ETV Bharat / business

LIC నుంచి 2 కొత్త పాలసీలు లాంచ్ - ఒకే ప్లాన్​తో అటు పొదుపు, ఇటు బీమా రక్షణ!

వార్షికోత్సవం వేళ 2 కొత్త ప్లాన్లను ప్రకటించిన ఎల్​ఐసీ - ఇవి తీసుకుంటే లభించే ప్రయోజనాలివే!

LIC Launches Two New Plans
ఎల్​ఐసీ కొత్త ప్లాన్లు (Getty Images)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : September 2, 2026 at 11:05 AM IST

3 Min Read
Choose ETV Bharat

LIC Launches Two New Plans : ప్రముఖ బీమా రంగ సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(LIC) సామాన్యులను దృష్టిలో పెట్టుకుని ఎప్పటికప్పుడు కొత్త పథకాలను లాంచ్ చేస్తుంటుంది. జనాలూ కేంద్ర ప్రభుత్వ మద్దతు ఉన్న ఈ సంస్థ పాలసీలు కొనుగోలు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. ప్రజల నమ్మకాన్ని చూరగొన్న ఎల్​ఐసీ తాజాగా మరో రెండు కొత్త ప్లాన్లను ప్రకటించింది. మరి, ఆ ప్లాన్స్ ఏంటి? ఇవి ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తాయి? ఈ కొత్త పాలసీలకు సంబంధించిన పూర్తి వివరాలపై ఇప్పుడు ఓ లుక్కేద్దాం.

LIC 70వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈ రెండు కొత్త ప్లాన్లను లాంచ్ చేసింది. అవే, 'ఎల్​ఐసీ బీమా ప్లాటినమ్, ఎల్ఐసీ జీవన్ రక్ష'. ఎల్​ఐసీ నూతనంగా ఆవిష్కరించిన ఈ పాలసీలు సెప్టెంబర్‌ 7 నుంచి ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి.

ఎల్‌ఐసీ బీమా ప్లాటినమ్‌(ప్లాన్ నం 770) :

  • వార్షికోత్సరం వేళ ఎల్​ఐసీ లాంచ్ చేసిన బీమా ప్లాటినమ్ ప్లాన్ అనేది పొదుపు, బీమా రక్షణ కలిపి అందించే పాలసీ. అలాగే, ఇది నాన్‌ లింక్డ్‌, నాన్‌ పార్టిసిపేటింగ్‌, ఇండివిడ్యువల్‌ ప్లాన్‌. ఇందులో కచ్చితమైన ముందస్తు హామీతో కూడిన రాబడులు లభిస్తాయి.
  • పరిమిత ప్రీమియం చెల్లింపు వ్యవధి ఉండే ఈ పాలసీలో ప్రతి రూ.1,000 వార్షిక ప్రీమియంపై రూ.70 చొప్పున గ్యారెంటీడ్‌ అడిషన్లు లభిస్తాయి.
  • ఈ పాలసీ కొనుగోలు చేయడానికి కనీస వయసు వచ్చేసి 28 సంవత్సరాలు, గరిష్ఠ వయసు 75 సంవత్సరాలుగా ఉంది.
  • ప్రీమియం చెల్లింపు కాలవ్యవధి వచ్చేసి 7, 10, 12, 15, 18 ఏళ్లుగా ఉంది. పాలసీదారులు తమ వీలును బట్టి ఈ ఐదు ఆప్షన్లలో నచ్చిన కాలవ్యవధిని ఎంచుకోవచ్చు. ఇక పాలసీ గడువు వచ్చేసి 17, 20, 22, 25, 28 ఏళ్లుగా ఉంది.
  • కనీస బీమా హామీ మొత్తం రూ.3 లక్షలుగా నిర్ణయించారు. గరిష్ఠ మొత్తంపై ఎలాంటి లిమిట్ లేదు.
  • ప్లాన్​ మెచ్యూరిటీ సమయానికి పాలసీదారుడు జీవించి ఉంటే బేసిక్‌ సమ్‌అష్యూర్డ్‌, గ్యారెంటీడ్‌ అడిషన్లు పే చేస్తారు.
  • ఒకవేళ జరగరానిది ఏదైనా జరిగితే వార్షిక ప్రీమియానికి 11 రెట్లు లేదా బేసిక్‌ సమ్‌ అష్యూర్డ్‌, గ్యారెంటీడ్‌ అడిషన్లలో ఏది ఎక్కువగా ఉంటే అది చెల్లిస్తారు.
  • LIC పాలసీదారులకు రిబేటు లభిస్తుంది. లోన్ సదుపాయం కూడా ఉంది. అలాగే, ఈ పాలసీకి రైడర్లు యాడ్ చేసుకోవచ్చు.
  • చెల్లింపు కాలంలో ప్రతి ఏటా ముగింపులో బేసిక్‌ సమ్‌ అష్యూర్డ్‌లో 10 శాతం ఆదాయం క్రమం తప్పకుండా అందిస్తుంది.
  • ఈ పాలసీలో ఎల్‌ఐసీ ప్రస్తుత పాలసీదారులు, మరణించిన పాలసీదారుల నామినీలకు ప్రత్యేక రాయితీ లభిస్తుంది.

'EMI' ఆలస్యమైతే ఏమవుతుంది? - ఇలా చేస్తే క్రెడిట్ స్కోర్​పై ప్రభావం ఉండదు!

ఎల్​ఐసీ జీవన్‌ రక్ష (ప్లాన్‌ నం 894) :

  • ఎల్​ఐసీ కొత్తగా ప్రకటించిన జీవన్‌ రక్ష ప్లాన్ అనేది ఒక 'టర్మ్‌ ఇన్సూరెన్స్‌' పాలసీ. ఇది కూడా నాన్‌-పార్టిసిపేటింగ్‌, నాన్‌ లింక్డ్‌ ప్యూర్‌ రిస్క్‌ ప్లాన్‌.
  • ఈ పాలసీ కాలపరిమితిలో ఒకవేళ పాలసీదారు అకాల మరణం చెందితే కుటుంబానికి నిర్ణీత మొత్తం అందుతుంది.
  • ఈ ప్లాన్‌ కొనుగోలు చేయడానికి కనీస వయసు వచ్చేసి 18 ఏళ్లు, గరిష్ఠ వయసు వచ్చేసి 45 సంవత్సరాలుగా నిర్ణయించారు.
  • కనీస పాలసీ విలువ రూ.5 లక్షలు ఉండగా, గరిష్ఠంగా రూ.24 లక్షల వరకూ బీమా పొందే వీలుంది.
  • ఈ పాలసీ సింగిల్‌ ప్రీమియం, రెగ్యులర్‌ ప్రీమియం, లిమిటెడ్‌ ప్రీమియం ఆప్షన్లలో పాలసీదారులకు అందుబాటులో ఉంటుంది.
  • ఇందులో మహిళా పాలసీదారులకు ప్రత్యేక ప్రీమియం వర్తిస్తుంది. అలాగే, దీనికి అదనంగా రైడర్లు యాడ్ చేసుకోవచ్చు.

ఆరోగ్య బీమాలో 'OPD కవరేజ్' తీసుకున్నారా? - లేదంటే ఈ ప్రయోజనాలు మిస్ అవుతారట!

'హోమ్ లోన్' తీసుకున్నారా? - ఇలా కడితే తక్కువ వడ్డీ, ఎక్కువ లాభం!