ETV Bharat / business

శ్రావణంలో గోల్డ్ కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్‌- మళ్లీ తగ్గిన బంగారం ధర- ఆగస్టు 17న ఎంతంటే?

అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో పసిడి, వెండి ధరల్లో మార్పులు- ఆగస్టు 17వ తేదీన తెలుగు రాష్ట్రాల రేట్ల వివరాలు ఇలా!

Gold Rate Today
బంగారం ప్రతీకాత్మక చిత్రం (Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : August 17, 2026 at 9:51 AM IST

3 Min Read
Choose ETV Bharat

Gold Rate Today : శ్రావణ మాసంలో బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ఊరట కలిగించే వార్త. దేశీయ బులియన్‌ మార్కెట్లో సోమవారం బంగారం, వెండి ధరలు మరోసారి తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్లలో కొనసాగుతున్న అనిశ్చిత పరిస్థితులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, పెట్టుబడిదారుల కొనుగోలు ఆసక్తి, పారిశ్రామిక అవసరాలు, వివిధ దేశాల కరెన్సీల మారకం విలువల్లో మార్పులు పసిడి, వెండి ధరలపై ప్రభావం చూపుతున్నాయి. దీంతో గత ధరలతో పోలిస్తే సోమవారం పసిడి, వెండి రేట్లు దిగివచ్చాయి.

హైదరాబాద్‌లో బంగారం ధరలు
క్యాప్స్‌ గోల్డ్‌ వెబ్‌సైట్‌ వెల్లడించిన వివరాల ప్రకారం, హైదరాబాద్‌లో సోమవారం 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ.1,55,215గా నమోదైంది. గత ధరతో పోలిస్తే ఇది తగ్గింది. విజయవాడ, విశాఖపట్నం, నెల్లూరు, ప్రొద్దుటూరు నగరాల్లోనూ దాదాపు ఇదే ధర కొనసాగుతోంది. బంగారు ఆభరణాల తయారీలో సాధారణంగా ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం ధర కూడా తగ్గింది. 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.1,40,150గా ఉంది.

అయితే నగలు కొనుగోలు చేసేటప్పుడు కేవలం బంగారం ధరను మాత్రమే కాకుండా మేకింగ్‌ ఛార్జీలు, పన్నులు, రత్నాల ధరలు వంటి అదనపు ఖర్చులను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం ధరల్లో మార్పులు కనిపిస్తున్నాయి. స్పాట్‌ గోల్డ్‌ ధర ఔన్స్‌కు 4,398 డాలర్ల వద్ద కొనసాగుతోంది. ప్రపంచ మార్కెట్లలో చోటుచేసుకునే పరిణామాలు దేశీయ పసిడి ధరలపై నేరుగా ప్రభావం చూపుతాయి.

వెండి ధర ఎంతంటే?
బంగారంతో పాటు వెండి ధర కూడా సోమవారం తగ్గింది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.2,37,768కు దిగివచ్చింది. అంతకుముందు నమోదైన ధరతో పోలిస్తే ఇది తక్కువ. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్‌ సిల్వర్‌ ధర ఔన్స్‌కు 65.55 డాలర్ల వద్ద కొనసాగుతోంది. వెండికి పారిశ్రామికంగా కూడా భారీగా డిమాండ్‌ ఉంటుంది. ఎలక్ట్రానిక్స్‌, సౌర విద్యుత్‌ పరికరాలు, ఇతర పారిశ్రామిక ఉత్పత్తుల్లో వెండిని ఉపయోగిస్తారు. దీంతో పారిశ్రామిక డిమాండ్‌లో మార్పులు కూడా వెండి ధరలను ప్రభావితం చేస్తాయి.

