ETV Bharat / bharat

దేశ యువతుల కలలు భూమిని దాటి అంతరిక్షంలోకి దూసుకుపోతున్నాయ్ : 'మన్‌ కీ బాత్‌'లో మోదీ

పీఎం స్వనిధి లబ్దిదారుల్లో 46 శాతం మంది మహిళలే ఉన్నారన్న ప్రధాని మోదీ- దేశ యువతులు కలలు భూమిని దాటి స్పేస్‌లోకి దూసుకెళ్తున్నాయని వ్యాఖ్యలు- మన్‌ కీ బాత్ ప్రసంగంలో మోదీ వెల్లడి

PM Modi Mann Ki Baat
ప్రధాని నరేంద్ర మోదీ (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : August 30, 2026 at 12:07 PM IST

3 Min Read
Choose ETV Bharat

PM Modi Mann Ki Baat : దేశ యువతుల కలలు భూమిని దాటి అంతరిక్షంలోకి దూసుకుపోతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. మిషన్ శక్తిశాట్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది ఆశావహ బాలికలను భారత్ ఏకం చేస్తుండటం గర్వంగా ఉందన్నారు. ఈ చారిత్రక కార్యక్రమం 108 దేశాలకు చెందిన 12,000 మంది విద్యార్థినులకు ఉపగ్రహ సాంకేతికతలో నైపుణ్యం సాధించడానికి, అంతరిక్ష ఆవిష్కరణలలో కొత్త సరిహద్దులను ఆవిష్కరించడానికి అవకాశాన్ని అందిస్తుందని పేర్కొన్నారు. ఆదివారం ప్రసారమైన 137వ 'మన్ కీ బాత్' ఎపిసోడ్‌లో ప్రధాని మోదీ ఈ మేరకు వ్యాఖ్యానించారు.

"దేశ ఆర్థిక వ్యవస్థలో మహిళల పాత్ర పెరుగుతోంది. పీఎం స్వనిధి స్కీమ్ లక్షలాది మంది మహిళలకు ఊతమిస్తోంది. ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు లక్షలాది మహిళలు నగరాలు, పట్టణాల వీధుల్లో తమ పనులతో బిజీగా ఉంటారు. కొందరు కూరగాయలు, కొందరు పండ్లు అమ్ముతారు. కొందరు టీ స్టాల్స్ నిర్వహిస్తారు. మరికొందరు పువ్వులు, దీపాలు, పూజా సామగ్రి అమ్ముతారు. చాలాసార్లు కొద్దిపాటి పెట్టుబడి కొరత వారి వ్యాపారాన్ని ముందుకు సాగకుండా అడ్డుకుంటుంది. కానీ ఇప్పుడు లక్షలాది మంది తల్లులు, సోదరీమణులు పీఎం స్వనిధి పథకం ద్వారా కొత్త బలాన్ని పొందుతున్నారు. చిన్న, వీధి వ్యాపారులు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు తీసుకొచ్చిన 'పీఎం స్వనిధి' పథకం లబ్ధిదారులలో దాదాపు 46 శాతం మంది మహిళలే ఉన్నారు. అంటే దేశవ్యాప్తంగా సుమారు 35 లక్షల మంది మహిళలు ఈ పథకం ద్వారా తమ వ్యాపారాలను అభివృద్ధి చేసుకుంటున్నారు. అందుకు ఉత్తర్‌ప్రదేశ్‌లోని గాజియాబాద్‌కు చెందిన బబితా శర్మ చక్కని ఉదాహరణ. బబిత గతంలో పూజా సామగ్రిని విక్రయించే ఒక చిన్న స్టాల్‌ను ఏర్పాటు చేశారు. పీఎం స్వనిధి పథకం ద్వారా ఆమెకు ఆర్థిక సహాయం లభించింది."
- ప్రధాని నరేంద్ర మోదీ

