ETV Bharat / business

ఈ "ఫ్రీ ట్రయల్" మాయలో మీరు చిక్కుకున్నారా? - ఒకసారి చెక్​ చేయండి

- UPI మ్యాండేట్​తో అకౌంట్ కు చిల్లు పెట్టుకుంటున్న వినియోగదారులు - ఇలా క్యాన్సిల్ చేసుకోండి

Auto pay Mandate Cancelation
Auto pay Mandate Cancelation (Eenadu)
author img

By ETV Bharat Telangana Team

Published : July 6, 2026 at 4:48 PM IST

2 Min Read
Choose ETV Bharat

Auto pay Mandate Cancelation : ఇప్పుడే డబ్బులు కట్టి సర్వీస్ తీసుకో అంటే జనాలు ముందుకు రారు. కానీ, "ముందు ఫ్రీగా వాడి చూడండి, ఆ తర్వాతే నమ్మండి" అని చెప్తే? "పోయేదేముంది? ఓ ట్రయల్ వేద్దాం" అని అనుకునేవారు బోలెడు మంది! సరిగ్గా ఇదే ట్రిక్​ ఉపయోగిస్తున్నాయి చాలా కంపెనీలు.

ఓటీటీ ప్లాట్‌ఫామ్స్​, మ్యూజిక్ యాప్స్‌, ఏఐ టూల్స్, క్లౌడ్ స్టోరేజ్‌ వంటి ఎన్నో డిజిటల్ సేవలు "Free Trial" గాలం వేస్తున్నాయి. మరి, నిజంగా ఇది ఫ్రీ ట్రయల్ కాదా? అంటే అది నిజమే. కానీ, అందులోకి వెళ్లడానికి ఇచ్చే "గేట్​ పాస్" దగ్గరే సమస్య వస్తోంది.

యూపీఐ ప్రవేశ ద్వారం :

ఉచిత ట్రయల్ అని చెబుతారు. అది ఎన్ని రోజుల వరకు అమల్లో ఉంటుందో కూడా చూపిస్తారు. కానీ, దాన్ని "టేస్ట్" చేయడానికి ట్రై చేస్తే మాత్రం "UPI AutoPay Mandate"కు అనుమతి ఇవ్వాలని అడుగుతారు. ఇప్పుడే డబ్బులు కట్టాల్సిన పనిలేదు. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎనీ టైమ్​ క్యాన్సిల్​ చేసుకోవచ్చని చెబుతారు. కానీ, పర్మిషన్​ మాత్రం ముందుగానే ఇవ్వాలంటారు. అప్పుడే ఆ ఫ్రీ ట్రయల్ యాక్సెస్ మీకు లభిస్తుంది.

సరే కానీయ్ :

ఈ మెలిక పెట్టడంతో కొందరు వెనక్కు తగ్గినప్పటికీ, మరి కొందరు మాత్రం ముందుకు సాగుతారు. "ఫ్రీ ట్రయల్ ముగిసిన తర్వాత కదా డబ్బులు చెల్లించాల్సింది" అనే ఆలోచనతో "ఓకే.. ఆల్​ రైట్​"అని పర్మిషన్ ఇచ్చేస్తారు. ఇలా పర్మిషన్ ఇచ్చిన వారిలో చాలా మంది ఆ విషయమే మరిచిపోతున్నారట. దాంతో ఫ్రీ ట్రయల్ ముగిసిపోయిన తర్వాత బ్యాంకు ఖాతా నుంచి అమౌంట్ కట్​ అవుతోంది. ఆ డబ్బు కట్​ అయిన తర్వాత కొందరు గుర్తిస్తే, రోజూవారీ లావాదేవీలు ఎక్కువగా చేసేవారు ఆ విషయాన్నే గమనించలేకపోతున్నారట!

ఒకవేళ మీ బ్యాంకు ఖాతాలో నగదు నిల్వ లేకపోతే, అప్పటికి అటో డెబిట్ డిక్లైన్ కావచ్చు. కానీ, బ్యాలెన్స్​ మెయింటెయిన్​ చేయనందుకు బ్యాంకులు ఛార్జీలు విధిస్తాయి. కాబట్టి.. కుదిరితే ఈ వైపు నుంచి, కుదరకపోతే ఆ వైపు నుంచి అన్నట్టుగా దెబ్బ పడడం మాత్రం ఖాయం అన్నమాట! కాబట్టి.. ఆటో పే మ్యాండేట్ ఇచ్చే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి.

మ్యాండేట్‌ను ఎలా క్యాన్సిల్ చేయాలి?

  • ముందుగా మీ UPI AutoPay మ్యాండేట్లు ఇలా చెక్​ చేయండి
  • మీరు ఉపయోగించే UPI యాప్‌లోకి వెళ్లండి. చాలా మంది ఒకటికి మించిన యూపీఐ యాప్స్ వాడుతుంటారు.
  • UPI యాప్‌ ఓపెన్ చేసిన తర్వాత AutoPay/Mandates విభాగానికి వెళ్లండి.
  • అక్కడ మీరు ఎన్నింటికి పర్మిషన్ ఇచ్చారో, అవన్నీ కనిపిస్తాయి. రద్దు చేయాలనుకున్న మ్యాండేట్‌ను ఎంచుకోండి.
  • తర్వాత Cancel లేదా Revoke లేదంటే Pause ఆప్షన్​ మీద నొక్కండి.
  • ఈ యాక్షన్ కంప్లీట్ చేయడానికి మీ UPI PIN నమోదు చేయాలని అడుగుతుంది. అలాగే ఎంటర్ చేయండి.
  • దాంతో ఆటో డెబిట్ ఆప్షన్​ క్యాన్సిల్​ అయిపోతుంది.