ETV Bharat / business

సీజ్​ఫైర్​తో బుల్ జోష్- భారీ లాభాల్లో స్టాక్​ మార్కెట్లు- ​ 2700 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్

ట్రంప్ కాల్పుల విరమణ ప్రకటనతో భారీగా దిగొచ్చిన చమురు ధరలు- సెన్సెక్స్​ 2700 పాయింట్ల జంప్- లాభాల్లో ఆసియా మార్కెట్లు

Oil Prices Today
Oil Prices Today (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : April 8, 2026 at 8:37 AM IST

|

Updated : April 8, 2026 at 9:35 AM IST

3 Min Read
Choose ETV Bharat

Stock Market Today : అమెరికా, ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడం, హర్మూజ్ జలసంధిని తెరిచేందుకు అంగీకరించడంతో ముడి చమురు ధరలు భారీగా తగ్గాయి. దీంతో బుధవారం దేశీల మార్కెట్లు సూచీలు భారీ లాభాలతో ప్రారంభయ్యాయి.​ సెన్సెక్స్‌ 2,700 పాయింట్లకు పైగా, నిఫ్టీ 800 పాయింట్లకిపైగా లాభల్లో ట్రేడ్​ అవుతున్నాయి. అటు ఆసియా మార్కెట్లు కూడా భారీగా పుంజుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భయాందోళలు నెలకొన్న సమయంలో ట్రంప్ సీజ్​ఫైర్​ ప్రకటనతో మొత్తం మారిపోయింది.

ప్రస్తుతం బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్‌ 2,549 పాయింట్ల లాభపడి 77,166 వద్ద ట్రేడ్​ అవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 749 పాయింట్ల ఎగబాకి 23,872 వద్ద కదలాడుతుంది. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్‌లోని కంపెనీల్లో ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ దాదాపు 10శాతం లాభంతో ముందంజలో నిలిచింది. లార్సెన్ అండ్ టుబ్రో, బజాజ్ ఫైనాన్స్, అదానీ పోర్ట్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, మహీంద్రా అండ్ మహీంద్రా షేర్లు కూడా మంచి లాభాలు నమోదు చేశాయి. ఆటో, బ్యాంకింగ్‌, కన్స్యూమర్‌ డ్యూరబుల్స్‌ సూచీలు 4శాతానికి పైగా లాభపడ్డాయి. ఓఎన్జీసీ, కోల్‌ ఇండియా, టెక్‌ మహీంద్రా షేర్లు స్వల్ప నష్టాల్లో ఉన్నాయి.

రూపాయి విలువ
అటు అంతర్జాతీయ విపణిలో దేశీయ కరెన్సీ రూపాయి విలువ కూడా బలపడుతోంది. బుధవారం డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 50 పైసలు పెరిగింది. ప్రస్తుతం 92.56 వద్ద కొనసాగుతోంది.

లాభల్లో ఆసియా మార్కెట్లు
మరోవైపు ఆసియా స్టాక్​ మార్కెట్లు, అమెరికా స్టాక్ ఫ్యూచర్స్‌ కూడా భారీగా పుంజుకున్నాయి. జపాన్‌కు చెందిన నిక్కీ 225 సూచీ 4.8% పెరిగింది. దక్షిణ కొరియాకు చెందిన కోప్సి 5.6 శాతం లాభపడింది. ఈస్టర్న్‌ డేలైట్ సమయం ప్రకారం రాత్రి 9న్నర గంటల సమయానికి అమెరికాలో ఎస్‌ అండ్ పీ 500 ఫ్యూచర్స్ 2.3శాతం, డౌ ఫ్యూచర్స్ 2శాతం వృద్ధి చెందాయి. అమెరికా మార్కెట్లు మంగళవారం లాభాలతో ముగిశాయి.

భారీగా దిగొచ్చిన చమురు ధరలు
ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 100 డాలర్ల కంటే దిగువకు పడిపోయాయి. బ్రెంట్‌ క్రూడ్‌ ధర ఈ ఒక్క రోజే దాదాపు 16శాతం తగ్గి 95.06కు పడిపోయింది. యూఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియెట్ క్రూడ్ దాదాపు 20 శాతం తగ్గింది. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా చమురు ఉత్పత్తి, రవాణాకు ఆటంకం కలగడంతో ఇప్పటివరకు ధరలు ఆకాశాన్ని తాకాయి. ప్రపంచవ్యాప్త వినియోగదారులకు చేరాల్సిన చమురులో ఎక్కువ భాగం హర్మూజ్ జలసంధి గుండానే వెళ్లాల్సి ఉంటుంది. అయితే యుద్ధం కారణంగా దీనిని తన శత్రు దేశాలకు ఇరాన్ నిలిపివేసింది.

విదేశీ పెట్టుబడిదారుల భారీ అమ్మకాలు
స్టాక్ ఎక్స్చేంజ్ డేటా ప్రకారం, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు రూ. 8,692 కోట్ల విలువైన షేర్లు విక్రయించారు. దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులు రూ. 7,979 కోట్ల షేర్లు కొనుగోలు చేశారు.

చమురు ధరలు తగ్గడం వల్ల ద్రవ్యోల్బణం, రూపాయి విలువపై ఒత్తిడి తగ్గే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇది భారత ఆర్థిక వ్యవస్థకు పాజిటివ్ సంకేతంగా భావిస్తున్నారు. ఇక రిజర్వ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా నేతృత్వంలోని ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) ప్రకటించనున్న నిర్ణయం కోసం మార్కెట్లు ఎదురుచూస్తున్నాయి.

ఇరాన్‌-అమెరికా మధ్య రెండు వారాల పాటు కాల్పుల విరమణకు ఒప్పందం కుదిరింది. అలాగే హర్మూజ్ జలసంధి ద్వారా రవాణా సులభతరం కావడం మార్కెట్లకు ప్రధాన బూస్ట్‌గా మారింది. దీంతో ఇంధన సరఫరాపై ఉన్న ఆందోళనలు తగ్గాయి. దీంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొలిక్కి వచ్చే అవకాశం ఉందన్న అంచనాలను మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలపర్చాయి.

Last Updated : April 8, 2026 at 9:35 AM IST