ETV Bharat / bharat

హిందూ ఆచారాల ప్రకారం రష్యా జంట పెళ్లి- కన్యాదానం చేసిన కాశీవాసులు

శివుడు, పార్వతీ దేవీ ప్రేరణతో కాశీలో పెళ్లి చేసుకోవాలనే నిర్ణయం - భారతీయ నాగరికత, సంస్కృతి, వైవిధ్యంపై మక్కువ - పెద్ద సంఖ్యలో హాజరైన జనం

Russian Couple Married In Indian Culture
Russian Couple Married In Indian Culture (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : January 22, 2026 at 5:46 PM IST

2 Min Read
Choose ETV Bharat

Russian Couple Married In Indian Culture: భారతీయ సంస్కృతీ, సంప్రదాయాలను ఎంతోమంది విదేశీలు ఇష్టపడుతూ ఉంటారు. అందులో ముఖ్యంగా భారతీయ వివాహాలని ప్రత్యేకంగా చూస్తారు. ఆ ఆసక్తితోనే రష్యాకు చెందిన ఓ యువ జంట భారత వివాహా ఆచారాలను పాటిస్తూ వేదమంత్రాల సాక్షిగా ఒక్కటయ్యారు. ఈ పెళ్లి వేడుక వారణాసిలోని దశాశ్వమేధ ఘాట్‌లోని నల్వా వీర్ బాబా మందిర్‌లో జరిగింది.

రష్యాకు చెందిన మెరిన్​(36), కాన్‌స్టాంటిన్ (48) భారత ఆచారాల ప్రకారం పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కాశీలోనే వివాహాం జరగాలనే కోరికతో రష్యా నుంచి అక్కడకి చేరుకున్నారు. పూజరుల సమక్షంలో దండలు మార్చుకుని వేద మంత్రాల మధ్య అగ్ని సాక్షిగా ఏడడగులు వేసి ఒక్కటయ్యారు. ఇదే సమయంలో అక్కడున్న మహిళలు మంగళకరమైన పాటలు పాడారు. ఈ పెళ్లి వేడుకలో మరో విశేషం ఏంటంటే స్థానికులు వీరిద్దరికి కన్యాదానం జరిపారు. ఈ సన్నివేశం ఆ వేడుకను మరింత ప్రత్యేకంగా మార్చింది.

Russian couple following Indian customs
భారతీయ ఆచారాలను పాటిస్తున్న రష్యాన్​ జంట (ETV Bharat)

సంప్రదాయకంగా రష్యన్​ వధూవరులు
ఈ పెళ్లి వేడుకలో రష్యన్​ వధూవరులిద్దరు భారతీయ దుస్తులు ధరించి పూర్తి సంప్రదాయకంగా కనిపించారు. వధువు లేత గులాబీ రంగు చీరలో, వరుడు ధోతి, కుర్తాను ధరించి ఆకట్టుకున్నారు. ఆ బట్టల్లో వారిద్దరు భారతీయ సంస్కృతికి ఎన్నో సంవత్సరాలుగా సంబంధం కలిగి ఉన్నట్లుగా కనిపించారని స్థానికులు అన్నారు.

5 సంవత్సరాల క్రితమే ఈ నిర్ణయం
హిందూ సంప్రదాయాల మీద మక్కువతోనే ఇలా వివాహాం చేసుకోవడానికి సిద్ధపడ్డామని వధువు దుల్​హన్​ మెరిన్ అన్నారు. "భారతీయ నాగరికత, అలాగే ఇక్కడి సంస్కృతి, వైవిధ్యం అంటే ఎంతో ఇష్టం. ఆ మక్కువతోనే హిందూ ఆచారాల ప్రకారం పెళ్లి చేసుకోవాలనే నిర్ణయం తీసుకున్నాను. అలాగే శివుడు, పార్వతీ దేవీలు నాకు ప్రేరణ. అలా హిందూ సంప్రదాయం ప్రకారం కాశీలో పెళ్లి చేసుకుంటానని 5 సంవత్సరాల కిందటే ప్రమాణం చేసుకున్నాను. అది ఈరోజు పూర్తిగా నెరవేరింది" అని సంతోషం వ్యక్తం చేశారు. అలాగే వీరి వ్యక్తిగత జీవితం విషయానికొస్తే వీరిద్దరు వ్యాపరవేత్తలుగా స్థిరపడ్డారు. దాదాపు 11 సంవత్సరాల క్రితమే పరస్పర అంగీకారంతో వివాహం చేసుకుంటున్నట్టు వివరించారు. దశాశ్వమేధ ఘాట్‌లోని నల్వా వీర్ బాబా మందిర్‌లో తాజాగా మరోసారి పెళ్లి చేసుకున్నామని ఆమె వెల్లడించారు.

పెద్ద సంఖ్యలో వీక్షించించిన జనం
పెళ్లి అనేది వేద మంత్రాల మంత్రోచ్ఛారణల మధ్య ఘనంగా జరిగే వేడుకని పురోహితుడు శివకాంత్​ పాండే అన్నారు. ఈ కార్యక్రమం తర్వాత గుడి ప్రాంగణం మొత్తం 'హర హర మహాదేవ్​' అనే మంత్రంతో ప్రతిధ్వనించింది. అక్కడి స్థానికులతో పాటు భక్తులు, పర్యాటకులంతా ఇలాంటి భావోద్వేగంతో కూడుకున్న సన్నివేశాన్ని చూసేందుకు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. చాలా మంది ఈ ప్రత్యేకమైన వివాహాన్ని వారి కెమెరాలలో బంధించారు. అలాగే ఆ విదేశీ జంటను ఆశీర్వదించారు.

గతంలోనూ ఇలాంటి వివాహాలు
ఈ రష్యన్​ జంటలాగే వేరే దేశాల జంటలు భారతీయ ఆచారాతో పెళ్లి చేసుకున్నారు. గత ఏడాదిలో ఉక్రెయిన్​కు చెందిన ఓ జంట కూడా ఈ సంప్రదాయాలకు ముగ్ధులయ్యారు. ఈ పెళ్లి వేడుక రాజస్థాన్​లోని జోధ్​​పుర్​లో జరిగింది. అలాగే ఇటాలీయన్​ జంట కూడా భారత ఆచారాల ప్రకారం ఒక్కటయ్యారు. ఈ విధంగా ఎంతోమంది విదేశీలు ఈ సంస్కృతికి ఫిదా అవుతున్నారు.

72 ఏళ్ల వరుడు, 27 ఏళ్ల వధువు- హిందూ సంప్రదాయంలో పెళ్లి చేసుకున్న ఉక్రెయిన్ జంట

2.5 అడుగుల వరుడు- 3 ఫీట్ల వధువు- పెళ్లితో ఒక్కటైన మరుగుజ్జులు