ETV Bharat / business

అనిల్ అంబానీకి ED షాక్- రూ. 3.7 వేల కోట్లు విలువైన నివాసం జప్తు!

అనిల్ అంబానీ నివాసం అబోడ్‌ను అటాచ్ చేసిన ఈడీ- ఈ ఇంటి విలువ రూ.3,716.83 కోట్లు

Anil Ambani
Anil Ambani (Source : IANS (File))
author img

By ETV Bharat Telugu Team

Published : February 25, 2026 at 6:30 PM IST

3 Min Read
Choose ETV Bharat

Anil Ambani Apartment ED Attached : రిలయన్స్ ఏడీఏ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీ‌(66)కి చెందిన ముంబయి నివాసం 'అబోడ్'ను కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బుధవారం అటాచ్ చేసింది. ఈ నివాసం విలువ దాదాపు రూ.3,716.83 కోట్లు ఉంటుంది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) ప్రకారం అనిల్ అంబానీ ఇంటిని అటాచ్ చేశామని ఈడీ అధికార వర్గాలు తెలిపాయి. ఈమేరకు ఈడీ నుంచి ఒక తాత్కాలిక ఆదేశం జారీ అయిందని చెప్పాయి. రిలయన్స్ ఏడీఏ గ్రూప్‌నకు చెందిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్) బ్యాంకు మోసానికి పాల్పడిందనే అభియోగాలను ఎదుర్కొంటోంది. ఈ కేసులోనే ముంబయిలోని పాలీ హిల్ ఏరియాలో ఉన్న అనిల్ అంబానీ నివాసం 'అబోడ్'ను ఈడీ అటాచ్ చేసింది.

దీంతో బ్యాంకును ఆర్‌‌కామ్ మోసగించిన కేసులో ఇప్పటివరకు ఈడీ జప్తు చేసిన అనిల్ అంబానీ ఆస్తుల విలువ దాదాపు రూ.15,700 కోట్లకు చేరింది. విలాసవంతమైన అబోడ్ భవన సముదాయం ఎత్తు 66 మీటర్లు. ఇందులో 17 ఫ్లోర్లు ఉన్నాయి. ఈనేపథ్యంలో త్వరలోనే ముంబయిలోని ఈడీ ఆఫీసులో అనిల్ అంబానీని మరోసారి ప్రశ్నిస్తారని తెలుస్తోంది. ఇంతకుముందు తొలిసారిగా 2025 ఆగస్టులో ఆయన్ను ఈడీ అధికారులు ప్రశ్నించారు. అప్పట్లో అనిల్ అంబానీ స్టేట్‌మెంట్‌ను ఈడీ అధికారులు నమోదు చేశారు.

యస్ బ్యాంకు నుంచి రూ.3వేల కోట్ల లోన్లు
దర్యాప్తు వర్గాల కథనం ప్రకారం, 2017 నుంచి 2019 మధ్యకాలంలో యస్ బ్యాంకు నుంచి అనిల్ అంబానీకి చెందిన పలు కంపెనీలు దాదాపు రూ.3వేల కోట్ల దాకా లోన్లు తీసుకున్నాయి. అయితే ఆ రుణాలను నిర్దేశిత వ్యాపార అవసరాల కోసం వినియోగించలేదు. ఆ డబ్బులను షెల్ కంపెనీల ద్వారా విదేశాలకు దారిమళ్లించారనే అభియోగాలు ఉన్నాయి. యస్ బ్యాంకు నుంచి ఆర్‌కామ్ తీసుకున్న రుణాన్ని ఇలాగే దారిమళ్లించారని అంటున్నారు. దీనిపై తొలుత సీబీఐ విచారణ జరిపి, రెండు ఎఫ్‌ఐఆర్‌లను నమోదు చేసింది. ఆర్‌కామ్‌ సహా పలు అనిల్ అంబానీ కంపెనీలపై మోసం, లంచాలు ఇవ్వడం, ప్రజాధనాన్ని దారి మళ్లించడం అనే అభియోగాలతో కేసులు నమోదు చేసింది.

లోన్ల కోసం క్విడ్ ప్రోకో- నీకది, నాకిదిపెద్దపెద్ద కంపెనీలకు రుణాలను మంజూరు చేసే క్రమంలో బ్యాంకులు జారీ చేసే అధికారిక పత్రాన్ని ‘క్రెడిట్ అప్రూవల్ మెమొరాండమ్‌’ అంటారు. కాలం చెల్లిన, గడువు తీరిన క్రెడిట్ అప్రూవల్ మెమొరాండమ్‌‌లతో రుణాలను అనిల్ అంబానీ కంపెనీలు పొందాయనే అభియోగం ఉంది. పూర్తిస్థాయి అధికారిక అనుమతులు మంజూరు కాకముందే, ఈ లోన్ అమౌంట్లను అనిల్ అంబానీ కంపెనీల ఖాతాల్లో జమ చేశారనే ఆరోపణ కూడా ఉంది. ఇందుకోసం పలువురు యస్ బ్యాంకు ఉన్నతాధికారులతో క్విడ్ ప్రోకో (నీకది, నాకిది) డీల్స్‌ను కుదుర్చుకొని ఉండొచ్చనే కోణంలో ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది. రిలయన్స్ ఏడీఏ గ్రూప్‌కు రుణాలను మంజూరు చేయడానికి యస్ బ్యాంకు సహ వ్యవస్థాపకుడు రాణా కపూర్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనే దిశగానూ విచారణను నిర్వహిస్తున్నారు. ఈక్రమంలో నేషనల్ హౌజింగ్ బ్యాంక్, సెబీ, నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ, బ్యాంక్ ఆఫ్ బరోడా సహా ఎన్నో సంస్థల నుంచి కీలక సమాచారాన్ని సీబీఐ, ఈడీ సేకరించాయి.ఆ డబ్బు రిలయన్స్ హోం ఫైనాన్స్‌లోకే వెళ్లిందా ?అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ హోం ఫైనాన్స్ లిమిటెడ్ (ఆర్‌హెచ్‌ఎఫ్ఎల్)పైనా దర్యాప్తు సంస్థలు ఫోకస్ పెట్టాయి. 2017 - 2018 ఆర్థిక సంవత్సరంలో ఈ కంపెనీ రూ.3,742.60 కోట్ల కార్పొరేట్ రుణాలను మంజూరు చేయగా, 2018-2019లో ఏకంగా రూ. 8,670.80 కోట్ల రుణాలను మంజూరు చేసింది. ఈవివరాలను దర్యాప్తు సంస్థలకు స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ అందించింది. బహుశా 2017 నుంచి 2019 మధ్యకాలంలో యస్ బ్యాంకు నుంచి తీసుకున్న లోన్ డబ్బులను రిలయన్స్ హోం ఫైనాన్స్ లిమిటెడ్‌లోకి మళ్లించి, ఇంతపెద్ద స్థాయిలో రుణాలను మంజూరు చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. ఏయే కంపెనీలకు ఈ లోన్లు ఇచ్చారు ? ఎంతవేగంగా ఈ రుణ దరఖాస్తులను ఆమోదించారు ? అనే వివరాలను ఇప్పటికే సేకరించారు.

అనిల్ అంబానీకి సుప్రీంకోర్టు ఫ్రెష్​ నోటీసులు- భారీ బ్యాంకింగ్​, కార్పొరేట్ మోసాలపై విచారణకు ఆదేశం

అనిల్ అంబానీ కేసు- రిలయన్స్ పవర్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అరెస్ట్