ETV Bharat / business

రాంగ్ నంబర్​కు "డబ్బులు" సెండ్ చేశారా? - నో టెన్షన్ ఇలా తిరిగి పొందండి!

-పొరపాటున వేరే వ్యక్తికి డబ్బులు పంపించారా? - ఈ నంబర్స్​కు ఫోన్ చేస్తే మీ మనీ రిటర్న్!

UPI Transaction Money
UPI Transaction Money (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : February 26, 2026 at 11:16 AM IST

4 Min Read
Choose ETV Bharat

How to Recover Wrong UPI Transaction Money : నేటి డిజిటల్ యుగంలో దేశంలో యూపీఐ పేమెంట్స్‌ భారీగా పెరిగిపోయాయి. రోజువారీ పేమెంట్స్‌ నుంచి ఫీజులు, లోన్‌ పేమెంట్స్‌ సహా అన్నింటికీ యూపీఐను ఎక్కువగా వాడుతున్నారు. అయితే, కొన్నిసార్లు అనుకోకుండా ఒకరికి బదులుగా మరొకరికి డబ్బులు ట్రాన్స్‌ఫర్‌ చేస్తుంటాం. అలాంటి టైమ్​లో ఏం చేయాలో తోచక కంగారుపడుతుంటాం. ఒకవేళ డబ్బులు పంపించిన వ్యక్తి తెలిసిన వారైతే అతనిని సంప్రదించి పేమెంట్ వివరాలు చూపించి డబ్బును తిరిగి పొందవచ్చు. అదే, పరిచయం లేని వ్యక్తి అయితే ఆ డబ్బును తిరిగి పొందడానికి ఏం చేయాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

మీరు ఏదైనా రాంగ్ నంబర్​కు డబ్బులు సెండ్ చేసినప్పుడు ముందుగా ఆ ట్రాన్సాక్షన్​కు సంబంధించిన పూర్తి వివరాలను భద్ర పరచుకోవాలి. ముఖ్యంగా ట్రాన్సాక్షన్‌ ఐడీ, యూపీఐ ఐడీ, అమౌంట్‌, లావాదేవీ జరిపిన తేదీలను జాగ్రత్త పరుచుకోవాలి. అలాగే, మీరు ఏదైతే యాప్‌ నుంచి డబ్బు పంపారో దానికి సంబంధించిన వివరాలను స్క్రీన్‌ షాట్‌ తీసి పెట్టుకోవాలి. రాంగ్ యూపీఐ ట్రాన్సాక్షన్ జరిగిన వెంటనే మొదటి 24 నుంచి 48 గంటలు చాలా కీలకమని గుర్తుంచుకోవాలి. ఆ టైమ్​లో వీలైనంత వరకు రిఫండ్ కోసం కంప్లైంట్ ప్రక్రియ స్టార్ట్ చేస్తే వేగంగా డబ్బులు తిరిగి పొందవచ్చంటున్నారు నిపుణులు.

యాప్స్ సాయంతో డబ్బు పొందండిలా!

మీరు యూపీఐ యాప్స్(ఫోన్​ పే, పేటీఎం, గూగుల్​పే) ద్వారా రాంగ్ నంబర్​కు పేమెంట్ చేసినట్లయితే ముందుగా దాని స్క్రీన్ షాట్ తీసుకోవాలి. ఆ తర్వాత మీరు ఏ యాప్ ద్వారా చెల్లింపు జరిపారో దాని కస్టమర్ కేర్​ నంబర్​కు ఫోన్ చేసి జరిగిన విషయం గురించి కంప్లైంట్ ఇవ్వాలి. అనంతరం వాళ్లు ఒక వాట్సాప్ నంబర్ ఇస్తారు. ఆ నంబర్​కు మీరు రాంగ్ ట్రాన్సక్షన్ చేసిన స్కీన్ షాట్​ ఫొటోను షేర్ చేయాలి. అప్పుడు వాళ్లు నిజంగానే రాంగ్ ట్రాన్సాక్షన్ జరిగిందా? లేదా? అని నిర్ధారించుకుని ఆపై రిఫండ్ ప్రాసెస్ స్టార్ట్ చేసి తక్కువ టైమ్​లోనే మీ డబ్బులు తిరిగి పొందడానికి సాయం చేస్తారు.

  • ఫోన్ పే కస్టమర్ కేర్ నంబర్ : 080-68727374, 022-68727374
  • గూగుల్ పే కస్టమర్ కేర్ నంబర్ : 1800 419 0157
  • పేటీఎం కస్టమర్ కేర్ నంబర్ : 0120-4456 456
  • BHIM పే : 1800 120 1740
  • ఫ్యామ్ పే : +91 80458 88881

NPCIలో ఇలా చేయండి!

  • యూపీఐ యాప్‌ కస్టమర్‌ సర్వీసు నుంచి సాయం అందనట్లయితే నేరుగా ఎన్​పీసీఐ(National Payments Corporation of India) పోర్టల్‌లోకి వెళ్లి కంప్లైంట్ చేయండి.
  • ఇందుకోసం ముందుగా ఎన్‌పీసీఐ (NPCI) అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లి లెఫ్ట్ సైడ్ కనిపించే యూపీఐ సెక్షన్‌లో Dispute Redressal Mechanism ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకోవాలి.
  • ఆ తర్వాత కనిపించే Complaint సెక్షన్‌లో మీరు చేసిన రాంగ్ యూపీఐ ట్రాన్సాక్షన్​కు సంబంధించిన వివరాలు సరిగ్గా ఎంటర్‌ చేసి ఫిర్యాదు చేయాలి.
  • నెక్ట్స్ మీ కంప్లైంట్​ను ఎన్​పీసీఐ పరిశీలిస్తుంది. అప్పుడు వారి విచారణలో నిజంగానే తప్పుడు నంబర్​కు డబ్బులు పంపారని తేలితే ఆ డబ్బులను వెంటనే రిఫండ్ చేయాలని సంబంధిత బ్యాంకుకు సూచిస్తుంది.

ఫోన్​ పే యూజర్లకు గుడ్​న్యూస్​ - మనీ ట్రాన్సాక్షన్​లో కొత్త ఫీచర్ - ఇలా సెట్​ చేసుకోండి!

బ్యాంక్‌ సాయం :

మీరు పొరపాటున రాంగ్ యూపీఐ ట్రాన్సాక్షన్ చేసినప్పుడు అందుకు సంబంధించిన విషయాన్ని సదరు బ్యాంక్​లో తెలియజేసి సాయం కోరచ్చు. బ్యాంక్‌ అడిగే అన్ని వివరాలు, పత్రాలు అందించగానే రిఫండ్‌ కోసం ఛార్జ్‌బ్యాక్‌ ప్రక్రియను స్టార్ట్ చేస్తారు. సదరు వ్యక్తిని సంప్రదించి డబ్బు వాపసు ఇప్పించేందుకు ప్రయత్నిస్తారు.

చట్టపరంగా పొందండిలా!

ఎవరికైతే మిస్టేక్​లో డబ్బులు పంపారో ఆ వ్యక్తిని సంప్రదించి విషయం తెలియజేయాలి. పేమెంట్‌ వివరాలు చూపించి డబ్బును తిరిగి ఇవ్వాలని అడగాలి. ఒకవేళ ఆ వ్యక్తి డబ్బు రిఫండ్ చేసేందుకు నిరాకరించినట్లయితే చట్టబద్ధంగా ఫిర్యాదు చేయొచ్చు.

పైన తెలిపిన మార్గాల ద్వారా మీ సమస్యకు నెలలోపు పరిష్కారం దొరకకపోతే నేరుగా ఆర్‌బీఐ అంబుడ్స్‌మన్‌కు ఫిర్యాదు పంపొచ్చు. ఇది డిజిటల్ లావాదేవీల్లో తలెత్తే సమస్యలను పరిష్కరించడానికి ఉన్న అత్యున్నత విభాగం. ఇక్కడ వీలైనంత వరకు మీ సమస్యకు పరిష్కారం లభిస్తుందంటున్నారు నిపుణులు.

ఈ జాగ్రత్తలు తప్పనిసరి :

  • మీరు ఎవరికైనా మనీ సెండ్ చేసే ముందు, యూపీఐ ఐడీ లేదా మొబైల్ నంబర్​ను ఒకటికి రెండు సార్లు జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి.
  • ముందుగా చిన్న మొత్తానికి ట్రై చేయడం బెటర్. పెద్ద మొత్తంలో డబ్బు పంపేముందు ఒకసారి అవతలి వ్యక్తిని సంప్రదించాలి.
  • పేమెంట్ అనంతరం వచ్చిన ట్రాన్సాక్షన్ వివరాలు సురక్షితంగా నిల్వ ఉంచుకోండి.
  • ముఖ్యంగా మీకు ట్రాన్సాక్షన్ విషయంలో ఏదైనా సందేహం ఉంటే ఆ యూపీఐ యాప్ అధికారిక కస్టమర్ సర్వీస్ సెంటర్​ను మాత్రమే సంప్రదించాలి.

గ్రామీణులను లక్షాధికారులను చేసే "పథకం" - తక్కువ టైమ్, మనీ బ్యాక్ సౌకర్యం కూడా!

మీ "ఆధార్ కార్డు" పోయిందా? - వెంటనే ఇలా చేయండి! - పొరపాటు జరిగిందంటే ఇబ్బందులు తప్పవు!