ETV Bharat / bharat

500 అడుగుల లోయలో పడ్డ బస్సు- 14 మంది మృతి

హిమాచల్‌ప్రదేశ్‌ సిర్మౌర్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ప్రైవేట్ బస్సు లోయలో పడి 14 మంది మృతి

Bus Accident In Himachal Pradesh
Bus Accident In Himachal Pradesh (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : January 9, 2026 at 6:45 PM IST

3 Min Read
Choose ETV Bharat

Bus Accident In Himachal Pradesh : హిమాచల్‌ప్రదేశ్‌ సిర్మౌర్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేట్ బస్సు లోయలో పడి దాదాపు 14 మంది మృతి చెందారు. అనేక మంది గాయపడ్డారు. శిమ్లా నుంచి కుప్వికి వెళ్తున్న బస్సు హరిపుర్‌ధర్‌ దగ్గర అదుపుతప్పి 500 అడుగుల లోయలో పడింది. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన స్థానికులు క్షతగాత్రులను బస్సు లోపల నుంచి బయటకు తీశారు. అనంతరం అక్కడికి చేరుకున్న సహాయక సిబ్బంది గాయపడ్డ వారిని సమీప ఆస్పత్రులకు తరలించారు. ఈ ఘటనపై హిమాచల్‌ప్రదేశ్‌ సీఎం సుఖ్విందర్‌ సింగ్‌ సుఖు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు.

మరోవైపు, ఈ ప్రమాదానికి సంబంధించి సంగ్రా సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్ (ఎస్‌డీఎం) సునీల్ కాయత్ మీడియాతో మాట్లాడారు. శుక్రవారం మధ్యాహ్నం 3:30 గంటల ప్రాంతంలో రాజ్‌గఢ్ మీదుగా షిమ్లా నుంచి కుప్వికి వెళ్తున్న బస్సు, నియంత్రణ కోల్పోయి రోడ్డు పక్కన ఉన్న లోయలో పడిపోయిందని తెలిపారు. జిల్లా కేంద్రం నాహన్ నుంచి సుమారు 95 కిలోమీటర్ల దూరంలో ఉన్న హరిపుర్‌ధార్ గ్రామం సమీపంలో ఈ ప్రమాదం జరిగిందని పేర్కొన్నారు. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు కొనగుతున్నాయని చెప్పారు. గాయపడిన వారందరినీ సమీపంలోని సంగ్రా, దదాహు ఆసుపత్రులకు తరలించామని పేర్కొన్నారు.

ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది!
పరిశ్రమల శాఖ మంత్రి, షల్లాయి అసెంబ్లీ నియోజకవర్గం స్థానిక ఎమ్మెల్యే హర్షవర్ధన్ చౌహాన్ మాట్లాడారు. బస్సు ప్రమాదంలో మరణించిన వారి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. మరోవైపు, జిల్లా యంత్రాంగాన్ని ఇప్పటికే అప్రమత్తం చేశామని, బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించినట్లు తెలిపారు. అయితే, ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు.

అందువల్లే ప్రమాదం జరిగింది!
రోడ్డుపై మంచు పేరుకుపోవడం వల్ల బస్సు డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోయి ఉండవచ్చునని, దానివల్లే బస్సు రోడ్డుపై నుంచి జారి లోయలో పడినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే సహాయక చర్యల్లో పాల్గొన్నామని స్థానికులు తెలిపారు. మరోవైపు, ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో బాధితులను రక్షించడంలో ప్రత్యేక చొరవ చూపించిన స్థానికులను హరిపుర్‌ధార్ నివాసి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బల్బీర్ చౌహాన్ అభినందించారు. వారు చూపిన చొరవ అద్భుతమని కొనియాడారు.

ప్రమాదంపై విచారం వ్యక్తం చేసిన ప్రముఖులు
మరోవైపు, బస్సు ప్రమాదంపై పార్లమెంటు సభ్యుడు అనురాగ్ ఠాకూర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బస్సు లోయలో పడి అనేక మంది ప్రయాణికులు మరణించడం, గాయపడటం బాధాకరమన్నారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ రాజీవ్ బిందాల్ కూడా ఈ ప్రమాదంపై విచారం వ్యక్తం చేశారు. సిర్మౌర్ జిల్లాలోని హరిపుర్ధర్‌లో జరిగిన బస్సు ప్రమాదం అత్యంత విషాదకరమైనదని, బాధాకరమైనదని అన్నారు.

ట్రక్కు- కారు ఢీ!
ట్రక్కు- కారు ఢీకొన్న ఘటనలో నలుగురు యాత్రికులు మరణించగా, మరో ఏడుగురు గాయపడ్డారు. ఈ ఘటన శుక్రవారం తెల్లవారుజామున కర్ణాటకలో జరిగింది. ప్రమాద సమయంలో కారులో 11 మంది ప్రయాణికులు ఉన్నారు. బాధితులు కేరళలోని అయ్యప్ప స్వామి ఆలయానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.

సీఎం మమత ప్రవర్తనపై బీజేపీ ఫైర్- ఈడీ అధికారుల నుంచి సాక్ష్యాలు లాక్కున్నారని ధ్వజం!

'భారత విదేశాంగ విధానం ఊగిసలాడుతోంది'- చైనా కంపెనీలకు ప్రభుత్వ కాంట్రాక్టుల యోచనపై ఖర్గే ఫైర్