ETV Bharat / business

మీ "ఆధార్ కార్డు" పోయిందా? - వెంటనే ఇలా చేయండి! - పొరపాటు జరిగిందంటే ఇబ్బందులు తప్పవు!

-ఎవరైనా మీ పేరుపై 'కొత్త సిమ్ కార్డ్స్' తీసుకొని ఉండొచ్చు! - సింపుల్​గా ఇలా బ్లాక్ చేసేయండి!

How to Check Your Sim Card Details
How to Check Your Sim Card Details (Getty Images)
author img

By ETV Bharat Telangana Team

Published : February 23, 2026 at 11:27 AM IST

3 Min Read
Choose ETV Bharat

How to Check Your Sim Card Details : నేటి టెక్నాలజీ యుగంలో సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అలాగే, ఆధార్ కార్డుకు సంబంధించి కూడా ఎన్నో నేరాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా మీరు ఎక్కడైనా ఆధార్ పొగొట్టుకున్నప్పుడు కొన్ని సందర్భాల్లో అవి సైబర్ మోసగాళ్ల చేతిలోకి వెళ్లే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు వాళ్లు మీకు తెలియకుండానే మీ ఆధార్​ను దుర్వినియోగం చేసి మీ పేరిట కొత్త సిమ్ కార్డు తీసుకోవచ్చు. ఆ సిమ్ కార్డు సహాయంతో చాలా మందిని బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బులు డిమాండ్ చేయొచ్చు. అలాగే, ఆర్థిక నష్టం, ఐడెంటిటీ థెఫ్ట్, ఇతర వ్యక్తిగత సమాచారం కూడా దుర్వినియోగం అయ్యే అవకాశం ఉంటుంది.

అంతేకాదు, కొన్నిసార్లు మీ పేరు మీద తీసుకున్న నంబర్​పై పోలీస్ కంప్లైంట్స్ నమోదు అవ్వొచ్చు. అప్పుడు పోలీసులు మీ అడ్రస్​ను ట్రేస్ చేస్తూ మీ ఇంటికి రావొచ్చు. ఫలితంగా మీరు జైలుకు వెళ్లాల్సిన పరిస్థితులు ఎదురుకావొచ్చు. అందుకే, ఆధార్ కార్డు విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు నిపుణులు. అంతేకాకుండా, మీ ఆధార్​పై ఎన్ని సిమ్ కార్డ్స్ ఉన్నాయో కూడా చెక్ చేసుకోవాలంటున్నారు. ఇలా చేయడం ద్వారా మీ పేరుపై ఏమైనా ఇల్లీగల్ సిమ్స్ ఉంటే సింపుల్​గా తెలిసిపోతుంది. అప్పుడు మీరే వాటిని ఈజీగా బ్లాక్ చేయొచ్చని సూచిస్తున్నారు. మరి, అదెలాగో ఇప్పుడు చూద్దాం.

సైబర్ మోసాలకు చెక్​ పెట్టాలా?- మీ ఆధార్​ కార్డుకు లాక్ వేసుకోండిలా?

మీ ఆధార్​పై ఉన్న సిమ్ కార్డ్స్​ తెలుసుకోండిలా..

  • మన పేరు మీద ఉండే ఇల్లీగల్ సిమ్ కార్డ్స్ గుర్తించేందుకు కేంద్ర ప్రభుత్వం టాఫ్​కాప్ "సంచార్ సాథి"(SANCHAR SAATHI) అనే వెబ్​సైట్​ను తీసుకొచ్చింది.
  • ఇందుకోసం మీ మొబైల్​లో గూగుల్ బ్రౌజర్​లోకి వెళ్లి సెర్చ్ బార్​లో 'Tafcop Sancharsaathi' అనే టైప్ చేసి సెర్చ్ చేయండి.
  • అప్పుడు ఓపెన్ అయిన కొత్త పేజీలో "TAFCOP" అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే 'Department of Telecommunications' అనే న్యూ పేజీ తెరుచుకుంటుంది.
  • అనంతరం కాస్త కిందకు స్క్రోల్ చేస్తే మీ మొబైల్ నంబర్ అడుగుతుంది. అప్పుడు మీరు యూజ్ చేస్తున్న ఫోన్​ నంబర్​ను ఎంటర్ చేయాలి.
  • ఆ తర్వాత క్యాప్చా కోడ్​ను ఎంటర్​ చేసి కింద కనిపించే 'Validate Captcha' అనే ఆప్షన్​పై క్లిక్ చేయాలి.
  • అప్పుడు మీరు నమోదు చేసిన మొబైల్ నంబర్​కు ఒక ఓటీపీ వస్తుంది. దాన్ని అక్కడ ఎంటర్ చేసి "Login" అనే ఆప్షన్​పై క్లిక్ చేయాలి.
  • అనంతరం మీ పేరు మీద ఎన్ని ఫోన్ నంబర్స్ రిజిస్టర్ అయి ఉన్నాయో అవన్నీ అక్కడ డిస్​ప్లే అవుతాయి.
  • ఆ సిమ్ కార్డుల పక్కనే "Not My Number, Not Required, Required" అనే 3 ఆప్షన్లు కనిపిస్తాయి.
  • అప్పుడు మీకు తెలియకుండా ఏదైనా ఎక్స్​ట్రా సిమ్ కార్డు మీ పేరుపై కనిపిస్తే దాన్ని పక్కన ఉన్న చెక్ బాక్స్​లో రైట్ టిక్ చేసి, ఆ తర్వాత "Not My Number" అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి కింద కనిపిస్తున్న Report అనే ఆప్షన్​పై నొక్కి ఫిర్యాదు చేస్తే సరిపోతుంది.
  • మీరు రిపోర్ట్ చేసిన అనంతరం ప్రభుత్వ అధికారులు వెరిఫై చేసి ఆ నంబర్​ను బ్లాక్ చేస్తారు.
  • అంతే, సింపుల్​గా మీ పేరుపై ఉన్న ఎక్స్​ట్రా ఇల్లీగల్ నంబర్ బ్లాక్ అయిపోతుంది.
  • అదే, మీకు ఇకపై అవసరం లేని సిమ్​ కార్డ్​​ను డిస్​కనెక్ట్ చేయాలనకుంటే "Not Required" పై క్లిక్ చేసి రిపోర్ట్ చేస్తే సరిపోతుంది.
  • ఒక వేళ మీ పేరుపై, మీకు అవసరమైన సిమ్​ కార్డులే ఉంటే అప్పుడు Requiredపై క్లిక్ చేయండి. అలాగని మీరు Required ఆప్షన్​పై క్లిక్ చేయకపోయినా ఏం ఫర్వాలేదు.
  • మరి, లేట్ చేయకుండా మీరూ ఓసారి మీ ఆధార్​పై ఎన్ని సిమ్ కార్డ్స్ ఉన్నాయో ఇలా ఈజీగా తెలుసుకోండి. ఏదైనా మీకు తెలియని ఇల్లీగల్ నంబర్ ఉంటే వెంటనే Not My Number అనే ఆప్షన్​తో రిపోర్ట్ చేసేయండి.
  • ఫలితంగా ఆ నంబర్ బ్లాక్ అవ్వడంతో పాటు మీరు​ ఎలాంటి సైబర్ నేరాలకు గురికాకుండా జాగ్రత్తపడొచ్చంటున్నారు నిపుణులు.
  • ఇది మీ ఆధార్ ద్వారా ఎన్ని సిమ్ కార్డులు జారీ అయ్యాయో తెలుసుకోవడానికి మాత్రమే కాకుండా మీ ఫోన్ ఎవరైనా చోరీ చేసినా, పోగొట్టుకున్నా ఈ ప్రాసెస్​లో సింపుల్​గా మీ సిమ్ కార్డులను బ్లాక్ చేయవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

రుణ యాప్​ల మాయలో పడకండి - ఒక్క మిస్డ్​కాల్​తో రూ.50 లక్షల పర్సనల్​ లోన్​ - SBI కొత్త స్కీమ్​!

ఫోన్​ పే యూజర్లకు గుడ్​న్యూస్​ - మనీ ట్రాన్సాక్షన్​లో కొత్త ఫీచర్ - ఇలా సెట్​ చేసుకోండి!