ETV Bharat / business

"ఇల్లు" అమ్మే ఆలోచనలో ఉన్నారా? - ఇలా చేస్తే "పన్ను" తగ్గించుకోవడానికి ఛాన్స్!

అమ్మకందార్లు 'క్యాపిటల్ గెయిన్స్ టాక్స్' గురించి తెలుసుకోవాల్సిందే! - లేదంటే నష్టపోవడం గ్యారెంటీ అంటున్ననిపుణులు!

How to Save Taxes on Property Sales
How to Save Taxes on Property Sales (Getty Images)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : July 7, 2026 at 12:44 PM IST

5 Min Read
Choose ETV Bharat

How to Save Taxes on Property Sales : స్థిరాస్తి విక్రయించడమనేది ఒక పెద్ద ఆర్థిక లావాదేవీ. ముఖ్యంగా తమ ఆదాయపు పన్ను రిటర్న్​లను దాఖలు చేయనివారికి, స్థిరాస్తి అమ్మకంపై వచ్చిన లాభాలపై పన్ను కట్టాల్సి ఉంటుందనే విషయం మనలో చాలా మందికి తెలిసిఉండకపోవచ్చు. అందుకే, అమ్మకందార్లు ప్రాపర్టీ అమ్మకంపై మూలధన లాభాల పన్ను వర్తిస్తుందని తప్పక తెలుసుకోవాలంటున్నారు నిపుణులు. అయితే, స్థిరాస్తి అమ్మకాలపై మీరు ట్యాక్స్ పే చేయకుండా తప్పించుకోలేకపోయినప్పటికీ, పన్ను భారాన్ని తగ్గించుకోవచ్చంటున్నారు. మీరు కొన్ని వ్యూహాలు పాటించడం ద్వారా పన్ను ఆదాతో పాటు పన్ను చెల్లింపులపై ఇతర ప్రయోజనాలు పొందడానికి ఛాన్స్ ఉంటుందని చెబుతున్నారు. మరి, పన్ను ఆదా చేసే ఆ వ్యూహాలేంటో ఇప్పుడు చూద్దాం.

క్యాపిటల్ గెయిన్స్ టాక్స్(మూలధన లాభాల పన్ను) :

ఒక ప్రాపర్టీని అమ్మినప్పుడు దానిపై వచ్చిన లాభాలపై పన్ను విధిస్తుంది ప్రభుత్వం. దీన్నే క్యాపిటల్ గెయిన్స్ టాక్స్(మూలధన లాభాల పన్ను) అని అంటారు. ఒక నివాస స్థలాన్ని దాని కొన్న ధర కంటే ఎక్కువ ధరకు విక్రయించినప్పుడు, అమ్మకపు ధర, కొన్న ధర మధ్య ఉన్న వ్యత్యాసం మూలధన లాభాల రూపంలో ఉంటుందంటున్నారు నిపుణులు. ప్రస్తుత పన్ను చట్టాల ప్రకారం పన్నుకు ఈ లాభం లోబడి ఉంటుందని చెబుతున్నారు. బహుమతిగా పొందిన లేదా పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తిని మీరు అమ్మినా సరే, ఆ ప్రాపర్టీపై క్యాపిటల్ గెయిన్స్ టాక్స్ చెల్లించాల్సి ఉంటుందని గుర్తుంచుకోవాలి.

పన్నుల రకాలు :

స్థిరాస్తిపై స్వల్పకాలిక మూలధన లాభాలు(STCG), దీర్ఘకాలిక మూలధన లాభాలు (LTCG) అంటూ రెండు రకాల మూలధన లాభాలుంటాయి. మీరు ఒక ప్రాపర్టీని ఎంతకాలం కలిగి ఉన్నారనే దానిపై ఈ మూలధన లాభాలను నిర్ణయిస్తారు. ఒక స్థిరాస్తిని కొన్న రెండేళ్లలోపు అమ్మినట్లయితే స్వల్పకాలిక మూలధన లాభాలు ఉంటాయి. అప్పుడు మూలధన లాభాలపై 20% టాక్స్ పే చేయాల్సి ఉంటుంది. అదే, రెండేళ్ల కంటే ఎక్కువ కాలం కలిగి ఉన్న తర్వాత స్థిరాస్తిని విక్రయిస్తే, అప్పుడు సంపాదించిన లాభాలను దీర్ఘకాలిక మూలధన లాభాలు(LTCG)గా చెబుతారు. ప్రస్తుతం, స్వల్పకాలిక మూలధన లాభాలపై ఇండెక్సేషన్ ప్రయోజనాలతో 20% స్థిర రేటుతో లేదా ఇండెక్సేషన్ బెనిఫిట్స్ లేకుండా 12.50% చొప్పున పన్ను విధిస్తుంది ఆదాయ పన్ను శాఖ.