విదేశాల్లోనూ త్రివర్ణపతాకం రెపరెపలాడింది : మోదీ
దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న దేశభక్తి స్ఫూర్తిని 'మన్ కీ బాత్‌'లో మోదీ హైలైట్ చేశారు. హర్‌ఘర్ తిరంగా ప్రచారం విజయవంతమవ్వడంతో ఆగస్టు నెల ప్రత్యేకంగా నిలిచిందని తెలిపారు. "జాతీయ చేనేత దినోత్సవం, క్విట్ ఇండియా ఉద్యమ వార్షికోత్సవం కారణంగా ఆగస్టు నెల చాలా ప్రత్యేకంగా మారింది. స్వాతంత్య్ర దినోత్సవం, జాతీయ అంతరిక్ష దినోత్సవం వంటి సందర్భాలు ప్రతి పౌరుడిలో గర్వాన్ని నింపాయి. హర్ ఘర్ తిరంగా ప్రచారం ఈ దేశభక్తి భావనను మరింత బలపరిచింది. అదే సమయంలో వందేమాతరం 150వ వార్షికోత్సవం ఈ సంవత్సరాన్ని మరింత విశేషమైనదిగా చేసింది. ఫిజీలోని సువాలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఆసియా, ఆఫ్రికా, ఐరోపా ఖండాల్లోని భారత రాయబార కార్యాలయాలు, అమెరికాలో భారత త్రివర్ణ పతాకం రెపరెపలాడింది" అని మోదీ స్పష్టం చేశారు.

డ్రగ్స్ రహిత భారత్‌ కోసం కృషి చేయాలని ప్రజలకు పిలుపు
అలాగే భారత్‌ను డ్రగ్స్ రహితంగా మార్చాలని నరేంద్ర మోదీ దేశ పౌరులకు పిలుపునిచ్చారు. మాదకద్రవ్యాల దుర్వినియోగం ముప్పు నుంచి దేశాన్ని విముక్తి చేయడానికి, యువతకు మంచి భవిష్యత్తును నిర్మించడానికి కలిసి పనిచేయాలని ప్రజలను కోరారు. మాదకద్రవ్యాల వ్యసనం పర్యావసానాలు కేవలం ఒక వ్యక్తిని మాత్రమే కాకుండా మొత్తం కుటుంబం, సమాజంపై పడతాయని చెప్పారు. వికసిత్ భారత్ కోసం నషా ముక్త్ యువ ప్రచారం ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఊపందుకుంటోందన్నారు. దేశ యువత ఆరోగ్యం, సంతోషం, ఉజ్వల భవిష్యత్తు కోసం ఇది ప్రజలందరి సమష్టి సంకల్పమని అన్నారు.

"ఈ ఏడాది జరిగిన అమర్‌నాథ్ యాత్రలో పరిశుభ్రత, ప్రజా భాగస్వామ్యానికి సంబంధించిన స్ఫూర్తిదాయకమైన ఉదాహరణలను చూశాం. వేలాది మంది పారిశుధ్య కార్మికులు కఠినమైన మార్గాల్లో రేయింబవళ్లు సేవలు అందించారు. 400 మెట్రిక్ టన్నులకు పైగా వ్యర్థాలను సేకరించి, వాటిని శుద్ధి చేశారు. యాత్రికులు ఈ శుభ్రతా కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్నారు. 16,000 మందికి పైగా పరిశుభ్రత ప్రమాణం చేశారు. పరిశుభ్రత ప్రతి పౌరుడి వ్యక్తిగత నిబద్ధతగా మారినప్పుడు, దాని ప్రభావం పరిసరాలను శుభ్రంగా ఉంచడం వరకే పరిమితం కాదు. అది ఒక ప్రదేశం గుర్తింపు, స్వభావాన్ని పూర్తిగా మార్చివేస్తుంది. అలాగే ముంబయికి చెందిన కృష్ణ శేషాద్రి WWW.BHARATRAJYA.COM వెబ్‌సైట్‌ను రూపొందించారు. మీరు ఈ వెబ్‌సైట్‌కి వెళ్లి ఏదైనా ఒక సంవత్సరాన్ని ఎంచుకోండి. ఆ సమయంలో భారతదేశంలోని ఏ ప్రాంతాన్ని, ఎవరు పాలించారో ఈ వెబ్‌సైట్‌లో సులభంగా తెలుసుకోవచ్చు. ఇది నాకు చాలా ఆసక్తికరంగా అనిపించింది" అని మోదీ పేర్కొన్నారు.

'అదృష్టమంటే ఇదేనేమో'- లాటరీలో రూ.7 కోట్లు- ఆ లక్కీ పర్సన్ ఎవరంటే?

PGలో యువతుల లోదుస్తులు, శానిటరీ ప్యాడ్లు చోరీ- వాటితో లైంగిక సంతృప్తి- కట్​ చేస్తే పోలీసుల చేతిలో!