Telangana Panchayat Elections Results2025

ETV Bharat / bharat

వెరైటీ వెడ్డింగ్ కార్డ్- మహాకాళ్ విభూతి, ఢమరుకం, త్రిశూలంతో ఆహ్వాన పత్రిక

ఉజ్జయినిలో వైరల్​ అవుతున్న ఆహ్వాన పత్రిక

Ujjain Unique Wedding Card
Ujjain Unique Wedding Card (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : November 6, 2025 at 2:00 PM IST

2 Min Read
Choose ETV Bharat

Ujjain Unique Wedding Card : ఇటీవల కాలంలో పెళ్లి వేడుకలు అంటే అందరికంటే భిన్నంగా, కొత్తగా చేయాలని చాలామంది వినూత్నంగా ప్రయత్నిస్తున్నారు. పెళ్లి పనుల దగ్గర నుంచి తాళి కట్టే వరకు ఏదొకటి కొత్తగా ట్రై చేస్తున్నారు. ఫొటో షూట్, సంగీత్, ఆహ్వాన పత్రికలు, భోజనాలు ఇలా అన్నింటిల్లో తమ ప్రత్యేక ఉండేలా చూస్తున్నారు. ఇక వెడ్డింగ్ కార్డ్​ విషయంలో అయితే చెప్పనక్కర్లేదు. మధ్యప్రదేశ్​లో ఓ కుటుంబం విన్నూత రీతిలో తయారీ చేసిన పెళ్లి కార్డు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఆ కార్డును చూసిన ప్రతి ఒక్కరూ దండం పెట్టుకుంటున్నారు.

ఉజ్జయిలోని ఆజాద్​ నగరానికి చెందిన సచిన్ గోయల్ కుమారుడు పార్థ్ గోయలు వివాహం నవంబర్ 27న జరగనుంది. పెళ్లి కోసం ప్రత్యేక ఆహ్వాన పత్రికలను తయారు చేశారు. త్రిశూలం, ఢమరుకంతో పెళ్లి పత్రికను రూపొందించారు. అంతేకాకుండా బాబా మహాకాళ్​కు అర్పించే విభూతి కూడా ఉంది. ఈ పెళ్లి కార్డును తయారు చేయడానికి కుటుంబంలోని 10 మంది సభ్యులు కష్టపడ్డారు. నెలరోజుల్లో మొత్తం 400 ఆహాన పత్రికలను తయారు చేశారు. కార్డ్‌లోని త్రిశూలం, ఢమరుకం ఆకర్షణకు కేంద్రబిందువుగా నిలిచాయి. ప్రతి కార్డ్‌లో బాబా మహాకాళ్‌కు అర్పించబడిన విభూతి చిన్న ప్యాక్‌లుగా చేసి ఉంచారు. ఆ విభూతిని ఆలయం నుంచి రెండు నెలల క్రితమే తీసుకొచ్చారు.

Ujjain Unique Wedding Card
ఢమరుకం, త్రిశూలంతో వెడ్డింగ్ కార్డు (ETV Bharat)

మాల్వా జానపద సంప్రదాయ ప్రతిబింబించేలా
అంతేకాకుండా ఈ కార్డును మాల్వా జానపద సాంస్కృతిక సంప్రదాయ మాండనా ప్రాముఖ్యతను వర్ణించేలా ప్రతిబింబించారు. మాండనా అంటే అలంకరణ. ఇందులో బియ్యపు పిండి, గేరు, తెల్లటి బంకమట్టి మట్టి మిశ్రమంతో గోడలపై అద్భుత ఆకృతులను రూపొందిస్తారు. సాధారణంగా వివాహ ఆహ్వాన పత్రాలలో పసుపు బియ్యాన్ని ఉంచే సంప్రదాయం ఉంది. కానీ ఉజ్జయిని గోయల్ కుటుంబం అభిప్రాయం ప్రకారం, ఇది శివశక్తి క్షేత్రం కాబట్టి పసుపు బియ్యం బదులు బాబా మహాకాళ్ భస్మాన్ని ఉంచడం శ్రేయస్కరం అని భావించారు. ఉజ్జయిని మహాకాళ్ మందిరం శక్తిపీఠమైన దేవి హర్సిద్ధి ఇక్కడే ఉండటంతో, బాబా మహాకాళ్ ఆశీర్వాదం లేకుండా ఏ కార్యమూ జరగదని వారు నమ్ముతున్నారు. అందుకే అన్ని ఆహ్వాన పత్రాల్లో మహాకాళ్ విభూతి ఉంచారు.

Ujjain Unique Wedding Card
వెరైటీ వెడ్డింగ్ కార్డ్ (ETV Bharat)

ఆహాన పత్రికాల కోసం రూ.లక్ష ఖర్చు అయ్యినట్లు సచిన్ గోయల్ తెలిపారు. 'ఒక కార్డును తయారు చేయడానికి రూ.250 అయ్యింది. మొత్తం 400 కార్డులు రూపొందించాం. దీనికోసం మొత్తం లక్ష వ్యయం అయింది. సాధారణంగా పెళ్లి కార్డులను వాడిన తరువాత పడేస్తారు. ఇది చూశాక నేను భిన్నంగా చేయాలని నిర్ణయించుకున్నాను. ఈ కార్డును ఢమరుకం, త్రిశూలం, రుద్రాక్షలతో రూపొందించాం. ఈ ప్రత్యేక పత్రికను ఎవరూ పారేయరని, అందరూ భద్రపరచుకుంటారని ఆశిస్తున్నా. అదే మా ఉద్దేశ్యం. ఈ కార్డులను తయారు చేయడానికి కుటుంబ సభ్యలు 10మంది పాల్గొన్నారు. విశేషం ఏమిటంటే, ఈ పనిలో ఉజ్జయిని సేవాధామ్ ఆశ్రమంలోని పిల్లలు కూడా మాతో కలిసి పనిచేశారు' సచిన్ గోయల్ అన్నారు.