ETV Bharat / business

మరణించిన వ్యక్తి ఆస్తులను "వారసులు" తెలుసుకోవడం ఎలా? - "CAS" ద్వారా ఈజీ అంటున్న నిపుణులు!

చనిపోయిన వ్యక్తి పేరిట 'పెట్టుబడులు' ఉన్నాయా? - అవి ఎలా గుర్తించాలో తెలియడం లేదా?

Deceased Person Financial Assets
Deceased Person Financial Assets (Getty Images)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : July 3, 2026 at 1:54 PM IST

3 Min Read
Choose ETV Bharat

Deceased Person Financial Assets Find : కుటుంబ సభ్యుడి ఆకస్మిక మరణాన్ని తట్టుకోవడం చాలా కష్టం. ఫ్యామిలీలో ఒకరు శాశ్వతంగా దూరమవడం అనేది ఎవరూ ఊహించలేని మానసిక వేదనను మిగులుస్తుంది. ఇక అదే వ్యక్తి కుటుంబానికి ఆధారమైతే ఆర్థికంగానూ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా సంపాదించే వ్యక్తి తన ఫ్యామిలీ మెంబర్స్​కు పొదుపు, పెట్టుబడులు వంటి విషయాల గురించి సమాచారం ఇవ్వకపోతే, ఇలాంటి బాధాకరమైన టైమ్​లో ఆ ఆర్థిక విషయాల గురించి తెలుసుకోవడం పెద్ద సవాల్​గా మారుతుంది. ఇంతకీ, మరణించిన వ్యక్తి పేరిట ఉన్న పెట్టుబడులు, ఇతర ఆస్తులను ఎలా గుర్తించాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

మరణించిన వ్యక్తి వివిధ మ్యూచువల్‌ ఫండ్లు, విభిన్న డీమ్యాట్‌ అకౌంట్లలో ఇన్వెస్ట్​మెంట్ చేసి ఉంటే, ఆ వివరాలన్నీ గుర్తించడం కష్టంగా మారుతుంది. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో చట్టబద్ధమైన వారసులకు "కన్సాలిడేటెడ్‌ అకౌంట్‌ స్టేట్‌మెంట్‌ (సీఏఎస్‌)" ఒక మంచి పరిష్కారంగా ఉపయోగపడుతుందంటున్నారు ఆర్థిక నిపుణులు. అసలేంటి, ఈ సీఏఎస్, దీని ద్వారా సులభంగా మరణించిన వ్యక్తి ఆర్థిక ఆస్తులు, పెబ్టుబడులను గుర్తించవచ్చో ఇప్పుడు చూద్దాం.

సీఏఎస్ అంటే ఏమిటంటే?

సీఏఎస్ అంటే ఏమిటనగా, పెట్టుబడిదారుడి పాన్ కార్డు నంబర్ ఆధారంగా వారి పెట్టుబడులన్నింటినీ ఒకే చోట చూపించే ఏకీకృత పత్రం. చనిపోయిన వ్యక్తి పేరిట వివిధ వేదికల్లో ఉన్న ఆర్థిక ఆస్తులు, పెట్టుబడులను గుర్తించి వాటిని క్లెయిం చేసుకోవడానికి వారసులకు ఈ సీఏఎస్ చాలా బాగా ఉపయోగపడుతుందంటున్నారు నిపుణులు.

  • ఈ పత్రం డిపాజిటరీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థల పరిధిలో ఎలక్ట్రానిక్ రూపంలో ఉన్న ఇన్వెస్ట్​మెంట్స్ అన్నింటినీ ఒకచోట మనకు అందిస్తుంది. పెట్టుబడిదారుడు పాన్​కు లింక్ అయి ఉన్నందున, దాదాపు అన్ని పెట్టుబడుల వివరాలు ఇందులో కనిపిస్తాయంటున్నారు. డీమ్యాట్ అకౌంట్లలో ఉన్న సెక్యూరిటీలు, మ్యూచువల్ ఫండ్లు, కొన్నిరకాల బాండ్ వివరాలను సీఏఎస్ ఏకీకృతం చేస్తుంది. కాబట్టి, దీనిద్వారా మరణించిన వ్యక్తికి సంబంధించిన ఆర్థిక ఆస్తుల వివరాలను వారి వారసులు ఈజీగా తెలుసుకోవడానికి వీలు ఉంటుందంటున్నారు నిపుణులు.
  • ముఖ్యంగా సీఏఎస్ ద్వారా వివిధ మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థల్లో ఉన్న పెట్టుబడులన్నీ ఈజీగా గుర్తించవచ్చు.
  • అలాగే, పెట్టుబడిదారుడు కొనుగోలు చేసిన ఈక్విటీ షేర్లు, మార్కెట్‌ అనుసంధాన ఆస్తులను దీనిద్వారా తెలుసుకోవచ్చు.
  • సీఏఎస్ ఈ విషయాలు తెలుసుకోవడానికి మాత్రమే కాదు ఆస్తుల యాజమాన్యాన్ని, తాజా పెట్టుబడి కార్యకలాపాలను ధ్రువీకరించుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇందులో వివిధ సంస్థల వద్ద ఉన్న ఆస్తుల కంప్లీట్ డీటెయిల్స్ ఒకే చోట చూసే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

కొత్తగా జాబ్​లో చేరారా? - మీ ఆర్థిక ప్రణాళిక ఇలా ఉంటే అప్పులకు "నో" ఛాన్స్!

