ఫోన్ పే యూజర్లకు గుడ్‌న్యూస్ - మనీ ట్రాన్సాక్షన్లో కొత్త ఫీచర్ - ఇలా సెట్ చేసుకోండి!
- బయోమెట్రిక్‌తో అద్భుతమైన ఫీచర్ తీసుకొచ్చిన ఫోన్ పే - యూపీఐ పిన్ అవసరం లేకుండానే పేమెంట్స్!

Published : February 21, 2026 at 10:23 AM IST
PhonePe Biometric Payments: నేటి టెక్నాలజీ యుగంలో ఆన్‌లైన్‌లో చెల్లింపులు కామన్ అయ్యాయి. రూపాయి మొదలు లక్షల వరకు అవతలి వ్యక్తికి ఈజీగా సెండ్ చేస్తున్నారు. ఇందుకోసం ఫోన్ పే, గూగుల్ పే వంటి యూపీఐ యాప్స్‌ను విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. ఈ యాప్స్ కూడా తమ వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. తాజాగా PhonePe ఆన్‌లైన్ చెల్లింపులలో కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. దీని ద్వారా ఆన్‌లైన్ చెల్లింపులను కేవలం ఫింగర్ ప్రింట్ ద్వారానే చేయొచ్చు!
యూపీఐ పిన్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేకుండానే ఈజీగా ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు. అందుకోసం మీ ఫోన్‌లో ఫింగర్ ప్రింట్ ఆప్షన్ ఉంటే సరిపోతుంది. వేలిముద్రను యూజ్ చేసి PhonePe నుంచి గరిష్ఠంగా 5 వేల వరకు పంపవచ్చు. ఒకవేళ 5 వేల కంటే ఎక్కువ పంపాలనుకుంటే UPI పిన్ అవసరం అవుతుంది. మరి, అది ఎలానో ఇప్పుడు చూద్దాం.
చాలా సేఫ్టీ: ఫోన్‌లో బయోమెట్రిక్ యూజ్ చేసి డబ్బులు చెల్లించడం అనేది సేఫ్టీ ఇంకా బెటర్ ఆప్షన్ అని PhonePe స్పష్టం చేసింది. ఎందుకంటే రద్దీగా ఉండే ప్రదేశాలలో యూపీఐ పిన్ ఎంటర్ చేస్తే మీ చుట్టూ ఉన్నవారు ఎవరైనా చూసే వీలు ఉంటుంది. అదే బయోమెట్రిక్ పేమెంట్లకు ఇలాంటి రిస్క్ ఉండదు. అంతేకాకుండా రాంగ్ పిన్ లేదా యూపీఐ పిన్ మర్చిపోయిన సందర్భాల్లో పేమెంట్ ఫెయిల్యూర్ వంటి సమస్యలు కూడా ఉండవని వెల్లడించింది. అయితే ప్రస్తుతం ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉందని చెప్పింది. ఈ ఫీచర్ త్వరలో iOS సిస్టమ్‌లలో కూడా అందుబాటులోకి రానున్నట్లు వెల్లడించింది.
బయోమెట్రిక్ ఫీచర్‌ను ఇలా యాక్టివేట్ చేసుకోవాలి :
- మీ ఫోన్‌లో ముందుగా PhonePe యాప్‌ను ఓపెన్ చేయాలి.
- హోమ్ పేజీలో లెఫ్ట్ సైడ్ ఉన్న మీ ప్రొఫైల్‌పై క్లిక్ చేసి Manage Payments ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
- స్క్రీన్‌ను పైకి స్క్రోల్ చేస్తే More Optionsలో Biometric Pay అని కనిపిస్తుంది. ఆ ఐకాన్‌పై క్లిక్ చేయాలి.
- మీకు ఎన్ని అకౌంట్స్ ఉన్నాయో ఆ వివరాలు స్క్రీన్ మీద కనిపిస్తాయి. ఆ బ్యాంక్ అకౌంట్స్ పక్కనే Activate అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి.
- అనంతరం Agree ఆప్షన్‌పై క్లిక్ చేస్తే ఆ అకౌంట్‌కు సంబంధించిన యూపీఐ పిన్ అడుగుతుంది. దానిని ఎంటర్ చేసి Next పై క్లిక్ చేస్తే Register Biometric అని వస్తుంది. అప్పుడు మీ ఫింగర్ ప్రింట్‌ను ఉంచితే బయోమెట్రిక్ పేమెంట్స్ యాక్టివేటెడ్ అని మెసేజ్ వస్తుంది.
- మనీ ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే మీరు ఎవరికి పంపించాలనుకున్నారో వారి డీటైల్స్ ఓపెన్ చేసి ఎంత అమౌంట్ పంపాలో దానిని ఎంటర్ చేసి పే చేస్తే సరి. కావాలనుకుంటే ఈ ఆప్షన్‌ను డీయాక్టివేట్ కూడా చేసుకోవచ్చు.
'మేడ్ ఇన్ ఇండియా' స్మార్ట్‌స్పీకర్ లాంఛ్ చేసిన ఫోన్‌పే- దీని స్పెషాలిటీ ఏంటో తెలుసా?
కండక్టర్ వద్ద టికెట్ డబ్బులు మర్చిపోయారా? - ఈ నంబర్‌కు కాల్ చేస్తే 'ఫోన్ పే' చేసేస్తారు

