గ్రామీణులను లక్షాధికారులను చేసే "పథకం" - తక్కువ టైమ్, మనీ బ్యాక్ సౌకర్యం కూడా!
ఆర్థిక భద్రత కోసం మంచి "పోస్టాఫీస్ స్కీమ్" - బీమా రక్షణతో పాటు బోనస్!

Published : February 24, 2026 at 1:00 PM IST
Post Office Gram Priya Scheme : ప్రస్తుత రోజుల్లో ఎంత సంపాదిస్తున్నామనే దానికంటే ఎంత పొదుపు చేస్తున్నామనేది చాలా కీలకం. ఈ క్రమంలోనే చాలా మంది భవిష్యత్తులో ఎదురయ్యే ఖర్చులు, అవసరాలను దృష్టిలో ఉంచుకుని సేవింగ్ స్కీమ్స్‌లో పెట్టుబడులు పెడుతుంటారు. అందులోనూ రిస్క్ లేని ప్రభుత్వ హామీ ఉండే పోస్టాఫీస్ పథకాలలో ఇన్వెస్ట్ చేయడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అలాగే, వీటిలో తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడి పొందొచ్చు.
అయితే, చాలా మందికి పోస్టాఫీస్ స్కీమ్స్ అనగానే సేవింగ్ స్కీమ్స్ మాత్రమే గుర్తొస్తాయి. అవి మాత్రమే కాకుండా ఇన్సూరెన్స్ పాలసీలు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లోనూ పెట్టుబడి పెట్టడం ద్వారా పాలసీదారులు మంచి బెనిఫిట్ పొందొచ్చు. మనీ బ్యాక్ సౌకర్యం కూడా ఉంటుంది. ఇప్పుడు మీ అందరి కోసం పోస్టాఫీస్ అందిస్తున్న అలాంటిదే ఒక సూపర్ స్కీమ్‌ను తీసుకొచ్చాం. మరి, ఆ స్కీమ్ ఏంటి? ఎవరు అర్హులు? వంటి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
గ్రామీణ ప్రాంత ప్రజలకు తక్కువ కాలానికి బీమా రక్షణ ఇవ్వడంతో పాటు ఆర్థిక భద్రతను కల్పించాలనే ఉద్దేశంతో పోస్టాఫీస్ ఈ స్కీమ్‌ను తీసుకొచ్చింది. అదే, పోస్టాఫీస్ రూరల్ లైఫ్ "గ్రామ్ ప్రియ ఇన్సూరెన్స్ స్కీమ్". ఇది ఒక మంచి మనీ బ్యాక్ పాలసీ. ఈ మనీ బ్యాక్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీని ముఖ్యంగా గ్రామీణ ప్రజలకు ఆర్థిక భద్రతతో పాటు మంచి రాబడిని అందించాలని ప్రత్యేకంగా రూపొందించారు.
అర్హతలు ఏంటి:
- ఈ స్కీమ్ పెట్టుబడి పెట్టాలనుకునే వారు భారతీయులై ఉండాలి.
- 20 ఏళ్ల నుంచి 45 సంవత్సరాలలోపు ఉన్నవారు ఈ స్కీమ్‌లో చేరడానికి అర్హులు.
- ఈ పథకంలో కనిష్ఠంగా రూ.10,000 నుంచి గరిష్ఠంగా రూ.10 లక్షల మొత్తానికి బీమా తీసుకోవచ్చు.
- పోస్టాఫీస్ అందిస్తున్న ఈ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ కాలపరిమితి వచ్చేసి 10 సంవత్సరాలుగా ఉంది.
పిల్లల కోసం పోస్టాఫీస్ "సూపర్ స్కీమ్" - రోజూ రూ.18 కడితే చాలు రూ.3 లక్షలొస్తాయి!
మనీ బ్యాక్ సౌకర్యం కూడా!
