ఫోన్ పాస్‌వర్డ్ వివాదం- కుమార్తెల కళ్ల ఎదుటే భార్యను కత్తితో హత్య చేసిన భర్త
మధ్యప్రదేశ్‌లో దారుణం- హత్యకు దారితీసిన మొబైల్ పాస్‌వర్డ్ గొడవ- భార్యను కత్తితో పొడి అత్యంత దారుణంగా హత్య చేసిన భర్త

Published : April 9, 2026 at 11:02 AM IST
Husband Kills Wife For Mobile Password : కుమార్తెల కళ్ల ఎదుటే భార్యను అత్యంత దారుణంగా హత్య చేశాడు ఓ వ్యక్తి. మొబైల్ పాస్‌వర్డ్ విషయంలో మొదలైన వివాదం చివరకు హత్యకు దారితీసింది. కత్తితో అత్యంత దారుణంగా పొడిచి హతమార్చాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. ఈ దారుణమైన ఘటన మధ్యప్రదేశ్‌లోని జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం, రేవా జిల్లాలోని సగరా పోలీస్ స్టేషన్ పరిధిలోని లౌఆ గ్రామంలో ఏప్రిల్ 7న (మంగళవారం) జరిగింది. దీపక్ మిశ్రా, శిఖా మిశ్రాకు 10 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ముగ్గురు చిన్నారులు ఉన్నారు. 8, 7, 5 ఏళ్ల వయసు ఉన్న ముగ్గురు కుమార్తెలు ఉన్నాయి. అయితే మంగళవారం రాత్రి ఇద్దరి మధ్య మొబైల్ పాస్‌వర్డ్ విషయంలో వాగ్వాదం జరిగింది. ముందు శిఖాను దీపక్ ఫోన్ పాస్‌వర్డ్ అడిగాడు. అందుకు శిఖా నిరాకరించింది. అంతేకాకుండా తన ఫోన్ పాస్‌వర్డ్ చెప్పాలంటూ దీపక్‌ను అడిగింది. దీంతో ఇద్దరి మధ్య మొదలైన చిన్న వివాదం పెద్దగా మారింది.
కత్తితో పొడిచి నిందితుడు పరార్
వివాదం పెరగడంతో కోపోద్రిక్తుడైన భర్త దీపక్ భార్యపై కత్తితో పలు మార్లు దాడి చేశాడు. దీంతో శిఖా ముఖం, మెడ, పొత్తికడుపు భాగాల్లో తీవ్ర గాయాలు అయ్యాయి. భార్యను కత్తితో పొడిచిన అనంతరం అక్కడి నుంచి దీపక్ పారిపోయాడు. అయితే అయితే ఈ దారుణం జరగుతున్నప్పుడు ముగ్గురు కుమార్తెలు ఇంట్లోనే ఉన్నారు. తల్లిని కత్తితో పొడవడం పెద్ద కుమార్తె కళ్లారా చూసింది. వెంటనే భయంతో తన మామయ్యాకు ఫోన్ చేసి 'నాన్న అమ్మను చంపేశాడు' అంటూ ఏడుస్తూ చెప్పింది. దీంతో శిఖా సోదరుడు, కుటుంబ సభ్యులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు గాయపడిన శిఖాను ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శిఖా మరణించింది.

తరుచూ గొడవలు
ఈ ఘటనపై హత్య నేరం కింద కేసు నమోదు చేసుకున్నట్లు డీఎస్పీ ఉదిత్ మిశ్రా తెలిపారు. ప్రాథమిక విచారణలో నిందితుడు నేరం చేసి పారిపోయినట్లు తేలిందని అన్నారు. ప్రస్తుతం అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. అయితే చాలా కాలంగా దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవి స్థానికులు చెబుతున్నారని అన్నారు. కుమారుడు లేకపోవడం, పరస్పర అనుమానాలు కూడా వివాదాలకు కారణమయ్యాయని పేర్కొన్నారు. ఘటన జరిగిన రోజు భర్త మద్యం సేవించి ఇంటికి వచ్చినట్లు తెలిసిందని పోలీసులు తెలిపారు. పెద్ద కమార్తె ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసినట్లు ఉదిత్ మిశ్రా చెప్పారు.
'మద్యం సేవించి ఇంటికి వచ్చాడు'
అయితే భార్యభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవని శిఖా మేనమామ లల్లు లాల్ తెలిపాడు. ' మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగింది. దీపక్ ఇంట్లో ఒక పెంద్ద కత్తిని దాచి ఉంచేవాడు. తరుచూ ఆమెను కత్తితో చంపుతానని బెదిరించేవాడు. మంగళవారం రాత్రి మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. తన ముగ్గురు కుమార్తెలకు అరటిపండ్లు తినిపించి వారిని వేరే గదిలో కూర్చోబెట్టాడు. ఆ తర్వాత శిఖపై కత్తితో పలుమార్లు పొడిచి అక్కడ నుంచి పారిపోయాడు. ఈ ఘటన తర్వాత పెద్ద కుమార్తె ఏడుస్తూ తన మేనమానకు కాల్ చేసి జరిగిందంతా చెప్పింది. మేం ఘటనాస్థలికి చేరుకునే సరికి శిఖా భావ, అతడి భార్య నిద్రపోతున్నారు. వారికి ఈ ఘటన గురించి చెప్పి సాయం చేయమని అడిగితే మాకేం సంబంధం అని చెప్పి రావడానికి నిరాకరించారు' అని లల్లు లాల్ వివరించాడు.
ప్రభుత్వ పాఠశాలలో మద్యం- చక్కగా తాగి ఇంటికి వెళ్లిన విద్యార్థి!

