'రాహుల్ ఏజ్ పెరుగుతోంది- కానీ ఆ గద్దె దక్కదు'- కాంగ్రెస్‌కు బీజేపీ కౌంటర్ ఎటాక్
ఇజ్రాయెల్‌లో ప్రధాని మోదీ ప్రసంగంపై కాంగ్రెస్ విమర్శలు- రాహుల్ గాంధీ లక్ష్యంగా బీజేపీ ఘాటు వ్యాఖ్యలు

Published : February 26, 2026 at 6:57 PM IST
BJP Says Rahul Getting Old : ఇజ్రాయెల్ పార్లమెంట్లో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రసంగంపై కాంగ్రెస్ చేసిన విమర్శలను బీజేపీ గురువారం తీవ్రంగా ఖండించింది. రాహుల్ గాంధీకి వయసు అయిపోతోందని, ఆయనకు ప్రధాని అయ్యే అవకాశం లేనందున కాంగ్రెస్ అసంతృప్తితో ఉందని ఎద్దేవా చేసింది. "రాహుల్ గాంధీ, ఆయన కుటుంబం పూర్తిగా రాజీపడ్డారు. దేశ తొలి ప్రధానిగా ఉన్న సమయంలో జవహర్లాల్ నెహ్రూ భారత భూభాగాలను చైనా, పాకిస్థాన్‌లకు ఎందుకు కానుకగా ఇచ్చేశారో కాంగ్రెస్ దేశానికి చెప్పాలి" అని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర డిమాండ్ చేశారు.
నెతన్యాహు సర్కార్‌కు మద్దతా?
అంతకుముందు, ఇజ్రాయెల్ పార్లమెంట్లో ప్రధాని మోదీ ప్రసంగాన్ని కాంగ్రెస్ తప్పుబట్టింది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహును మోదీ నిస్సిగ్గుగా సమర్థించారని విమర్శించింది. "గాజాలో మారణహోమానికి పాల్పడుతున్న, వేలాది మంది పాలస్తీనియన్లను ఆకలితో అలమటించేలా చేస్తున్న నెహన్యాహు ప్రభుత్వానికి మోదీ నిస్సిగ్గుగా మద్దతు ఇచ్చారు" అని కాంగ్రెస్ సీనియర్ నేత ఆనంద్ శర్మ ఎక్స్ వేదికగా విమర్శించారు.
The Oman government offered to give Gwadar Port to India, but Nehru declined it. Imagine the diplomatic value of that land today.
— BJP (@BJP4India) February 26, 2026
Nehru’s decisions are costing the nation even now, so it raises the question: was Nehru bribed by China and Pakistan? Was that the reason he… pic.twitter.com/5O0amXxDbF
బీజేపీ కౌంటర్ ఎటాక్
కాంగ్రెస్ విమర్శలపై బీజేపీ ప్రతిదాడికి దిగింది. దేశానికి, ప్రధాని మోదీకి ఏదైనా మంచి జరిగినప్పుడు కాంగ్రెస్ దానిని 'చెడు వార్త'గా భావిస్తుందని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర విమర్శించారు. "ఇజ్రాయెల్ పార్లమెంట్లో ప్రధాని మోదీకి లభించిన గౌరవం దేశానికే గర్వకారణం. అక్కడి ప్రజలు స్వచ్ఛందంగా మోదీ, మోదీ అని నినదించారు. అది 140 కోట్ల భారతీయుల పట్ల ఇజ్రాయెల్ ప్రజలకు ఉన్న ప్రేమకు నిదర్శనం" అని ఆయన పేర్కొన్నారు.
चचा नेहरू के निर्णयों की कीमत देश आज भी चुका रहा है।
— Sambit Patra (@sambitswaraj) February 26, 2026
नेहरू जी के ऊपर चीन और पाकिस्तान का लाभ या दबाव था, जिसके कारण उन्होंनें देश की भूमि चीन और पाकिस्तान को सौंपा।#CompromisedNehru pic.twitter.com/IAKAMHEqEB
"భారత్-ఇజ్రాయెల్ వ్యూహాత్మక సంబంధాల బలోపేతానికి మోదీ చేసిన కృషికి గుర్తింపుగా ఆయనకు స్పీకర్ ఆఫ్ ది కెస్సెట్ మెడల్ లభించింది. కానీ అధికారం (ప్రధాని పీఠం) దక్కలేదనే బాధలో కాంగ్రెస్ ఉంది. రాహుల్ బాబాకు వయస్సు మళ్లుతోంది. కానీ ఆయనకు ప్రధాని పీఠం దక్కదు."
