ETV Bharat / business

పోస్టాఫీస్​ సూపర్​ స్కీమ్​ - రూ.20 లక్షలు ఇన్వెస్ట్​ చేస్తే చేతికి రూ.40 లక్షలు​!

- తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందాలని చూస్తున్నారా? - ఈ స్కీమ్ సూపర్​ ఆప్షన్​!

Kisan Vikas Patra Scheme
Kisan Vikas Patra Scheme (Getty Images)
author img

By ETV Bharat Telangana Team

Published : March 2, 2026 at 12:53 PM IST

3 Min Read
Choose ETV Bharat

Kisan Vikas Patra Scheme: రిస్క్​ లేకుండా తక్కువ పొదుపుతో ఎక్కువ రాబడి లభించే స్కీమ్స్​లలో పెట్టుబడి ​పెట్టాలని చాలా మంది ఆశిస్తుంటారు. కానీ ఎందులో పెట్టాలో తెలియక తికమకపడుతుంటారు. అలాంటి వారి కోసం అద్భుతమైన స్కీమ్​ ఒకటి ఉంది. అదే కిసాన్​ వికాస్​ పత్ర. నిజానికి ఈ స్కీమ్​ ఎప్పటి నుంచో అమల్లో ఉన్నా చాలా మందికి సరైన అవగాహన లేదు. ఈ పథకంలో పెట్టుబడి పెట్టిన డబ్బులు మెచ్యూరిటీ తర్వాత డబులవుతాయి. వడ్డీ కూడా అధికమే. మరి ఈ స్కీమ్​లో చేరేందుకు ఎవరు అర్హులు? ఎంత పెట్టుబడి పెట్టాలి? ఎలా అప్లై చేసుకోవాలి? అనే వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.

స్మాల్‌ సేవింగ్స్‌ సర్టిఫికెట్‌ స్కీంగా కేంద్ర ప్రభుత్వం 1988లో కిసాన్​ వికాస్​ పత్ర పథకం తీసుకొచ్చింది. ముఖ్యంగా అన్నదాతల్లో దీర్ఘకాల పెట్టుబడిని ప్రోత్సాహించాలన్న ఉద్దేశంతో దీన్ని ప్రారంభించారు. అందుకే దీనికి కిసాన్‌ వికాస్‌ పత్రగా నామకరణం చేశారు. అయితే, కేవలం రైతులకు మాత్రమే కాకుండా అర్హులైన పౌరులందరికీ ఈ పథకంలో పెట్టుబడి పెట్టడానికి అవకాశం కల్పించేలా మార్గదర్శకాలు రూపొందించారు. మార్కెట్‌తో సంబంధం లేకుండా ఇందులో పెట్టుబడి పెట్టిన వారికి కచ్చితమైన రాబడి లభిస్తుంది. ప్రస్తుతం ఈ స్కీమ్​ దేశంలోని అన్ని బ్యాంకులు, పోస్టాఫీసుల్లో అందుబాటులో ఉంది.

ఈ పథకానికి సంబంధించి మరిన్ని వివరాలు:

  • కిసాన్‌ వికాస్‌ పత్ర స్కీమ్​లో చేరాలనుకునేవారు భారత పౌరులై ఉండాలి. అలాగే 18 సంవత్సరాల వయసు పూర్తైన వారు అర్హులు.
  • ఒక వ్యక్తి తన పేరు మీద ఎన్ని అకౌంట్లనైనా ఓపెన్​ చేయవచ్చు. అలాగే ముగ్గురు వ్యక్తులు కలిసి జాయింట్​ ఖాతాను తెరవచ్చు. మైనర్ల పేరు మీద తల్లిదండ్రులు లేదా సంరక్షకులు అకౌంట్​ ఓపెన్​ చేయవచ్చు.
  • కనిష్ఠంగా రూ.1,000 వరకు మదుపు చేయొచ్చు. గరిష్ఠ పరిమితి లేదు. అయితే డిపాజిట్​ రూ.50 వేలకు మించితే సదరు వ్యక్తి పాన్‌ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. అదే రూ.10 లక్షలు అంత కంటే ఎక్కువ మొత్తాన్ని పెట్టుబడి పెట్టాలంటే.. మీ పే స్లిప్స్​, బ్యాంక్​ స్టేట్​మెంట్స్​, ఐటీఆర్​ డాక్యుమెంట్ల వంటి ఆదాయ ధ్రువీకరణ పత్రాలు అందించాల్సి ఉంటుంది.
  • కేవీపీలో వడ్డీ రేటు ప్రతి సంవత్సరం మారుతుంటుంది. ప్రస్తుతం 2025-26 ఆర్థిక సంవత్సరానికిగానూ వడ్డీ రేటు 7.5% శాతంగా ఉంది.
  • ఈ స్కీం కాలపరిమితి సైతం ఎప్పటికప్పుడు మారుతుంటుంది. ప్రస్తుతం మెచ్యూరిటీ పీరియడ్​ 115 నెలలుగా ఉంది. అంటే మీరు డిపాజిట్‌ చేసిన తేదీ నుంచి 9 సంవత్సరాల 7 నెలల తర్వాత మెచ్యూర్‌ అవుతుంది.
  • సింగిల్​ లేదా జాయింట్​ అకౌంట్​ ఖాతాదారులు మరణించినప్పుడు, కోర్టు సందేశాల మేరకు ముందుగానే డిపాజిట్లను ఉపసంహరించుకునేందుకు కిసాన్‌ వికాస్‌ పత్ర పథకంలో అవకాశం ఉంటుంది. అయితే, అప్పటి వరకు లభించిన వడ్డీని మాత్రమే చెల్లిస్తారు.
  • ఒకవేళ ఖాతాదారుడు అనుకోకుండా మరణిస్తే.. ఆ ఖాతాను నామినీకి లేదా చట్టపరమైన వారసులకు ట్రాన్స్​ఫర్​ చేస్తారు. ఒకవేళ జాయింట్‌ ఖాతా అయితే, రెండో భాగస్వామికి కేటాయిస్తారు.
  • కేవీపీలో చేసిన డిపాజిట్లకు సర్టిఫికెట్‌ లభిస్తుంది. దీన్ని తనఖా పెట్టి రుణాలు పొందొచ్చు. రుణ వడ్డీరేటు కూడా తక్కువ ఉండే అవకాశం ఉంది.

ఎంత పెట్టుబడి పెడితే ఎంత వస్తుంది: ఈ పథకం ద్వారా మీరు పెట్టే పెట్టుబడికి రెట్టింపు ఆదాయం లభిస్తుంది. ఉదాహరణకు మీరు రూ.50వేలు ఇన్వెస్ట్​ చేస్తే 115 నెలల తర్వాత మీ అకౌంట్​లోకి 1 లక్ష రూపాయలు డిపాజిట్​ చేస్తారు. అదే మీరు రూ.20లక్షలు పెడితే రూ.40 లక్షలు చేతికి వస్తాయి. కాబట్టి రిస్క్​ లేకుండా మీరు పెట్టిన దానికి డబుల్ ఆదాయం​ పొందవచ్చు.

"క్రెడిట్ కార్డు" వాడుతున్న వ్యక్తి చనిపోతే - దానిపై ఉన్న బిల్లు ఎవరు కట్టాలి?

రోజుకు రూ.417 పొదుపుతో కోటి రూపాయల ఆదాయం - రిస్క్​ కూడా ఉండదు!