ఈ స్కీమ్‌లో మరొక అద్భుతమైన ఫెసిలిటీ అందుబాటులో ఉంది. అదేంటంటే, ప్రకృతి విపత్తులు అంటే వరదలు, భూకంపం, తుఫాను మొదలైనవి సంభవించినప్పుడు మీ ప్రీమియం డబ్బులు ఒక ఏడాది వరకు కట్టకపోయినా వడ్డీ విధించరు. ముఖ్యంగా ఇందులో పూర్తిగా పదేళ్ల పాటు ప్రీమియం చెల్లించే వ్యక్తి జీవితానికి అష్యూర్డ్ మేరకు కవరేజ్ లభిస్తుంది. అలాగే, మొత్తం మూడు సార్లు మనీ బ్యాక్ సౌకర్యం కూడా కల్పిస్తున్నారు.
- మీరు 10 సంవత్సరాల టెన్యూర్ కలిగిన ఈ పాలసీని తీసుకున్నట్లయితే నాలుగేళ్ల తర్వాత 20 శాతం డబ్బులు, 7 ఏళ్ల తర్వాత మరో 20 శాతం చొప్పున డబ్బులు వస్తాయి.
- ఇక 10 ఏళ్ల తర్వాత అంటే పాలసీ గడువు కంప్లీట్ అయ్యాక మిగతా 60 శాతం, బోనస్ కలిపి ఇచ్చేస్తారు. ఒకవేళ పాలసీదారుడు మధ్యలో చనిపోతే నామినీకి రూ.10 లక్షల మొత్తం లభిస్తుంది.
- ఈ పాలసీలో అతిపెద్ద హైలైట్ వచ్చేసి పోస్టాఫీస్ అందించే బోనస్. తపాలా శాఖ ప్రకటించిన ప్రకారం ప్రతి రూ.1,000కి ఏడాదికి రూ.45ల బోనస్ ఇస్తుంది.
నెలకు ఎంత డబ్బులు కట్టాలి :
ఈ స్కీమ్‌లో చేరిన వ్యక్తి రూ.10 వేల నుంచి రూ.10 లక్షల వరకు ఎంతైనా పెట్టుబడి పెట్టొచ్చు. ఉదాహరణకు ఒక వ్యక్తి 30 సంవత్సరాల వయసులో రూ.5 లక్షల బీమా పాలసీ తీసుకున్నాడనుకుందాం. అప్పుడు అతను నెలకు రూ.5,068 లు ప్రీమియంగా కట్టాల్సి ఉంటుంది. అయితే, ఈ స్కీమ్‌లో ప్రస్తుతం సంవత్సరానికి వెయ్యి రూపాయలకు రూ.45 బోనస్ ఇస్తున్నారు. దాని ప్రకారం 5 లక్షలకు ఏడాదికి రూ.22,500 బోనస్ లభిస్తుంది. అదే, పది సంవత్సరాల కాలానికి చూసుకుంటే రూ.2,25,000 బోనస్ అందుతుంది. దాంతో మెచ్యూరిటీ టైమ్‌లో పాలసీదారుడు మొత్తంగా 7 లక్షల 25 వేల రూపాయలను అందుకుంటాడన్నమాట.
ఎలా చేరాలంటే?
మీ సమీపంలో ఉన్న పోస్టాఫీసు వద్ద వెళ్లి "గ్రామ్ ప్రియ రూరల్ లైఫ్ ఇన్సూరెన్స్" పథకం గురించి అడిగి తెలుసుకోండి. ఆ తర్వాత సంబంధిత అప్లికేషన్ ఫారమ్‌లో అవసరమైన వివరాలు ఫిల్ చేసి, కావాల్సిన పత్రాలను జతచేసి అధికారులకు సమర్పిస్తే సరిపోతుంది.
19 ఏళ్లు దాటినోళ్ల కోసం సూపర్ స్కీమ్ - రోజూ రూ.95 కడితే చాలు రూ.14 లక్షలు మీ సొంతం!
60 ఏళ్ల వారికి చక్కటి "సేవింగ్స్ స్కీమ్" - రిస్క్ తక్కువ, వడ్డీ ఎక్కువ!

