుర్తించడానికి ట్రాయ్ తీసుకొచ్చిన ఈ రూల్ చాలా బాగా సహాయపడుతుంది.

"క్రెడిట్ కార్డు" వాడుతున్న వ్యక్తి చనిపోతే - దానిపై ఉన్న బిల్లు ఎవరు కట్టాలి?

S, P, G, T అక్షరాల అర్థాలు ఏంటంటే?

మీ మొబైల్​కు వస్తున్న మెసేజ్ అడ్రస్ పక్కన ఉండే ఈ అక్షరాలు ఒక్కొక్కటి ఒక్కో అర్థాన్ని సూచిస్తాయి.

  • S - అంటే సర్వీసెస్​కు సంబంధించిన మెసేజ్​లు అని అర్థం. ఉదాహరణకు బ్యాంక్ అలర్ట్​లు, ఓటీపీలు, ముఖ్య సమాచారం వంటివి.
  • T - అంటే ట్రాన్సాక్షన్స్​కు చెందిన మెసేజ్​లు. ఆర్డర్ కన్ఫర్మేషన్​లు, బిల్లు చెల్లింపు, షిప్పింగ్ అప్డేట్లు, ఇతర ట్రాన్సాక్షన్స్​కు సంబంధించిన సందేశాలు.
  • P - అనగా ప్రోమోషనల్ మెసేజెస్. ప్రకటల సమాచారానికి సంబంధించిన మెసేజ్​ల చివరన P అనే అక్షరం ఉంటుంది. ఊదాహరణకు మార్కెటింగ్, ఆఫర్లు, సేల్స్, న్యూ ప్రొడక్ట్స్​కు సంబంధించిన ప్రకటనలకు సంబంధించిన సందేశాలు.
  • G - గవర్నమెంట్​ మెసేజెస్​. అంటే ప్రభుత్వానికి సంబంధించిన సందేశాలని అర్థం. ఆధార్‌ ఓటీపీలు, ఈపీఎఫ్‌ఓ, ఇతర ప్రభుత్వ సంస్థల సేవలకు సంబంధించిన సందేశాలు.

ఇలా మీ మొబైల్​కు వచ్చే మెసేజ్​ల పక్కన వీటిలో ఏదో ఒకటి అడ్రస్ చివరలో ఉండాలి. అలాకాకుండా ఎలాంటి ఇనిషియల్స్ లేని మెసేజ్ అయితే అది మీరు ముందుగానే మొబైల్​లో సేవ్ చేసుకున్న కాంటాక్ట్ అయి ఉండాలి. అదే, కాంటాక్ట్ సేవ్ చేసుకోకుండా, పైన చెప్పిన ఇనిషియల్స్(P, G, S, T అక్షరాలు) అడ్రస్ చివర లేకుండా ఏదైనా మెసేజ్ వస్తే మాత్రమే అప్రమత్తంగా ఉండాల్సిందేనని హెచ్చరిస్తున్నారు నిపుణులు. అంతేకాకుండా, అలాంటి మెసేజ్​లను వీలైనంత వరకు ఓపెన్ చేయకపోవడమే మంచిదని సూచిస్తున్నారు. ఎందుకంటే అలా వచ్చిన మెసేజ్​లు మోస్ట్​ ఆఫ్ ద టైమ్స్ స్కామ్ మెసేజెస్ అయి ఉంటాయంటున్నారు. మీరూ మీ ఫోన్​కు వచ్చే మెసేజ్​లను ఈ అక్షరాలతో ఈజీగా ఐడెంటిఫై చేసి ఫ్రాడ్స్ నుంచి తప్పించుకోండని సూచిస్తున్నారు.

రాంగ్ నంబర్​కు "డబ్బులు" సెండ్ చేశారా? - నో టెన్షన్ ఇలా తిరిగి పొందండి!

మీ "ఆధార్ కార్డు" పోయిందా? - వెంటనే ఇలా చేయండి! - పొరపాటు జరిగిందంటే ఇబ్బందులు తప్పవు!