బంగారం ధరలను ఎవరు డిసైడ్ చేస్తారు?
దేశంలో బంగారం ధరలు నిర్ణయించడంలో గోల్డ్ జ్యువెల్ అసోసియేషన్లు కీలక పాత్ర పోషిస్తాయి. ఆయా నగరాల్లోని బంగారం వర్తకులు, రిటైలర్లు స్థానిక మార్కెట్ పరిస్థితులకు అనుగుమంగా రోజువారీ ధరలను నిర్ణయిస్తారు. ప్రతి నగరంలో కూడా గోల్డ్ జ్యువెలర్స్ అసోసియేషన్ ఉండడంతో ప్రాంతాన్ని బట్టి ధరల్లో స్పల్ప తేడాలు కనిపించవచ్చు. అయితే నగరాల మధ్య ఉండే ఆ ధరల వ్యత్యాసం సాధారణంగా చాలా తక్కువగానే ఉంటుంది. అందువల్ల బంగారం కొనుగోలు చేసేటప్పుడు స్థానిక మార్కెట్ రేటును ఒకసారి పరిశీలించడం మంచిది. బంగారు ఆభరణాల ధరను నిర్ణయించేటప్పుడు పసిడి స్వచ్ఛత, బంగారు బరువు, మేకింగ్ ఛార్జీలు, పన్నులు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. రత్నాలు లేదా విలువైన మణులు పొదిగిన ఆభరణాలైతే వాటి ధరను అదనంగా లెక్కిస్తారు.

గోల్డ్‌ ప్యూరిటీ: బంగారం స్వచ్ఛతను క్యారెట్లలో కొలుస్తారు. 24 క్యారెట్ల బంగారం అత్యంత స్వచ్ఛమైనది. అయితే 24 క్యారెట్ల బంగారం చాలా మెత్తగా ఉండటంతో సాధారణంగా ఆభరణాల తయారీకి ఉపయోగించరు. నగల తయారీలో ఎక్కువగా 22 లేదా 18 క్యారెట్ల బంగారాన్ని ఉపయోగిస్తారు. ప్యూరిటీ ఎక్కువగా ఉంటే బంగారం ధర కూడా ఎక్కువగా ఉంటుంది.

మేకింగ్‌ ఛార్జీలు: నగల తయారీకి అయ్యే ఖర్చును మేకింగ్‌ ఛార్జీలుగా వసూలు చేస్తారు. ఇవి ఆభరణం డిజైన్‌, తయారీ విధానం, జువెలర్‌ ఆధారంగా మారుతాయి. సాధారణంగా బంగారం విలువలో 8 శాతం నుంచి 35 శాతం వరకు మేకింగ్‌ ఛార్జీలు ఉండొచ్చు. అందుకే నగలు కొనుగోలు చేసే ముందు మేకింగ్‌ ఛార్జీలను తప్పకుండా తెలుసుకోవాలి.

రత్నాలు, మణుల ధర: వజ్రాలు, మాణిక్యాలు, ఇతర విలువైన రాళ్లు పొదిగిన నగల ధరను లెక్కించేటప్పుడు బంగారం ధరతో పాటు రత్నాల విలువను కూడా ప్రత్యేకంగా కలుపుతారు. ఇలాంటి ఆభరణాలకు మేకింగ్‌ ఛార్జీలు కూడా సాధారణ నగల కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.

రోజువారీ మార్పులు: అంతర్జాతీయ మార్కెట్‌, డిమాండ్‌-సప్లై, కరెన్సీ మారకం విలువ, భౌగోళిక రాజకీయ పరిణామాలు, పెట్టుబడిదారుల ఆసక్తి వంటి అనేక అంశాలపై బంగారం ధర ఆధారపడి ఉంటుంది. అందువల్ల పసిడి, వెండి ధరలు రోజురోజుకూ మారుతుంటాయి.

"డిజిటల్​ సంతకాలు" అంటే ఏంటి? - ఇవి ఆన్‌లైన్ మోసాలను ఎలా నివారిస్తాయి?

LPG ఉత్పత్తికి కేంద్రం కొత్త లక్ష్యాలు- రిలయన్స్‌కు అత్యధిక కోటా