జనావాసాల్లోకి 12 అంగుళాల అరుదైన పాము- దాని ప్రత్యేకత ఏమిటంటే?
ఓ ఇంటి వద్ద అరుదైన జాతికి చెందిన పాము- బంగారు రంగులో చారలతో ఎంతో అందంగా!

Published : January 4, 2026 at 9:09 AM IST
Lycodon Jara Snake Rescue : ఉత్తర్‌ప్రదేశ్‌లో డెహ్రదూన్ జిల్లాలో ఒక అరుదైన పాము జనావాసాల్లో కనిపించింది. ఈ పాము ఓ అరుదైన జాతికి చెందినది. ఈ పాము ప్రత్యేకత ఏంటంటే, ఆకారంలో చాలా చిన్నది. వికాస్‌నగర్ కల్సి అటవీ డివిజన్ కైంచివాలా ప్రాంతంలో ఒక ఇంటి దగ్గర శుక్రవారం ఉదయం లైకోడాన్ జారా పాము కనిపించింది. స్థానికులు అటవీ శాఖ అధికారులకు వెంటనే సమాచారం అందించారు. అటవీ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని పామును రక్షించి దాని సహజ నివాస స్థలంలోకి వదిలారు.
కైంచివాలాకు చెందిన నివాసి ప్రమోద్ కుమార్ తన ఇంట్లో పామును చూసినట్లు అటవీ శాఖకు సమాచారం అందించారు. అటవీ శాఖ బృందం సంఘటనా స్థలానికి చేరుకుని, పామును రక్షించారు. ఈ పాము ట్విన్- స్పాటెడ్ వోల్ఫ్ స్నేక్ జాతికి చెందినదిగా గుర్తించారు. పచ్చువడూన్‌లో ఈ జాతికి చెందిన పామును రక్షించడం ఇదే మొదటిసారి. ఈ లైకోడాన్ జారా పాము ప్రధానంగా ఆసియాలో విస్తృతంగా కనిపిస్తుంది. ముఖ్యంగా భారతదేశంలోని ఉత్తర, ఈశాన్య రాష్ట్రాలలో, అందులోనూ మణిపుర్, బంగాల్, ఉత్తర్‌ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తాయి.
ఈ పాము విషపూరితం కాదు
ఇది హిమాలయాల దిగువ ప్రాంతాల నుంచి పశ్చిమాన డెహ్రాదూన్, దక్షిణాన ఒడిశా వరకు కనిపిస్తుంది. ఇది బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, మయన్మార్‌లలో కూడా కనిపిస్తుంది. ఈ పాము తేమతో కూడిన అడవులు, వ్యవసాయ భూములు, రాతి ప్రాంతాలు, మానవ నివాసాలకు సమీపంలో ఉన్న తోటలు వంటి వివిధ ఆవాసాలలో నివసిస్తుంది. ఇది సాధారణంగా పగుళ్లలో, బరువైన వస్తువుల కింద పగటిపూట వదులుగా ఉండే మొక్కల వేర్ల కింద దాక్కుంటుంది. దీని పొడవు దాదాపు 12 అంగుళాలు. పచ్చువడూన్‌లో మొదటిసారిగా లైకోడాన్ జారా పామును రక్షించారు. రక్షించిన తర్వాత, ఆ పామును వాటి సహజ నివాస స్థలంలోకి వదిలేశారు. ఈ పాము చూడటానికి చాలా అందంగా ఉంది. దాని వెనుక భాగంలో బంగారు రంగులో చారలు కనిపిస్తాయి. దీంతో మరింత అందంగా కనిపిస్తుంది. ఇది అరుదైన జాతికి చెందినది.
స్కూటిలో దాక్కున్న పాము
మరోవైపు, తైకదప్పురానికి చెందిన షర్ఫునిసా నెహ్రూ కాలేజీలో లెక్చరర్‌గా పని చేస్తోంది. ఆమె రోజు తన స్కూటర్‌పైనే కాలేజ్‌కు వెళ్తుంటుంది. రోజూలాగే ఉదయాన్ని కాలేజ్‌కు రెడీ అయిన ఆమె, హెల్మెట్‌తో పాటు షూలను చెక్ చేసుకుంది. అన్నీ సాధారణంగానే ఉండడంతో స్కూటర్‌పై కాలేజ్‌కు బయలుదేరింది. కానీ నాలుగు కిలోమీటర్ల దూరం వెళ్లిన తర్వాత కుడి బ్రేక్ పెడల్ దగ్గర ఏదో కదులుతున్నట్లు కనిపించింది. వెంటనే నిశితంగా పరిశీలించగా పెద్ద విషపూరితమైన పాము కనిపించింది. దానిని చూసిన ఆమె ఒక్కసారిగా షాక్‌కు గురైంది. తాను కొద్దిగా చేతులను కదిలించినా పాము కాటు వేసి ప్రమాదం ఉండేదని గుర్తు చేసుకుంది.
అయితే, కాలేజ్‌కు మరో కిలోమీటర్ మాత్రమే ఉండడంతో కాస్త ధైర్యాన్ని కూడబెట్టుకుని మెల్లగా అక్కడ వరకు వెళ్లింది. వెంటనే దగ్గర్లోని మెకానిక్కు కాల్ చేసి స్కూటర్ భాగాలని విప్పించింది. దీంతో ఆ విషపూరితమైన పాము బయటకు రావడంతో అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. ఈ ఘటన తర్వాత ఎప్పుడు స్కూటర్ దగ్గరకు వెళ్లినా భయం అవుతుందని షర్ఫునిసా చెప్పారు. ముఖ్యంగా స్కూటర్‌ను బయటకు తీసే ముందు జాగ్రత్తగా చెక్ చేసుకోవాలని అంటున్నారు.
'కరిచిన పాము ఫొటో తీస్తే చాలు, చంపొద్దు'- 7వేల పాములను రక్షించిన రమేశ్- యువతకు స్పెషల్ క్లాసెస్!
ఆ ఊరిపైకి పాముల దండయాత్ర- వరండాలు, బాత్‌రూంలో మకాం- 4 రోజుల్లో 25 సర్పాలు పట్టివేత- ఎందుకిలా?

