మలయాళీలకు రామోజీ ఫిల్మ్ సిటీ చూసే గోల్డెన్ ఛాన్స్- కేరళ విజన్‌తో ఎంఓయూ- ప్రత్యేక టూరిజం ప్యాకేజీలు
మలయాళీ పర్యాటకుల కోసం రామోజీ ఫిల్మ్ సిటీ ప్రత్యేక టూరిజం ప్యాకేజీ- కేరళ విజన్ టూరిజం క్లబ్‌తో RFC ఎంఓయూ - విద్యార్థులు, కుటుంబాల కోసం ప్రత్యేక టూర్ ప్యాకేజీలు సిద్ధం

Published : August 5, 2026 at 9:27 PM IST
Ramoji Film City Kerala Package : హైదరాబాద్‌లోని ప్రపంచంలోనే అతిపెద్ద ఫిల్మ్ షూటింగ్ డెస్టినేషన్ రామోజీ ఫిల్మ్ సిటీని (RFC) సందర్శించాలనుకునే కేరళ ప్రజలకు గోల్డెన్ ఛాన్స్ లభించింది. రామోజీ ఫిల్మ్ సిటీ, కేరళ విజన్ టూరిజం లిమిటెడ్ కలిసి ప్రత్యేక టూరిజం ప్యాకేజీలను అందించేందుకు MoU కుదుర్చుకున్నాయి. కేరళలోని అతిపెద్ద కేబుల్ నెట్‌వర్క్ అయిన కేరళ విజన్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని 14 జిల్లాల్లో ప్రారంభించిన 'యెస్ టు గో- కేరళ విజన్ టూరిజం క్లబ్' ద్వారా ఈ ప్రత్యేక ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకురానున్నాయి. ఇప్పటికే ఈ టూరిజం క్లబ్‌లో 5వేల మందికిపైగా సభ్యులు ఉన్నారు.
తిరువనంతపురంలో బుధవారం నిర్వహించిన యెస్ టు గో- కేరళ విజన్ టూరిజం క్లబ్ ప్రారంభోత్సవంలో ఈ ప్రాజెక్టును అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్బంగానే రామోజీ ఫిల్మ్ సిటీ ఎక్స్‌క్లూజివ్ టూరిజం ప్యాకేజీ పోస్టర్‌ను RFC వైస్ ప్రెసిడెంట్ ఏవీ రావు, చీఫ్ బిజినెస్ ఆఫీసర్ రుచి పంత్, కేరళ విజన్ ప్రతినిధులు కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి కేరళ పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి PC విష్ణునాథ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేరళ భవిష్యత్ పర్యాటక అభివృద్ధిపైనే ఆధారపడి ఉందన్నారు. పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి పారిశ్రామిక హోదా కల్పిస్తామని పేర్కొన్నారు. తెలంగాణకు ఏఐసీసీ ఇన్‌ఛార్జ్‌గా 3 సంవత్సరాల పాటు హైదరాబాద్‌లో ఉన్నప్పటికీ రామోజీ ఫిల్మ్ సిటీని సందర్శించే అవకాశమే రాలేదని, త్వరలో తప్పకుండా సందర్శిస్తానని తెలిపారు.

రామోజీ ఫిల్మ్ సిటీకి కేరళతో ప్రత్యేక అనుబంధం: ఏవీ రావు
ఆర్ఎఫ్‌సీ వైస్ ప్రెసిడెంట్ ఏవీ రావు మాట్లాడుతూ- రామోజీ ఫిల్మ్ సిటీకి కేరళతో ప్రత్యేక అనుబంధం ఉందన్నారు. కేరళ విజన్ టూరిజం యాప్ ద్వారా అమలు చేస్తున్న ఈ ప్రత్యేక ప్యాకేజీలు కేరళ నుంచి వచ్చే పర్యాటకులకు ఎంతగానో ఉపయోగపడతాయని, మరింత సౌకర్యంగా ఉండనున్నాయని చెప్పారు. ఈ ప్రాజెక్ట్ విజయవంతం అవుతుందన్న పూర్తి నమ్మకం ఉందని, కేరళ విజన్ టూరిజం క్లబ్‌కు అన్ని విధాలా సహకరిస్తామని తెలిపారు.
షూటింగ్ లొకేషన్లు, పార్కులు, విభిన్న హోటళ్లు
ఫిల్మ్ సిటీ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ రుచి పంత్ కూడా ఈ ప్రాజెక్ట్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. యెస్ టు గో ప్రాజెక్ట్‌లో పనిచేస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. కేరళ పర్యాటకులకు రామోజీ ఫిల్మ్ సిటీ అందాలను పూర్తిగా ఆస్వాదించేలా ప్రత్యేక ప్యాకేజీలను రూపొందిస్తున్నామని తెలిపారు. ఫిల్మ్ సిటీలోని 2వేల ఎకరాల్లో షూటింగ్ లొకేషన్లు, 5 విభిన్న కేటగిరీల హోటళ్లు, ప్రత్యక్షంగా సినిమా షూటింగ్స్ వీక్షించే అవకాశం, బర్డ్ పార్క్, బటర్‌ఫ్లై పార్క్ వంటి ఆకర్షణలు విద్యార్థులు, చిన్న పిల్లలకు ఎంతగానో నచ్చుతాయని చెప్పారు.
అంతే కాకుండా పెద్ద సమావేశాలు, వివాహాలు, ఇతర వేడుకలు నిర్వహించేందుకు కూడా ఆర్ఎఫ్‌సీ అత్యాధునిక సదుపాయాలు కలిగి ఉందని రుచి పంత్ వివరించారు. ఈ అవకాశాన్ని మలయాళీ పర్యాటకులు సద్వినియోగం చేసుకోవాలని, అందరినీ హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీకి ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి సీఐఓ అధ్యక్షుడు ప్రవీణ్ మోహన్ అధ్యక్షత వహించగా, కేరళ విజన్ టూరిజం లిమిటెడ్ ఎండీ జ్యోతి కుమార్ వీఎస్, CIDCO అధ్యక్షుడు కె. విజయకృష్ణన్, COA ప్రధాన కార్యదర్శి సురేష్ తదితరులు పాల్గొన్నారు.
రామోజీ ఫిల్మ్ సిటీ గురించి
రామోజీ ఫిల్మ్ సిటీని 1996లో దివంగత రామోజీ రావు స్థాపించారు. ప్రపంచంలోనే అత్యంత పెద్ద ఫిల్మ్ స్టూడియో కాంప్లెక్స్‌గా అది గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించింది. ఇక్కడ సుందరమైన ఉద్యానవనాలు, బాహుబలి సహా పలు సినిమాల సెట్లు, హోటళ్లు, థీమ్డ్ పార్క్స్, వినోద కార్యక్రమాలతో ఉండే గొప్ప హాలిడే డెస్టినేషన్‌గా చెబుతారు. పర్యటకుల్ని అలరించేందుకు తరచుగా వేడుకలు నిర్వహిస్తుంటారు. ఆ సమయాల్లో ప్రత్యేక ప్యాకేజీలు అందుబాటులో ఉంటాయి.
గ్రాండ్‌గా కోల్‌కతా టూరిజం ఫెయిర్- స్పెషల్ అట్రాక్షన్‌గా రామోజీ ఫిల్మ్ సిటీ స్టాల్
'ఎవరో వస్తారు ఏదో చేస్తారని ప్రభుత్వాల వంక ఆశగా చూడటం కూడా నేరమే'