పన్ను ఆదా ఎలా?

మీ కుటుంబ సభ్యుడు లేదా ఫ్రెండ్​తో ఉమ్మడి యాజమాన్య ప్రాతిపదికన ఒక స్థిరాస్తిని కొన్నట్లయితే, ఆ తర్వాత దాని అమ్మకం నుంచి వచ్చిన మూలధన లాభాలను సహ-యజమానుల యాజమాన్య వాటా ఆధారంగా వారితో షేర్ చేసుకోవచ్చు. దీనివల్ల మీలో ప్రతి ఒక్కరూ ప్రాథమిక మినహాయింపుల పరిమితిని యూజ్ చేసుకుని, పన్నును తగ్గించుకోవచ్చంటున్నారు నిపుణులు. ప్రాపర్టీపై మూలధన లాభాలను లెక్కించినప్పుడు మీరు పునరుద్ధరణ, అమ్మకం ఖర్చులు వంటి కొన్ని ఖర్చులను మినహాయించుకుని కూడా టాక్స్​ను ఆదా చేసుకోవచ్చని చెబుతున్నారు.

ఉదాహరణకు, మీ ఇంటిని రూ. 50 లక్షలకు అమ్మారనుకుందాం. కానీ, అమ్మకం విషయంలో బ్రోకరేజ్ ఫీజులు, చట్టపరమైన ఖర్చులు, ఇంటి ఆధునీకరణ, ప్రకటనల ఖర్చులు వంటి వాటికి మొత్తం రూ.4 లక్షలు ఖర్చు చేశారనుకుందాం. మీరు అమ్మకం ధర నుంచి ఈ మొత్తాన్ని మినహాయించుకోవచ్చు. కాబట్టి, పన్ను పరంగా చూస్తే మీ ఇంటి విక్రయ ధర రూ. 46 లక్షలు మాత్రమే అవుతుంది, దానిపైనే టాక్స్ వర్తిస్తుందంటున్నారు నిపుణులు.

తక్కువ వడ్డీకే "పర్సనల్ లోన్" ఇస్తున్న బ్యాంకులివే! - ఎందులో ఎంత ఉందంటే?

వేరే ప్రాపర్టీని కొనొచ్చు :

  • ప్రాపర్టీ అమ్మకంపై టాక్స్ తగ్గించుకోవడానికి మరొక సమర్థవంతమైన మార్గం, మూలధన లాభాలను తిరిగి పెట్టుబడిగా పెట్టి మరో నివాస ఆస్తిని కొనడం. మీరు కొన్ని రూల్స్ ఫాలో అయినట్లయితే, ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 54 ప్రకారం, ఇంటి అమ్మకం ద్వారా వచ్చే దీర్ఘకాలిక క్యాపిటల్ గెయిన్స్ టాక్స్​పై పన్ను మినహాయింపు పొందొచ్చంటున్నారు నిపుణులు.
  • మీరు స్థిరాస్తిని అమ్మగా వచ్చిన డబ్బును ఇంకో ఇల్లు కొనడానికి లేదా నిర్మించడానికి యూజ్ చేయాలి. ఆస్తి అమ్మకం జరిగిన ఒక సంవత్సరం ముందు లేదా రెండు సంవత్సరాల తర్వాత కొత్త ఇల్లు కొన్నా పర్వాలేదు. రిజిస్ట్రేషన్‌ చార్జీలు, స్టాంప్‌ డ్యూటీ, బదిలీ ఛార్జీలు మొదలైనవి కొత్త ఇంటి ఖర్చులో చేర్చొచ్చని చెబుతున్నారు.
  • కొత్త ఇల్లు కట్టాలనుకుంటే పాత ఇల్లు అమ్మిన తేదీ(సేల్ డీడ్ తేదీ) నుంచి మూడేళ్లలోపు నిర్మించాలి. ఈ పన్ను మినహాయింపులు కేవలం ఒక ఇంటి కొనుగోలు లేదా నిర్మాణానికి మాత్రమే పరిమితమని గమనించాలి. మీరు కొనుగోలు చేసే నివాస ఆస్తి ఇండియాలోనే ఉండాలి.

