ETV Bharat / business

భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు- ఆగస్టు 28న తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతంటే?

తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు- ఆభరణాలు కొనుగోలు సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు- నిపుణుల సూచనలు

Gold Rate Today
బంగారం, వెండి ధరలు (Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : August 28, 2026 at 9:31 AM IST

3 Min Read
Choose ETV Bharat

Gold Rate Today : పండగ సమయంలో ఆభరణాలు కొనాలనుకునేవారికి ఊరట కలిగించే విధంగా దేశీయ బులియన్‌ మార్కెట్లో బంగారం, వెండి ధరలు భారీగా దిగివచ్చాయి. క్యాప్స్ గోల్డ్ వెబ్‌సైట్ వెల్లడించిన వివరాల ప్రకారం, గురువారం హైదరాబాద్​లో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం రూ.1,64,880 ఉండగా, శుక్రవారం నాటికి రూ.1790 తగ్గి రూ.1,63,090కు చేరింది. నెల్లూరు, విశాఖపట్నం, విజయవాడ, ప్రొద్దుటూరు నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఇక, 22 క్యారెట్ల పసిడి రేటు రూ.1,49,540గా ఉంది. స్పాట్ గోల్డ్ ధర విషయానికొస్తే, అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్‌కు 4,580 డాలర్ల వద్ద నమోదైంది.

సిల్వర్​ ధర ఎంత?
ఇక, వెండి ధరలు సైతం భారీగా దిగివచ్చాయి. గురువారం కిలో వెండి ధర రూ.2,51,380 ఉండగా, శుక్రవారం నాటికి రూ.4680 త్గగి రూ.2,46,700కు చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ సిల్వర్ ధర ఔన్స్‌కు 68 డాలర్లుగా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లలో కొనసాగుతున్న అనిశ్చిత పరిస్థితులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, వివిధ దేశాల కరెన్సీల మారకం విలువల్లో వస్తున్న మార్పులు పసిడి, వెండి ధరలపై ప్రభావం చూపుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. అయితే, ప్రపంచ మార్కెట్లలో జరిగే పరిణామాలకు అనుగుణంగా దేశీయ బులియన్‌ మార్కెట్లోనూ ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి.

తెలుగు సంస్కృతి, సంప్రదాయాల్లో ముఖ్యంగా పెళ్లిళ్లు, శుభకార్యాలు అనగానే ముందుగా గుర్తొచ్చేది బంగారమే. అంతేకాదు, పెట్టుబడికి పెట్టాలనుకునే వారికి కూడా పసిడి ఒక మంచి సాధనంగా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. బంగారంతో పాటు వెండికీ మంచి గిరాకీనే ఉందని, అందుకే వీటి ధరలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడం ఎంతో ముఖ్యమని అంటున్నారు. అయితే, ఆభరణాలు కొనుగోలు చేసేముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణుల సూచిస్తున్నారు. కొనుగోలు సమయంలో అందుకు సంబంధించిన బిల్​ వంటివి సరిచూసుకోవాలని అంటున్నారు. బిల్లు లేకుండా ఆభరణాలు కొనుగోలు చేయవద్దని, దానివల్ల కొన్ని చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు. బంగారం నాణ్యత సరిగా లేకుంటే భారీగా నష్టపోవాల్సి వస్తుందని, అలాగే, ఆభరణం మరమ్మతులకూ బాధ్యత వహించరని అంటున్నారు. కాబట్టి బంగారం కొనేటప్పుడు బిల్లు తప్పక తీసుకోవడం మంచిది.

నిపుణుల ప్రకారం,
కొనుగోలు సమయంలో ఆభరణాలకు సంబంధించిన ధరలను ఇలా చూసుకోవాలి. కొన్ని దుకాణాలు, ప్రాంతాల్లో పన్నులు, సుంకాలు ముందుగా కలపకుండా లోహాల ధరలను ప్రకటిస్తుంటాయి. దీనివల్ల ధర తక్కువగా కనిపిస్తుంటుంది. అయితే, ఆభరణం తయారీ, తరుగు ఛార్జీల్లో మాత్రం ప్రతి దుకాణానికీ వ్యత్యాసాలు ఉంటాయి. కానీ, ఆభరణం నచ్చి, బిల్లు వేయమన్నప్పుడు, పన్నులు/సుంకాలు కలిపితే, ఏ ప్రాంతంలో అయినా బంగారానికి ఒకటే ధర అవుతుంది.

అసలు ఈ బంగారం, వెండి ధరల పెరుగుదల, తగ్గుదలను ఎలా లెక్కిస్తారో తెలుసా? బంగారం, వెండి వంటి విలువైన లోహాల ధరలు అంతర్జాతీయ విపణికి అనుగుణంగానే ఉంటాయి. అక్కడ పెరిగితే ఇక్కడా పెరుగుడం, తగ్గితే తగ్గిడం వంటివి జరుగుతాయి. మన దేశం బంగారం కోసం దాదాపుగా దిగుమతులపైనే ఆధారపడినందున డాలర్‌ మారకపు విలువ కూడా దేశీయంగా పుత్తడి ధరలపై ప్రభావం చూపుతుంది. ఇక, బంగారం స్వచ్ఛతను క్యారట్లల్లో కొలుస్తారు. క్యారట్ల వాల్యూ పెరిగే కొద్దీ బంగారం స్వచ్ఛత, ధర పెరుగుదల ఉంటుంది. మేలిమి బంగారాన్ని 24 క్యారట్లుగా చెబుతారు. అంటే ఇది 99.9 స్వచ్ఛమైన బంగారమన్నమని. ఇది కాయిన్స్‌, బార్స్‌, బిస్కెట్ల రూపంలో మాత్రమే లభిస్తుంది. అయితే, నగల తయారీకి 22 క్యారట్ల స్వచ్ఛతతో కూడిన బంగారాన్ని వినియోగిస్తారు. ఆభరణ దృఢత్వం కోసం ఇందులో ఇతర లోహాలు కలుపుతారు. అయితే, బంగారంతో చేయించుకునే ఆభరణాలన్నీ 22 క్యారెట్లు/916 స్వచ్ఛతతో ఉంటాయి. ఈ ధర కోసం మేలిమి బంగారం ధరను 91.6 శాతంతో గుణిస్తే సరిపోతుంది.

పే స్లిప్‌ లేకున్నా 'పర్సనల్ లోన్' - ఈ మార్గాల్లో ఈజీగా పొందవచ్చు!

తగ్గిన బంగారం, వెండి ధరలు- ఆగస్టు 27న తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఎంతంటే?