పెరిగిన బంగారం ధరలు- సెప్టెంబర్ 2న తెలుగు రాష్ట్రాల్లో రేటు ఎంతంటే?
తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు- ఆభరణాలు కొనుగోలు సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు- నిపుణుల సూచనలు

Published : September 2, 2026 at 9:48 AM IST
Gold Rate Today : కొద్దిరోజులుగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు బుధవారం స్వల్పంగా పెరిగాయి. క్యాప్స్ గోల్డ్ వెబ్‌సైట్ వెల్లడించిన వివరాల ప్రకారం, మంగళవారం హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ.1,54,250గా ఉంది. అయితే బుధవారం నాటికి రూ.910 పెరిగి రూ.1,55,160కు చేరింది. ఇవే ధరలు విశాఖపట్నం, విజయవాడ, నెల్లూరు, ప్రొద్దుటూరు వంటి నగరాల్లోనూ కొనసాగుతున్నాయి.
22 క్యారెట్ల బంగారం ధర
ఇక, 22 క్యారెట్ల బంగారం ధర కూడా ప్రస్తుతం భారీ స్థాయిలోనే కొనసాగుతోంది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,41,240గా ఉంది. సాధారణంగా బంగారు ఆభరణాల తయారీకి 22 క్యారెట్ల బంగారాన్నే ఎక్కువగా వినియోగిస్తారు. 24 క్యారెట్ల బంగారం అత్యంత స్వచ్ఛమైనదిగా పరిగణించినప్పటికీ అది చాలా మృదువుగా ఉండటం వల్ల నేరుగా ఆభరణాలు తయారు చేయడానికి అంత అనుకూలంగా ఉండదు. ఇక, స్పాట్ గోల్డ్ ధర ఔన్స్‌కు 4305 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
వెండి ధర ఎంత?
మరోవైపు, కొనుగోలు దారులకు వెండి ధరలు స్పల్ప ఊరటనిచ్చాయి. మంగళవారం కిలో వెండి ధర రూ.2,34,890గా ఉండగా బుధవారం నాటికి రూ.535 తగ్గి రూ.2,34,355కు చేరింది. ఇక, సిల్వర్ ధర ఔన్స్‌కు 63 డాలర్ల వద్ద కొనసాగుతోంది. అయితే, బంగారంతో పోలిస్తే వెండికి పారిశ్రామికంగా గణనీయమైన డిమాండ్ ఉంది. ఎలక్ట్రానిక్స్, సౌర విద్యుత్ పరికరాలు, ఇతర పారిశ్రామిక ఉత్పత్తుల తయారీలో దీనిని ఉపయోగిస్తారు. అందువల్ల, పారిశ్రామిక డిమాండ్‌లో వచ్చే మార్పులు వెండి ధరపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది.
అయితే, అంతర్జాతీయ మార్కెట్లలో కొనసాగుతున్న అనిశ్చితి, వివిధ దేశాల్లో కరెన్సీ మార్పిడి రేట్లలో హెచ్చుతగ్గులు బంగారం, వెండి ధరలను ప్రభావితం చేస్తున్నాయని నిపుణులు భావిస్తున్నారు. బంగారు ఆభరణాలను కొనుగోలు సమయంలో బిల్లు ఇతర సంబంధిత వివరాలను జాగ్రత్తగా సరిచూసుకోవడం వంటి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆభరణం తయారీకి అయ్యే మేకింగ్ ఛార్జీలు, పన్నులు, రత్నాలు లేదా విలువైన మణుల ధరలు సరిచూసుకోవడం తప్పనిసరి అంటున్నారు.
అసలు బంగారం ధరలను ఎలా నిర్ణయిస్తారు?
దేశీయ బంగారం ధరలను నిర్ణయించడంలో గోల్డ్ జ్యువెలర్స్ అసోసియేషన్లు కీలక పాత్ర పోషిస్తాయి. గోల్డ్ వ్యాపారులు, రిటైలర్లు స్థానిక మార్కెట్ పరిస్థితుల ఆధారంగా రోజువారీ ధరలను నిర్ణయిస్తారు. ఫలితంగా, నగరాల మధ్య ధరలలో స్వల్ప వ్యత్యాసాలు కనిపిస్తుంటాయి. అయినప్పటికీ ఈ తేడాలు సాధారణంగా చాలా తక్కువగా ఉంటాయి. బంగారం స్వచ్ఛత, బరువు, మార్కెట్ రేట్లు, తయారీ ఛార్జీలు, పన్నులు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ధరలను నిర్ణయిస్తారు. రత్నాలు, వజ్రాలు లేదా ఇతర విలువైన రాళ్లతో పొదిగిన ఆభరణాల విలువను విడిగా లెక్కిస్తారు.
గోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ చేయాలా?
చాలా మంది బంగారంపై పెట్టుబడులు పెట్టడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇందుకోసం అనేక మార్గాలు ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇతర ఆస్తుల మాదిరిగా బంగారానికి అధిక తరుగుదల లేదా అస్థిరత ఉండదు. బంగారంపై పెట్టుబడి పెట్టడం వలన ఆర్థిక భద్రత చేకూరుతుంది. పైగా ఆర్థిక అవసరాలు వచ్చినప్పుడు, మీ బంగారం కుటుంబానికి రక్షణ కవచంగా పనిచేస్తుంది. ద్రవ్యోల్బణం నుంచి కూడా ఇది మీకు రక్షణ కల్పిస్తుంది.
డిజిటల్ గోల్డ్
ఆన్లైన్లో కూడా బంగారంపై పెట్టుబడి పెట్టవచ్చు. దీనినే డిజిటల్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. సిప్ విధానంలో రూ.500 నుంచి ఎంత పెద్ద మొత్తమైనా పెట్టి డిజిటల్ గోల్డ్ కొనుగోలు చేయవచ్చు. ఈఎంఐ పద్ధతిలో కూడా బంగారాన్ని కొనవచ్చు. బంగారం కొనాలనుకునే మహిళలు సురక్షితమైన ప్లాట్‌ఫామ్స్ ద్వారా డిజిటల్ గోల్డ్‌పై ఇన్వెస్ట్ చేయవచ్చు. పైగా దీనిపై వచ్చే రాబడికి నిబంధనల మేరకు పన్ను మినహాయింపులు కూడా ఉంటాయి. అయితే దీనికి ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, డిజిటల్ బంగారం భద్రత అనేది, మనం ఎంచుకునే ప్లాట్‌ఫామ్ విశ్వనీయత మీద ఆధారపడి ఉంటుంది
పర్సనల్ లోన్ ముందే చెల్లిస్తే "క్రెడిట్ స్కోర్" పెరుగుతుందా? - నిపుణుల సమాధానమిదే!
ఒరాకిల్ ఉద్యోగుల్లో '6AM' భయం- 3వేల మందిపై వేటుకు సిద్ధం! మైక్రోసాఫ్ట్‌లోనూ నోటీసులు

