ETV Bharat / bharat

ఈ-రిక్షా రైడర్లుగా రాణిస్తున్న మహిళలు- కుటుంబ పోషణ కోసం డ్రైవింగ్ వృత్తి- కాశీలో వీరికి ఫుల్ డిమాండ్!

వారణాసి రోడ్లపై మహిళా ఈ-రిక్షా రైడర్లు రయ్ రయ్- మంచి ఆదాయం గడిస్తున్న మహిళలు

Women E Rickshaw Drivers
Women E Rickshaw Drivers (Source : ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : December 19, 2025 at 10:10 PM IST

3 Min Read
Choose ETV Bharat

Women E Rickshaw Drivers Success Story : వారు ఒకప్పుడు సమాజంలో ఛీత్కారాలు, హేళనలు, నిర్లక్ష్యానికి గురైన మహిళలు. ఇప్పుడు ఈ- రిక్షా నడుపుతూ మంచి ఆదాయాన్ని సంపాదిస్తున్నారు. ఒకప్పుడు తమ ఖర్చులకే కుటుంబ సభ్యుల్ని అడిగిన మహిళలు, ఇప్పుడు వారే కుటుంబాన్ని పోషించే స్థాయికి ఎదిగారు. అంతలా ఆర్థిక స్వావలంబన సాధించారు. ఈ క్రమంలో ఉత్తర్​ప్రదేశ్​లోని వారణాసిలో ఈ- రిక్షాలు నడుపుతున్న 15 మంది మహిళా రైడర్ల గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం.

హోలిసిటీ పైలట్ ప్రాజెక్ట్ కింద మహిళా ఈ- రిక్షా రైడర్లు లబ్ది పొందారు. కాశీకి వచ్చే పర్యాటకులను వీరే మంచి ఆప్షన్ అయిపోతున్నారు. టూరిస్టులను, భక్తులను సేఫ్ గా గమ్య స్థానాలకు చేరుస్తూ మంచి పేరును సంపాదించుకున్నారు. అంతా మహిళా ఈ- రిక్షా డ్రైవర్లు ఫేమస్ అయిపోయారు. వీరు ఆదాయంతో పాటు మంచి పేరును పొందారు.

"ప్రధాని నరేంద్ర మోదీ దేశ మహిళల కోసం అనేక పథకాలు తీసుకొచ్చారు. ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మిషన్ శక్తి ప్రచారాన్ని ప్రారంభించారు. మా సంస్థ మహిళల జీవన ప్రమాణాలను పెంచేందుకు కృషి చేసింది. మేము మహిళలు, పిల్లలు, రైతుల కోసం పని చేస్తాం. జీవన ప్రమాణాలు తక్కువ ఉన్న మహిళలను శక్తివంతం చేయడమే మా లక్ష్యం. మహిళలకు అవకాశాలు కల్పించడమే మా కర్తవ్యం. ఈ మహిళా రైడర్లు టూరిస్టులకు కాశీని చూపిస్తారు. అందరు కోసం వారికి ఒక్కో రైడ్ కు రూ.500 రూపాయలు అందుతుంది" అని వారణాసిలోని హోలిసిటీ ప్రాజెక్ట్ సమన్వయకర్త అమృత సింగ్ తెలిపారు.

Women E Rickshaw Drivers Success Story
ఈటీవీ భారత్​తో మాట్లాడుతున్న మహిళా రైడర్ (Source : ETV Bharat)

కుటుంబానికి అన్నీ తానై
అయితే ఈ-రిక్షా నడుపుతున్న నిర్మలా దేవీ తన జీవిత కథను చెప్పింది. "నా భర్త నన్ను 2009లో వదిలేశాడు. నాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. వారిలో ఒకరు వివాహమైంది. నాకు ఒక చిన్న మనవరాలు కూడా ఉంది. నా భర్త నాకు మద్దతు ఇవ్వలేదు. నేను పని కోసం ఇంటి నుంచి నడుచుకుని వెళ్లేదాన్ని. రోజుకు రూ.50 సంపాదించేదాన్ని. నేను నైట్ షిఫ్టుల్లో కూడా పనిచేశాను. మార్కెటింగ్ కూడా చేశాను. ఆ తర్వాత నేను డ్రైవింగ్ నేర్చుకున్నాను. ఈ రిక్షాను నడుపుతున్నాను'

'సంస్థతో మాట్లాడి నాతో పాటు మరో 4-5 మంది మహిళలను రైడర్లగా జాయిన్ చేశాను. ఇప్పుడు నేను ఈ-రిక్షా నడపడాన్ని ఇతర మహిళలకు నేర్పిస్తున్నాను. ఇంటి అవసరాలకు ఇప్పుడు ఇబ్బంది లేదు. మాకు ప్రజల నుంచి మంచి మద్దతు లభిస్తోంది. ఇక్కడి పోలీసులు కూడా అండగా నిలుస్తున్నారు. నా గురించి తప్పుగా మాట్లాడే సమాజంతో నాకు సంబంధం లేదు. సమాజం నాకు భోజనం పెట్టడం లేదు. నా పని నేను చేసుకుంటున్నాను. నాకు అండగా తండ్రి, సోదరి నిలిచారు" అని నిర్మలా అంటోంది.

E Rickshaw
ఎలక్ట్రిక్ రిక్షా (Source : ETV Bharat)

'విదేశీ టూరిస్టుల నుంచి మంచి స్పందన'
తాను ఈ- రిక్షా నడపడాన్ని చూసి తన కుమార్తె చాలా సంతోషంగా ఉందని అంజలి చెబుతోంది. తాను ఈ-రిక్షా నడపడాన్ని ఆస్వాదిస్తానని అంటోంది. విదేశీ పర్యాటకుల నుంచి తమ సేవలకు గొప్ప స్పందన వస్తోందని వెల్లడించింది. "నా ఇంటిని నడపడానికి నేను చాలా కష్టపడాల్సి వచ్చింది. పని మనిషిగా వర్క్ చేశాను. అలాగే చాలా ఇతర పనులు చేశాను. ఇప్పుడు ఈ-రిక్షా నడుపుతున్నాను. దీంతో నా ఆదాయం గణనీయంగా పెరిగింది. రైడ్ కి రూ.500 అందుతుంది. కస్టమర్లు టిప్ కూడా ఇస్తారు" అని అంజలో ఆనందం వ్యక్తం చేస్తోంది.

Women E Rickshaw Drivers
మహిళా రైడర్లు (Source : ETV Bharat)

ఇంటి ఖర్చుల కోసం తన భర్త డబ్బులు ఇవ్వట్లేదని సిగ్రాకు చెందిన రష్మీ అనే మహిళ రైడర్ పేర్కొంది. దీంతో నా కుమారుడి కోసం ఇంటి పనిమనిషిగా వర్క్ చేశానని వెల్లడించింది. "మొదట్లో చాలా ఇబ్బందులు పడ్డాను. గౌరవం, మనశ్శాంతిని అందించే కొత్త పని చేయాలనుకున్నాను. ఈ-రిక్షా నడపడంలో నాకు ఆ స్వేచ్ఛ దొరికింది. నేను ఈ పనిని నా స్వేచ్ఛగా చేస్తున్నాను. ఈ వృత్తిలో చేరడంతో నేను ఆర్థిక స్వావలంబన పొందాను. పదో తరగతి చదువుతున్న నా కొడుకు కూడా నాకు మద్దతు ఇస్తున్నాడు" అని రష్మీ చెబుతోంది.