ETV Bharat / business

మీ దగ్గర "క్రెడిట్ కార్డు" ఉందా? - ఇలా వాడితే తక్కువ ధరకే 'కిరాణా సామాను'!

కిరాణా సరుకుల కొనుగోలుకు 'క్రెడిట్ కార్డు'! - ఎలా వాడితే ఎక్కువ ప్రయోజనమో వివరిస్తున్న నిపుణులు!

Best Credit Card for Grocery Spends
Best Credit Card for Grocery Spends (Getty Images)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : June 28, 2026 at 3:26 PM IST

4 Min Read
Choose ETV Bharat

Best Credit Card for Grocery Spends : నేటి రోజుల్లో క్రెడిట్ కార్డుల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. నెలవారీ యుటిలిటీ బిల్లుల నుంచి కిరాణా సామాను కొనుగోలు చెల్లింపుల వరకు ఎక్కువ మంది ఈ కార్డులనే వాడుతున్నారు. నగదు రహిత చెల్లింపులతో పాటు అనేక రివార్డులు, బెనిఫిట్స్ పొందడమే అందుకు కారణమని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కిరాణా సామాను కొనుగోలు కోసం క్రెడిట్ కార్డును వాడుతున్నట్లయితే కొన్ని టిప్స్ ఫాలో అవ్వడం ద్వారా ఎక్కువ ప్రయోజనాలు పొందవచ్చంటున్నారు ఆర్థిక నిపుణులు. ఈ ప్రయోజనాలు రోజువారీ అవసరాలను మరింత సరసమైనవిగా చేస్తాయంటున్నారు. మరి, కిరాణ సామాను కొనుగోలుకు క్రెడిట్ కార్డును ఎలా వాడితే ఎలాంటి ప్రయోజనాలు లభిస్తాయో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

సరైన కార్డు ఎంపిక :

ప్రతి క్రెడిట్ కార్డు ఒక స్పెషల్ బెనిఫిట్​ను అందిస్తుంటుంది. కొన్ని క్రెడిట్ కార్డుల ద్వారా సూపర్ మార్కెట్, ఆన్​లైన్ కిరాణా కొనుగోళ్లపై క్యాష్​బ్యాక్ లేదా బోనస్ రివార్డ్ పాయింట్లను పొందొచ్చు. అయితే, కిరాణా ఖర్చుల విషయానికొస్తే అన్ని క్రెడిట్ కార్డులు ఒకేలా ఉండవని గుర్తుంచుకోవాలి. ఉదాహరణకు, ఒక కార్డ్ కిరాణా ఖర్చుపై ఐదు శాతం క్యాష్​బ్యాక్, ఇతర కేటగిరీలలో ఒక శాతం క్యాష్​బ్యాక్ రివార్డ్ ఇవ్వొచ్చు. కాబట్టి, మీరు కిరాణా కొనుగోళ్లపై ఎక్కువ క్యాష్​బ్యాక్ లేదా రివార్డ్ పాయింట్లను అందించే కార్డును జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలని చెబుతున్నారు నిపుణులు.

హెచ్​డీఎఫ్​సీ మనీబ్యాక్+ క్రెడిట్ కార్డు అనేది రిలయన్స్ స్మార్ట్ సూపర్‌స్టోర్, బిగ్‌బాస్కెట్ వంటి ఎంపిక చేసిన వ్యాపారుల వద్ద చేసే కిరాణా ఖర్చులపై 10X క్యాష్ పాయింట్లను(సుమారు 3.30% విలువ) రివార్డ్‌గా ఇస్తుంది. ఇందుకు ప్రతి నెలా 2500 పాయింట్ల లిమిట్ ఉంటుంది. దీనికి భిన్నంగా, HSBC లైవ్+ క్రెడిట్ కార్డు అనేది కిరాణా సరుకులు, ఫుడ్ డెలివరీ, డైనింగ్ సేవలపై నేరుగా 10% క్యాష్‌బ్యాక్‌ను పొందే అవకాశం కల్పిస్తోంది. దీనికి నెల నెలా రూ.1000 లిమిట్ ఉంటుంది. అందువల్ల, మీరు కిరాణా షాపింగ్, నెలవారీ ఆహార బిల్లుల నుంచి సాధ్యమైనంత ఎక్కువ బెనిఫిట్​ను పొందడానికి ఇలాంటి క్రెడిట్ కార్డులను పరిగణనలోకి తీసుకోవచ్చంటున్నారు.

అవి యూజ్ చేసుకోవాలి :

కొన్ని క్రెడిట్ కార్డుల కిరాణా కొనుగోళ్లపై వచ్చిన రివార్డ్ పాయింట్స్​ను వోచర్లు, స్టేట్‌మెంట్ క్రెడిట్లు లేదా భవిష్యత్ ఖర్చులపై డిస్కౌంట్ల కోసం వాడుకోవచ్చు, రిడీం చేసుకోవచ్చని చెబుతున్నారు. అమెరికన్ ఎక్స్‌ప్రెస్ మెంబర్‌షిప్ రివార్డ్స్ క్రెడిట్ కార్డు ఖర్చు చేసిన ప్రతి రూ.50కి 1 పాయింట్‌ను, అదనంగా మైల్‌స్టోన్‌ ఖర్చులపై బోనస్ పాయింట్లను అందిస్తుంది. ఈ కార్డు 4,000 పాయింట్ల వెల్‌కం గిఫ్ట్‌, అధిక వార్షిక ఖర్చులపై ఫీజు మినహాయింపు వంటి బెనిఫిట్స్​ను అందిస్తుంది.

