ETV Bharat / business

పీఎఫ్​ చందాదారులకు గుడ్ న్యూస్​- రూ.5లక్షల వరకు ఆటోమేటిక్​ క్లెయిమ్ సెటిల్​మెంట్​

ఈపీఎఫ్‌లో కొత్త డిజిటల్ వ్యవస్థ ప్రారంభం- ఈనెల 15 నాటికి పీఎఫ్‌ చందాదారుల ఖాతాల్లో వడ్డీ జమ

EPFO
EPFO (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : July 8, 2026 at 1:30 PM IST

3 Min Read
Choose ETV Bharat

EPFO New Digital System : పీఎఫ్​ చందాదారులకు గుడ్ న్యూస్​. ఈపీఎఫ్​ఓ కొత్త డిజిటల్​ వ్యవస్థను ప్రారంభించింది. ఆటోమేటిక్ క్లెయిమ్ సెటిల్​మెంట్​ను రూ.5 లక్షల వరకు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 15 నాటికి పీఎఫ్ చందాదారాల ఖాతాల్లో వడ్డీ జమ చేయనున్నట్లు తెలిపింది. గతంలో చందాదారులు తమ ఖాతాల్లో వడ్డీ జమ కావడానికి సెప్టెంబర్​ లేదా అక్టోబర్ వరకు వేచి చూడాల్సి ఉండేది.

కేంద్ర మంత్రి మన్సుఖ్​ మాండవీయ బుధవారం కీలక ప్రకటన చేశారు. "కొత్త కేంద్రీకృత ఐటీ ప్లాట్​ఫారమ్​ అందుబాటులోకి వచ్చింది. అందువల్ల వడ్డీ జమ ప్రక్రియకు పట్టే సమయం గణనీయంగా తగ్గింది. ఈ జులై 15 నాటికి 34 కోట్ల మంది పీఎఫ్ చందాదారాల ఖాతాల్లో 8.25 శాతం మేర వడ్డీ జమ అవుతుంది. మొత్తం రూ.1.44 లక్షల కోట్ల ఈపీఎఫ్​ వడ్డీ జమ చేస్తాం. గతంలో ఇదే మొత్తాన్ని సెప్టెంబర్​, అక్టోబర్​ నెలల్లో జమ చేసేవాళ్లం. ఇప్పుడు ఈ ప్రక్రియ ఆటోమేటిక్​ కావడం వల్ల ప్రాసెసింగ్ సమయం చాలా తగ్గింది" అని అన్నారు.

ఈపీఎఫ్​ఓ తన 'సెంట్రలైజ్డ్​ ఐటీ ఎనేబుల్డ్​ సర్వీసెస్'​ (CITES) ప్రాజెక్టు కింద సభ్యుల రికార్డులన్నింటినీ ఒకే జాతీయ డేటాబేస్​కు విజయవంతంగా బదిలీ చేసింది. సంస్థ అందించే సేవలను ఆధునీకరించడం, ఆటోమేషన్​, నిబంధన ఆధారిత ప్రాసెసింగ్​, పాదర్శకత, సమర్థ్యాన్ని పెంచేలో ఒక ఏకీకృత ప్లాట్​ఫారమ్​ను తీసుకురావడమే లక్ష్యంగా దీనిని తీసుకువచ్చింది. గతంలో ప్రాంతీయ కార్యాలయాలు ప్రత్యేకంగా డేటాబేస్​లను నిర్వహించేవి. దీని వల్ల వడ్డీ జమ ప్రక్రియ ఆలస్యం అయ్యేది. కానీ ఇప్పుడు కేంద్రీకృత డేటాబేస్​ అందుబాటులోకి రావడంతో సభ్యుల సర్వీస్ అభ్యర్థనలను కేవలం ఆ ఖాతా ఉన్న ప్రాంతీయ కార్యాలయం నుంచే కాకుండా, దేశవ్యాప్తంగా ఉన్న ఏ ఈపీఎఫ్ఓ అధికారిక కార్యాలయం నుంచైనా ప్రాసెస్ చేయవచ్చు.