వారసులు ఏం చేయాలంటే?

మరణించిన వ్యక్తి పెట్టుబడులను సురక్షితంగా గుర్తించి, తమ పేరిట బదిలీ చేసుకోవడానికి వారసులు ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం.

సీఎస్‌ను గుర్తించండి : ముందుగా మరణించిన వ్యక్తి ఇ-మెయిల్స్‌ను చెక్ చేయాలి. అందులో సీఏఎస్, NSDL సీఏఎస్, సీడీఎస్‌ఎల్‌ సీఏఎస్‌ లేదా కన్సాలిడేట్‌ అకౌంట్‌ స్టేట్‌మెంట్‌ వంటి కీలక పదాలతో సెర్చ్ చేయాలి. దీనిద్వారా చనిపోయిన వ్యక్తి పెట్టుబడి పోర్ట్‌ఫోలియోకు సంబంధించిన డీటెయిల్స్​ కనుక్కోవచ్చంటున్నారు నిపుణులు.

పెట్టుబడి వివరాలు : నార్మల్​గా ఈ CAS PDF డాక్యుమెంట్లు పాస్‌వర్డ్‌ రక్షణతో ఉంటాయి. సదరు పెట్టుబడిదారుడి పాన్‌ కార్డు నంబరును పెద్ద అక్షరాల్లో నమోదు చేయడం ద్వారా పీడీఎఫ్‌ ఫైల్‌ను చూడొచ్చు. అది ఓపెన్‌ అయ్యాక అందులోని మ్యూచువల్‌ ఫండ్లు, ఈక్విటీ షేర్లు, బాండ్లు, డీమ్యాట్‌ రూపంలో ఉన్న ఇతర సెక్యూరిటీలను జాగ్రత్తగా పరిశీలించాలి.

ఆర్థిక సంస్థలను సంప్రదించడం : నెక్ట్స్ గుర్తించిన ఇన్వెస్ట్​మెంట్స్ ఆధారంగా సంబంధిత డిపాజిటరీని కానీ, అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ (ఏఎంసీ) లేదా రిజిస్ట్రార్‌ను సంప్రదించాలి వారసులు. అప్పుడు వారసుల పేరిట ఆయా పెట్టుబడులను బదిలీ చేయడానికి వారు తగిన సహాయం చేస్తారంటున్నారు నిపుణులు.

ఆస్తుల బదిలీ : వారసుల పేరిట ఆస్తులను మార్చేందుకు అవసరమైన డాక్యుమెంట్స్​ను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అందులో భాగంగా చనిపోయిన వ్యక్తి పాన్, ఆధార్‌ డీటెయిల్స్, డెత్ సర్టిఫికేట్, చట్టబద్ధమైన వారసత్వ ధ్రువీకరణ పత్రం, వారసుల గుర్తింపు కార్డులను సబ్మిట్ చేసి, ఆస్తుల బదిలీ ప్రక్రియను కంప్లీట్ చేయాలి.

ఈ విషయాలు గుర్తుంచుకోవాలి :

కన్సాలిడేటెడ్‌ అకౌంట్‌ స్టేట్‌మెంట్‌ (సీఏఎస్‌)లో ఎలక్ట్రానిక్‌ పెట్టుబడులు మాత్రమే కనిపిస్తాయని గుర్తుంచుకోవాలి. భౌతిక రూపంలో ఉన్న షేర్‌ సర్టిఫికెట్ల వివరాలు ఇందులో కనిపించవు. కాబట్టి, సంప్రదాయ సేవింగ్ స్కీమ్స్ అయిన బ్యాంక్‌ డిపాజిట్లు, పీపీఎఫ్, పోస్టాఫీసు పెట్టుబడుల డీటెయిల్స్ ఇందులో ఉండవని గమనించాలి.

తక్కువ వడ్డీ అనగానే బ్యాంకు మారుతున్నారా? - "హోం​ లోన్" విషయంలో ఈ పొరపాట్లు చేయొద్దు!

"హోం లోన్" తక్కువ వడ్డీకి ఏ బ్యాంక్ ఇస్తుందో తెలుసా? - "SBI"లో ఎంత ఉందంటే?