- సంబిత్ పాత్ర, బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి
నెహ్రూపై తీవ్ర ఆరోపణలు
ఎప్స్టీన్ ఫైల్స్ ప్రభావంతో మోదీ రాజీపడ్డారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించడంపై సంబిత్ పాత్ర తీవ్రంగా స్పందించారు. ఆయన జవహర్లాల్ నెహ్రూపై సంచలన ఆరోపణలు చేశారు. నెహ్రూ హయాంలో భారత్ మ్యాప్‌ను శాశ్వతంగా మారుస్తూ చైనా, పాకిస్థాన్‌లకు కీలక భూభాగాలను అప్పగించారని ఆరోపించారు. చైనాకు కోపం వస్తుందనే భయంతో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వాన్ని తిరస్కరించారని అన్నారు.
'చైనా, పాకిస్థాన్‌లు జవహర్లాల్ నెహ్రూకు ఏమైనా లంచం ఇచ్చాయా? భద్రతా మండలి సీటును ఆయన ఎందుకు వదులుకున్నారు? అనేది కాంగ్రెస్ చెప్పాలి. నెహ్రూను 'చాచా కాంప్రమైజ్డ్' అని పిలవాలి' అని సంబిత్ పాత్ర వ్యాఖ్యానించారు.
ఈ ఏడు ప్రశ్నలకు సమాధానం కావాలి?
అన్ని రాజకీయ ఒత్తిళ్లకు లొంగిపోయిన నెహ్రూ కుటుంబం 7 కీలక ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని సంబిత్ పాత్ర డిమాండ్ చేశారు.
- పండిట్ నెహ్రూ టిబెట్‌ను ఎందుకు చైనీస్ భూభాగంగా అంగీకరించారు.
- ఆక్సాయ్‌చిన్ ప్రాంతంలో చైనా కార్యకలాపాలపై ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) చేసిన హెచ్చరికలను నెహ్రూ ఒక వదంతిగా కొట్టిపడేశారు. పార్లమెంట్లో కూడా దీనిని ఒక వదంతి అని ఎందుకు చెప్పారు?
- ఎవరి సమ్మతి లేకుండా నెహ్రూ కశ్మీర్లో ప్రజాభిప్రాయ సేకరణ (రిఫరెండమ్)కు ఎందుకు పిలుపునిచ్చారు?
- బంగాల్లోని బెరుబారీ యూనియన్‌లో సగభాగాన్ని నెహ్రూ ఎందుకు పాకిస్థాన్‌కు కానుకగా ఇచ్చేశారు?
- స్వరణ్ సింగ్- భుట్టో చర్చల సమయంలో పూంచ్, ఉరి, గురెజ్ ప్రాంతాలను పాక్‌కు అప్పగించడానికి భారత్ ఎందుకు అంగీకరించింది?
- పంజాబ్‌లోని సర్జా మజ్రా, రఖ్ హర్దిత్ సింగ్, పాఠన్కే గ్రామాలను దాయాదికి అప్పగించే నిర్ణయం ఎందుకు తీసుకున్నారు?
- ఎవరి ఒత్తిడి వల్ల పండిట్ నెహ్రూ రాణ్ ఆఫ్ కచ్‌లో 300 చదరపు మైళ్ల భూమిని భారత్ కల్పోయేలా చేశారు?
ఎప్స్టీన్ ఫైల్స్‌తో అమెరికా ఒత్తిడి- ట్రేడ్ డీల్ వల్ల మన రైతులే బలి : రాహుల్ గాంధీ
NCERT వివాదం- బాధ్యులను గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటాం: కేంద్ర విద్యాశాఖ మంత్రి

