ETV Bharat / bharat

ఘోర రోడ్డు ప్రమాదం- రెండు బస్సులు ఢీకొని ఏడుగురు మృతి!

గుజరాత్​లోని సూరత్​లో ఢీకొన్న రెండు బస్సులు- 15 మందికి తీవ్రగాయాలు

Gujarat Bus Accident
Gujarat Bus Accident (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : June 2, 2026 at 8:43 PM IST

3 Min Read
Choose ETV Bharat

Gujarat Bus Accident Updates : గుజరాత్​ సూరత్ జిల్లాలోని బర్డోలి తహసీల్​ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుజరాత్​-మహారాష్ట్ర రహదారిపై రెండు బస్సులు ఢీకొనడంతో ఏడుగురు మరణించగా, అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపడుతున్నారు.

ప్రమాదం ఎలా జరిగింది?
మరోవైపు, ప్రమాదానికి సంబంధించిన వివరాలను సూరత్ రూరల్ ఐజీ ప్రేమ్ వీర్ సింగ్ వెల్లడించారు. "బర్డోలీ నుంచి వ్యారా వైపు వెళ్లే మార్గంలో ఈ దుర్ఘటన జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఒక బస్సు స్టీరింగ్ పై నియంత్రణ కోల్పోవడంతో డివైడర్‌ను దాటి ఎదురుగా వస్తున్న మరో బస్సును ఢీకొట్టింది. ఫలితంగా ఒక బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా, పదుల సంఖ్యలో గాయపడ్డారు. గాయపడిన వారిని బర్డోలీలోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం ఆసుపత్రికి పంపాం" అని ప్రేమ్​ వీర్​ తెలిపారు.

ఈ దుర్ఘటనపై విచారం వ్యక్తం చేసిన ప్రధాని
మరోవైపు, ప్రమాద ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున ఎక్స్‌-గ్రేషియా ప్రకటించారు. "గుజరాత్‌లోని సూరత్ జిల్లాలో జరిగిన దుర్ఘటన చాలా బాధాకరం. ఈ కష్టసమయంలో తమ ఆత్మీయులను కోల్పోయిన వారికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడిన వారు వీలైనంత త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి, అధికారులు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తున్నారు" అని మోదీ ఎక్స్​ పోస్ట్‌లో పేర్కొన్నారు.

ప్రాణనష్టం జరగడం హృదయ విదారకరం : రాష్ట్రపతి
గుజరాత్ రోడ్డు ప్రమాదంలో ప్రాణనష్టం అత్యంత హృదయ విదారకమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. "సూరత్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణనష్టం జరిగిందన్న వార్త అత్యంత హృదయ విదారకం. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. అలాగే గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను" అని ముర్ము ఎక్స్​లో పోస్ట్‌ చేశారు.

వెంటనే స్పందించిన పోలీసులు
అయితే, ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే బర్డోలి అగ్నిమాపక శాఖ బృందం, స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం, ఘటనా స్థలంలో యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, ప్రమాదానికి గల కారణాలను తెలుసుకోవడానికి దర్యాప్తు జరుగుతుందని అధికారులు తెలిపారు.

సూరత్ రూరల్ ఎస్పీ రాజేశ్​ గధియా మాట్లాడారు. "ఈ రోజు సాయంత్రం సుమారు 4:00 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. ఇందులో రెండు మహారాష్ట్ర ప్రభుత్వ బస్సులు, నీటి ట్యాంకర్‌ను లాగుతున్న ఒక ట్రాక్టర్‌తో సహా మూడు వాహనాలు పాలుపంచుకున్నాయి. బస్సుల్లో ఒకటి సూరత్ నుంచి మహారాష్ట్రలోని ధూలే వైపు ప్రయాణిస్తోంది. బర్డోలి, వ్యారా మధ్య ప్రయాణిస్తున్నప్పుడు, బస్సు ముందు వెళ్తున్న ఒక నీటి ట్యాంకర్‌ను ఢీకొట్టింది. ఆ సమయంలో బస్సు అదుపుతప్పి డివైడర్‌ను దాటి, ఎదురుగా వస్తున్న వాహనాల లేన్‌లలోకి దూసుకెళ్లింది. ఫలితంగా అది మహారాష్ట్రలోని చాలిస్‌గావ్ నుంచి సూరత్ వైపు ప్రయాణిస్తున్న బస్సును ఢీకొట్టింది. దీంతో ఒక బస్సు రోడ్డు పక్కన ఉన్న లోతట్టు ప్రాంతంలోకి దూసుకెళ్లి బోల్తా పడింది. అనంతరం కొద్దిసేపటికే మంటలు చెలరేగి ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు" అని ఎస్పీ తెలిపారు.

CBSE చీఫ్​గా ప్రశాంత్ సీతారామ్- కార్యదర్శిగా వరుణ్ భరద్వాజ్ నియామకం

భారత్-నేపాల్ సరిహద్దు వివాదం- మూడో పక్షం జోక్యానికి నో ఛాన్స్​: MEA