ఈ కొత్త యూనిఫైడ్ పోర్టల్​లో చందాదారులు తమ ప్రావిడెంట్ ఫండ్​ బ్యాలెన్స్​, క్లెయిమ్​ స్థితి, పెన్షన్​ రికార్డులు, పొందిన ప్రయోజనాల వివరాలను సులభంగా చూసుకోవచ్చు. అయితేకాదు క్లెయిమ్​లను ప్రాసెస్ చేయడానికి ముందే, లోపాలను గుర్తించడానికి ఆటోమేటెడ్​ ప్రీ-వ్యాలిడేషన్​ నిర్వహణ అయిపోతుంది. ఇది రిజెక్షన్​ రేటును తగ్గించి, మొదటిసారికే క్లెయిమ్ ఆమోదం పొందడానికి వీలు కల్పిస్తుంది. ​

కేవైసీ పూర్తి చేసిన ఖాతాదారులకు ఈపీఎఫ్​ఓ అడ్వాన్స్ క్లెయిమ్​లను ఆటో-సెటిల్​మెంట్ చేస్తుంది. కాగా ఈ ఆటో-సెటిల్​మెంట్​ పరిమితిని తాజాగా రూ.1 లక్ష నుంచి రూ.5లక్షలకు పెంచింది. క్లెయిమ్ ప్రాసెసింగ్ సమయంలో ఏమైనా వివరాలు కావాల్సి వస్తే, సభ్యులు నేరుగా ఆన్​లైన్లోనే తమ సమాధానాలు ఇవ్వవచ్చు. ఇకపై ఉద్యోగులు జాబ్ మారినప్పుడు ఆధార్​తో అనుసంధానమైన పీఎఫ్ ఖాతాలు ఆటోమేటిక్​గా బదిలీ అవుతాయి. అంతేకాదు పాక్షిక విత్​డ్రావల్​ నిబంధనలను సరళీకరించారు. ఖాతా ఏ ప్రాంతీయ కార్యాలయంలో ఉన్నప్పటికీ దేశవ్యాప్తంగా ఎక్కడి నుంచైనా ఈపీఎఫ్​ఓ సేవలను పొందే సదుపాయం కల్పించారు.

పీఎఫ్ కొత్త రూల్స్​
కొత్త నిబంధనల ప్రకారం, నెలకు రూ.15000లోపు జీతం ఉన్నవారికి మాత్రమే 12 శాతం చొప్పున, గరిష్ఠంగా రూ.1800 వరకు కంట్రిబ్యూషన్ కట్​ అవుతుంది. అంతకంటే ఎక్కువ జీతం ఉండి, నెలకు రూ.1800 కంటే ఎక్కువ పీఎఫ్ కట్​ చేసుకోవాలంటే, అది పూర్తిగా ఉద్యోగి ఇష్టం. ఒకవేళ ఒక ఉద్యోగి జాబ్​ మానేసి, పీఎఫ్​ ఖాతాలోని పూర్తి డబ్బులు విత్​డ్రా చేసుకోవాలంటే 12 నెలలు ఆగాల్సిందే. అది కూడా ఈ కాలంలో సదరు వ్యక్తి నిరుద్యోగిగా ఉన్నట్లు నిరూపించుకోవాలి. గతంలో కేవలం 2 నెలల గ్యాప్ ఉంటే సరిపోయేది. ఇక ఆటో-సెటిల్​మెంట్ రూల్స్ కూడా మారాయి. అత్యవసర వైద్యం, పెళ్లి, విద్య, ఇంటి నిర్మాణం లాంటి అవసరాల కోసం ఆటో-క్లెయిమ్​ పరిమితిని రూ.1 లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంచారు. ఈ క్లెయిమ్​ను ఎంప్లాయర్​ అనుమతి అవసరం లేకుండానే కంప్యూటర్​ సిస్టమ్​ ఆటోమేటిక్​గా ఆమోదిస్తుంది.

మీరు ఇన్సూరెన్స్​ తీసుకున్నారా? - "నామినీ" రోల్​ ఏంటో తెలుసా?

ఒకటికి మించి ఎక్కువ "లోన్స్"​ తీసుకున్నారా? - ఈ టిప్స్​ పాటిస్తే చక్కగా మేనేజ్​ చేయొచ్చట!