ETV Bharat / business

గుడ్​న్యూస్​! మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు- ఆగస్టు 29న తెలుగు రాష్ట్రాల్లో రేట్​ ఎంతంటే?

తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు- ఆభరణాలు కొనుగోలు సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు- నిపుణుల సూచనలు

Gold Rate Today
బంగారం, వెండి ధరలు (Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : August 29, 2026 at 10:08 AM IST

3 Min Read
Choose ETV Bharat

Gold Rate Today : కొద్దిరోజుల క్రితం క్రమంగా పెరిగిన పసిడి, వెండి ధరలు, గత మూడు నాలుగు రోజులుగా తగ్గుతూ వస్తున్నాయి. దేశీయ బులియన్‌ మార్కెట్​లో బంగారం, వెండి ధరలు శనివారం భారీగా పతనమయ్యాయి. క్యాప్స్ గోల్డ్ వెబ్‌సైట్ వెల్లడించిన వివరాల ప్రకారం, శుక్రవారం హైదరాబాద్​లో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం రూ.1,63,090 ఉండగా, శనివారం నాటికి రూ.1,680 తగ్గి రూ.1,61,410 కి చేరింది. విశాఖపట్నం, నెల్లూరు, విజయవాడ, ప్రొద్దుటూరు నగరాల్లోనూ ఇవే ధరలు ట్రేడింగ్​లో కొనసాగుతున్నాయి . ఇదిలా ఉండగా, 22 క్యారెట్ల పసిడి రేటు విషయానికొస్తే, రూ.1,47,710గా ఉంది. ఇక, అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధర ఔన్స్‌కు 4,454 డాలర్ల వద్ద ట్రేడింగ్​ అవుతోంది.

సిల్వర్​ ధర ఎంత?
ఇక, వెండి ధరల్లోనూ భారీగా మార్పులు వచ్చాయి. శుక్రవారం కిలో వెండి ధర రూ.2,46,700 ఉండగా, శనివారం నాటికి రూ.2650 త్గగి రూ. 2,44,050కి చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ సిల్వర్ ధర ఔన్స్‌కు 66 డాలర్లుగా కొనసాగుతోంది. బంగారంతో పోలిస్తే వెండికి పారిశ్రామికంగా గణనీయమైన డిమాండ్ ఉంది. ఎలక్ట్రానిక్స్, సౌర విద్యుత్ పరికరాలు, ఇతర పారిశ్రామిక ఉత్పత్తుల తయారీలో దీనిని విస్తృతంగా ఉపయోగిస్తారు. అందువల్ల, పారిశ్రామిక డిమాండ్‌లో వచ్చే మార్పులు వెండి ధరపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది.

అయితే, ఆభరణాలను కొనుగోలు చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. కేవలం బంగారం మార్కెట్ ధరను మాత్రమే పరిగణనలోకి తీసుకోకూడదని, తయారీ ఖర్చులు, పన్నులు, రత్నాలు లేదా విలువైన రాళ్ల ధర వంటి అదనపు ఖర్చులను కూడా చెల్లించాల్సి ఉంటుందని చెబుతున్నారు. దీనివల్ల, వినియోగదారుడు చెల్లించే తుది మొత్తం బంగారం అసలు ధర కంటే ఎక్కువగా ఉంటుంది. నిపుణుల ప్రకారం, అంతర్జాతీయ మార్కెట్‌లోని పరిణామాలు దేశీయ బంగారం ధరలపై ప్రభావం చూపుతాయి. ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, పెట్టుబడిదారుల కొనుగోలు ఆసక్తి వంటి అంశాలు బంగారం ధరల కదలికలలో కీలక పాత్ర పోషిస్తాయి.

బిల్​ తప్పనిసరి!
బంగారం స్వచ్ఛతను క్యారెట్లలో కొలుస్తారు. 24 క్యారెట్ల బంగారం అత్యంత స్వచ్ఛమైన రూపంగా పరిగణిస్తారు. అయితే, ఇది మృదువుగా ఉండటం వల్ల, సాధారణంగా ఆభరణాల తయారీకి దీనిని ఉపయోగించరు. ఆభరణాలను ప్రధానంగా 22-క్యారెట్ లేదా 18-క్యారెట్ బంగారంతో తయారు చేస్తారు. సాధారణంగా, బంగారం స్వచ్ఛత ఎక్కువగా ఉంటే దాని ధర కూడా ఎక్కువగా ఉంటుంది. ఆభరణాల తయారీ ఖర్చును భర్తీ చేయడానికి మేకింగ్ ఛార్జీలు వసూలు చేస్తారు. ఈ ఛార్జీలు డిజైన్, తయారీ విధానాన్ని బట్టి మారుతూ ఉంటాయి. సాధారణంగా, ఈ తయారీ రుసుములు బంగారం విలువలో 8శాతం నుంచి 35శాతం వరకు ఉండవచ్చు. కాబట్టి, ఆభరణాలను కొనుగోలు చేసే ముందు తయారీ రుసుములకు సంబంధించిన వివరాలను సరిచూసుకోవడం మంచిది.

బంగారం ధరలు ఎలా నిర్ణయిస్తారు?
దేశీయ బంగారం ధరలను నిర్ణయించడంలో స్వర్ణకారుల సంఘాలు కీలక పాత్ర పోషిస్తాయి. నిర్దిష్ట ప్రాంతాల్లోని బంగారం వ్యాపారులు, విక్రేతలు స్థానిక మార్కెట్ పరిస్థితుల ఆధారంగా రోజువారీ ధరలను నిర్ణయిస్తారు. ఫలితంగా, నగరాల మధ్య ధరల్లో స్వల్ప వ్యత్యాసాలు కనిపిస్తాయి. అయితే ఈ తేడాలు సాధారణంగా చాలా తక్కువగా ఉంటాయి. ధరను నిర్ణయించేటప్పుడు బంగారం స్వచ్ఛత, బరువు, మార్కెట్ ధర, తయారీ ఖర్చులు, పన్నులు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు.

వాహనదారులకు షాక్- భారీగా పెరిగిన CNG ధర- ఎంతంటే?

రూ.1 లక్షకు 5 నిమిషాల్లో రూ.44 లక్షల లాభం- ట్రేడర్ పోస్ట్ నెట్టింట వైరల్!