"హోం లోన్" తక్కువ వడ్డీకి ఏ బ్యాంక్ ఇస్తుందో తెలుసా? - "SBI"లో ఎంత ఉందంటే?

షాపింగ్‌ ఎక్కడ చేయాలి?

క్రెడిట్ కార్డు జారీచేసే కంపెనీలు నార్మల్​గా నిర్దిష్ట సూపర్ మార్కెట్లు లేదా ఇన్‌స్టామార్ట్, బిగ్‌బాస్కెట్ వంటి విభిన్న ఆన్‌లైన్ కిరాణా ప్లాట్‌ఫాంలతో ఒప్పందాలు కలిగి ఉంటాయి. ఈ ఒప్పందాల ఫలితంగా స్పెషల్ ఆఫర్లు, అదనపు క్యాష్‌బ్యాక్‌లు లేదా ఆన్‌లైన్ డిస్కౌంట్లు లభిస్తుంటాయి. మీ అవసరాలకు భాగస్వామ్య వ్యాపారుల వద్ద షాపింగ్ చేయడం ద్వారా బెనిఫిట్స్ పొందవచ్చు. కొన్నిసార్లు ఇతర ప్లాట్‌ఫాంలలో అందుబాటులో లేని స్పెషల్ ఆఫర్లనూ ఇక్కడ పొందవచ్చు. అందుకే, కిరాణా షాపింగ్ చేసేటప్పుడు ఎక్కువ బెనిఫిట్ పొందడానికి, నిర్దేశిత క్రెడిట్ కార్డుతో ఒప్పందాలు ఉన్న వ్యాపార సంస్థల వద్ద షాపింగ్ చేయడం మంచి ప్రయోజనాన్ని ఇస్తుందంటున్నారు నిపుణులు.

ఆన్‌లైన్‌ గ్రోసరీ ప్లాట్‌ఫాంలు :

నేటి రోజుల్లో చాలా సంస్థలు ఆన్‌లైన్‌లో గ్రోసరీ(కిరాణా) సేవలను అందిస్తున్నాయి. ఈ ప్లాట్‌ఫాంలు డెబిట్/క్రెడిట్ కార్డ్ హోల్డర్‌ల కోసం క్రెడిట్ కార్డ్ డీల్స్‌తో పాటు బండిల్ డీల్స్(బహుళ వస్తువులను ప్యాకేజీ లాగా అందించడం), సీజనల్ ప్రమోషన్స్, స్పెషల్ బెనిఫిట్స్ వంటి అనేక ఇతర ఫీచర్లను అందిస్తుంటాయి. ఇన్‌స్టామార్ట్, స్విగ్గీ వంటి ప్రముఖ ప్లాట్‌ఫాంలను క్యాష్‌బ్యాక్ కార్డుతో జతచేస్తే, సాధారణ డిస్కౌంట్లతో పాటు అదనంగా ఐదు నుంచి పది శాతం ఆదా చేయొచు. కొన్ని ముఖ్యమైన ఫెస్టివల్ టైమ్స్​లోనూ ఆకర్షణీయమైన డీల్స్ లభిస్తాయి. అయితే, మీరు ఈ ఆఫర్లను జాగ్రత్తగా పరిశీలించి, పోల్చి చూసి, మీకు అత్యంత ప్రయోజనకరమైన గ్రోసరీ ప్లాట్‌ఫాంను సెలెక్ట్ చేసుకోవాలంటున్నారు నిపుణులు.

రివార్డ్స్‌ను వాడడం :

కొన్ని క్రెడిట్‌ కార్డులతో కిరాణా కొనుగోళ్లపై రివార్డ్ పాయింట్లను సేకరించడం ఈజీనే. అయితే, ఎక్కువ మంది క్రెడిట్ కార్డ్ హోల్డర్లు పాయింట్ల ఉపయోగాన్ని చెక్ చేయకుండా వాటిని పోగేస్తుంటారు లేదా వాటిని యూజ్ చేయకుండానే గడువు ముగిసిపోనిస్తారు. కిరాణా కూపన్లు, బిల్ పేమెంట్స్ లేదా మీ బకాయిలను కట్టడానికి నేరుగా స్టేట్‌మెంట్ క్రెడిట్ వంటి ముఖ్యమైన కేటగిరీల కోసం పాయింట్లను వాడడం ఒక మంచి వ్యూహం. కొన్ని కంపెనీలు పాయింట్లను వాలెట్ క్యాష్‌గా మార్చుకోవడానికి లేదా భవిష్యత్ కిరాణా షాపింగ్‌పై ఆదా చేసుకోవడానికి కూడా అనుమతిస్తాయి. కాబట్టి, ఇలాంటి అవకాశాలను ఉపయోగించుకోవాలని సూచిస్తున్నారు. ఇలా కిరాణా సరుకుల కొనుగోలు టైమ్​లో క్రెడిట్ కార్డుల ద్వారా లభించే రివార్డ్ పాయింట్స్, ఇతర ప్రత్యేక ఆఫర్లు ఉపయోగించడం వల్ల మొత్తం ఖర్చులో కొంతమేర నగదును ఆదా చేసుకోవచ్చంటున్నారు నిపుణులు.

తక్కువ వడ్డీ అనగానే బ్యాంకు మారుతున్నారా? - "హోం​ లోన్" విషయంలో ఈ పొరపాట్లు చేయొద్దు!

మీ దగ్గర "క్రెడిట్ కార్డు" ఉందా? - ఈ విషయాలు తెలుసుకోకపోతే అప్పుల్లోకే!