బాండ్లపై పెట్టుబడి పెట్టొచ్చు!

ఒక ఇల్లు అమ్మినప్పుడు వచ్చిన మూలధన లాభాలను మరో ఇల్లు కొనుగోలు లేదా నిర్మాణం కోసం తిరిగి పెట్టుబడిగా వద్దనుకుంటే, కొన్ని రకాల బాండ్లలో కూడా మీరు వాటిని పెట్టుబడిగా పెట్టొచ్చంటున్నారు నిపుణులు. "నేషనల్‌ హైవే అథారిటీ, రూరల్‌ ఎలక్ట్రిఫికేషన్‌ కార్పొరేషన్‌, రైల్వే ఫైనాన్స్‌ కార్పొరేషన్‌" వంటి కొన్ని నిర్దిష్ట ఆర్థిక సంస్థల బాండ్లలో మూలధన లాభాలను ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇలా ప్రభుత్వం జారీ చేసిన బాండ్లలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా, మీరు టాక్స్​ మినహాయింపును పొందవచ్చంటున్నారు. అయితే, ఈ బెనిఫిట్​ను క్లెయిం చేయడానికి, మీరు ఆస్తి అమ్మకం కంప్లీట్ అయిన రోజు నుంచి ఆరు నెలలలోపు ఈ బాండ్లలో ఇన్వెస్ట్ చేయాలి. ఈ బాండ్లు ఐదు సంవత్సరాల కాలపరిమితిని కలిగి ఉంటాయి. అయితే, వీటిపై వచ్చే వడ్డీపై పూర్తిగా పన్ను వర్తిస్తుందని గుర్తుంచుకోవాలి. ఈ వ్యవధిలో వీటిని నగదుగా మార్చుకోవచ్చు లేదా నగదు అవసరాలకు తాకట్టు కూడా పెట్టవచ్చు, కానీ, అలా చేస్తే పొందిన పన్ను మినహాయింపులు రద్దవుతాయని గమనించాలంటున్నారు.

CGAS (క్యాపిటల్ గెయిన్స్ అకౌంట్ స్కీం) :

ప్రాపర్టీ విక్రయాలపై మూలధన లాభాల పన్నును ఆదా చేయడానికి మరొక మార్గం 'క్యాపిటల్ గెయిన్స్ అకౌంట్ స్కీం' (CGAS)లో పెట్టుబడి పెట్టడం. ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయడానికి ముందే కొత్త స్థిరాస్తిలో ఇన్వెస్ట్ చేయలేనివారికి ఈ స్కీమ్ చాలా అనుకూలంగా ఉంటుంది. పన్ను చెల్లింపుదారులకు ఇది గొప్ప ఉపశమనాన్ని అందిస్తుందంటున్నారు.

మీరు ఈ CGAS పథకంలో మూడు సంవత్సరాలు పెట్టుబడి పెట్టవచ్చు. ఈ వ్యవధిలో మీరు నివాస గృహాన్ని కొనుగోలు చేయడానికి లేదా నిర్మించడానికి ఆ మూలధన లాభాలను వాడుకోవచ్చు. ఆదాయపు పన్ను రిటర్న్‌ను దాఖలు చేయడానికి లేదా నమోదు చేయడానికి ముందే ఈ CGAS అకౌంట్​లో డిపాజిట్ చేయాలి. ఈ అకౌంట్​ను నిర్దేశిత బ్యాంకుల్లో మాత్రమే ఓపెన్ చేయాలి. అలాగే, CGAS పెట్టుబడి వివరాలను ఆదాయపు పన్ను రిటర్న్‌లో తప్పనిసరిగా పేర్కొనాలని చెబుతున్నారు నిపుణులు.

ఈ "ఫ్రీ ట్రయల్" మాయలో మీరు చిక్కుకున్నారా? - ఒకసారి చెక్​ చేయండి

మరణించిన వ్యక్తి ఆస్తులను "వారసులు" తెలుసుకోవడం ఎలా? - "CAS" ద్వారా ఈజీ అంటున్న నిపుణులు!