ETV Bharat / business

ఆర్థికంగా ఫిట్ గా ఉండాలంటే.. ఇలా చేయాల్సిందే!

- ఆర్థిక స్వేచ్ఛ హద్దులు దాటితే ఇబ్బందులేనంటున్న నిపుణులు - ఈ పనులు చేస్తున్నారో లేదో చెక్​ చేసుకోవాలని సూచన

Financial Fitness
Financial Fitness (Eenadu)
author img

By ETV Bharat Telangana Team

Published : June 4, 2026 at 2:58 PM IST

2 Min Read
Choose ETV Bharat

ఆరోగ్యపరంగా ఫిట్​గా ఉన్నారా? లేదా? అనేది మనిషిని చూసి చెప్పొచ్చు.

మరి, ఆర్థికంగా ఫిట్​గా ఉన్నారా లేదా? అనేది ఎలా తెలుస్తుంది?

వేసుకునే దుస్తులను చూస్తే?

తిరిగే వాహనాలను చూస్తే?

ఇంట్లోని వస్తువులను చూస్తేనా.. చేస్తున్న ఖర్చులను చూస్తేనా??

ఇవేవీ కాదు..

అత్యవసరం వచ్చినప్పుడు ఎలాంటి టెన్షనూ పడకుండా.. ఓ లక్ష రూపాయలు బయటకు తీయగలరా? ముప్పు ముంచుకొచ్చినప్పుడు బెంబేలెత్తిపోకుండా.. ఆ సొమ్ముకు మరికాస్త యాడ్ చేయగలరా?

ఈ రెండు ప్రశ్నలకు మీరు ఎంత ధీమాగా ఆన్సర్​ చెబితే, మీరు ఆర్థికంగా అంత ఫిట్​గా ఉన్నట్టు లెక్క! ఎంత డల్​గా సమాధానమిస్తే.. మీ వెల్త్​ ఫిట్​ నెస్​ అంత వీక్​గా ఉన్నట్టు లెక్క!!

బాడీ వీక్​ గా ఉన్నవారికి పౌష్టికాహారం తీసుకోవాలని వైద్యులు సలహా ఇస్తారు. ప్రొటీన్ నుంచి ఐరన్ దాకా ఎలాంటి పోషకాలు తీసుకోవాలో చెప్పి, అందుకోసం ఏమేం తినాలో కూడా సూచిస్తారు.

ఇదే విధంగా, మీ వెల్త్​ వీక్​గా ఉంటే కూడా "ఎకనామికల్ న్యూట్రిషన్స్​" సమకూర్చుకోవాలని ఆర్థిక నిపుణులు అడ్వైస్ చేస్తున్నారు. ఇందుకోసం ఏం చేయాలో కూడా సజెస్ట్ చేస్తున్నారు.

అవసరం లేని లగ్జరీ వస్తువులకు, అనవసర షోఆఫ్​లకు దూరంగా ఉండాలి. మీకు నిజంగా ఏం అవసరం? ఎందుకు అవసరం? అనే ప్రశ్నలు నిజాయితీగా మీకు మీరు వేసుకోవాలి. అప్పుడు తెలుస్తుంది.. ఏది అవసరమో!

చేతిలో క్రెడిట్ కార్డు ఉందని ఎడాపెడా గీకేస్తుంటారు. ఆ తర్వాత బిల్లు చెల్లించాల్సి వచ్చినప్పుడు నానా తంటాలు పడుతుంటారు. అందుకే.. ఆర్థిక స్వేచ్ఛ ఎంత ముఖ్యమో, ఆర్థిక క్రమశిక్షణ అంతకన్నా ముఖ్యం.

ప్రతినెలా మీ సంపాదనలో కనీస మొత్తమైనా పొదుపు చేస్తున్నారా? మ్యూచువల్‌ ఫండ్స్, FD, SIP వంటి మార్గాల్లో పెట్టుబడి పెడుతున్నారా? ఫ్యూచర్​లో జీవితం ఇబ్బందుల్లో పడకూడదంటే ఇవి తప్పక చేయాల్సిందే. అలా కాకుండా వచ్చిన డబ్బు వచ్చినట్టుగా ఖర్చు చేస్తూ పోతే ఖాళీచేతులే మిగులుతాయి

"నచ్చినట్టు బతకాలి" ఇదే నేటి జనరేషన్ మాట. తప్పులేదు, కచ్చితంగా అలాగే జీవించాలి. కానీ, నచ్చినట్టు బతకడం అంటే.. దుబారా ఖర్చులు చేస్తూ ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకోవడం కాదు కదా! డబ్బును మేనేజ్ చేయడం చాలా చాలా అవసరమని గుర్తించాలి

చివరగా.. ఇతరులతో కంపేర్ చేసుకోవడం, ఎదుటి వారి ముందు హెచ్చులు ప్రదర్శించడానికి ఆడంబరాలకు పోవడం చాలా మంది చేస్తుంటారు. అనవసర ఖర్చులకు, అప్పుల ఊబిలో చిక్కుకోవడానికి ఇదే ప్రధాన కారణం.

ఎవరి ముందో మిమ్మల్ని మీరు ప్రదర్శనకు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీ పద్ధతిలో హుందాగా కనిపిస్తే చాలు. ఇది ఆత్మవిశ్వాసానికి ప్రతీక. ఎదుటివారి గుర్తింపుకోసం ఆడంబరాలకు పోవడమనేది ఆత్మనూన్యతా భావాన్ని సూచిస్తుంది.

అందువల్ల ఎవరి మెప్పుకోసమో మీరు ఆరాటపడకండి. వారి ముందు "లగ్జరీ" చూపించుకోవడానికి తాపత్రయపడకండి. మీ దారిలో మీరు హుందాగా వెళ్లిపోండి. నిజంగా నచ్చినట్టు బతకడం అంటే ఇదే.

ఇవన్నీ ఒకసారి క్రాస్​ చెక్​ చేసుకుంటే మీకే తెలిసిపోతుంది. మీరు ఎకనామికల్లీ ఫిట్​గా ఉన్నారా? లేదా అని!