ETV Bharat / bharat

'అదృష్టమంటే ఇదేనేమో'- లాటరీలో రూ.7 కోట్లు- ఆ లక్కీ పర్సన్ ఎవరంటే?

మొత్తం 14 లక్షల టిక్కెట్లలో 11,02,382 టిక్కెట్లు విక్రయం- మొదటి బహుమతి రూ.7 కోట్ల రూపాయలు- ఆ లాటరీ టికెట్టును ఫిరోజ్‌పుర్‌లో కొనుగోలు చేసినట్లు నిర్ధరణ

Lucky Draw Punjab
పంజాబ్ రాఖీ బంపర్ లాటరీ ఫలితాలు విడుదల (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : August 30, 2026 at 10:32 AM IST

3 Min Read
Choose ETV Bharat

Lucky Draw Punjab : అదృష్టం ఎవరిని ఎప్పుడు వరిస్తుందో ఊహకందని విషయం. తాజాగా పంజాబ్​లో ఇలాంటి సంఘటనే జరిగింది. లుథియానా జిల్లాలో శనివారం జరిగిన రాష్ట్ర రాఖీ బంపర్ డ్రాలో ఒకరికి అదృష్టం వరించింది. ఫిరోజ్‌పుర్‌లోని ఎన్‌కే లాటరీ స్టాల్‌లో అమ్మిన A612479 నంబర్ గల టికెట్‌కు రూ.7 కోట్ల మొదటి బహుమతి లభించింది. అందుకు సంబంధించిన వివరాలను లుథియానాలో పోస్టింగ్ ఉన్న ముఖ్యమంత్రి ఫీల్డ్ ఆఫీసర్ వెల్లడించారు.

శనివారం సాయంత్రం లుథియానాలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో బంపర్ ప్రైజ్ డ్రా ప్రక్రియ ప్రారంభమైంది. ఇందులో సీనియర్ అధికారులతో పాటు ఇతర అధికారులు కూడా పాల్గొన్నారు. మొత్తం 14 లక్షల టికెట్లు ఉండగా, వాటిలో 11,02,382 టికెట్లు అమ్ముడయ్యాయి. మొదటి బహుమతి రూ.7 కోట్ల రూపాయలు. దీనిని ఫిరోజ్‌పుర్‌లోని మల్వాల్ గ్రామానికి చెందిన గుర్పీత్ సింగ్ కొన్నారు. తన తండ్రితో కలిసి మార్కెట్‌కు వచ్చిన గుర్పీత్, సరదాగా ఈ రాఖీ బంపర్ లాటరీలో పాల్గొన్నారు. ఆ తర్వాత, తనకు రూ. 7 కోట్ల బంపర్ బహుమతి వచ్చిందని తెలియడంతో ఆయన కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. గుర్పీత్ వృత్తిరీత్యా కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. బహుమతిని క్లెయిమ్ చేసుకోవడానికి టికెట్టు కొనుగోలుదారుడికి అవసరమైన పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ త్వరలోనే పూర్తి కానుంది.

"నేను మా నాన్నతో కలిసి మార్కెట్‌కు వెళ్లాను. అక్కడి నుంచి తిరిగి వచ్చేటప్పుడు, నాకు లాటరీ టికెట్​ కొనాలని ఉందని మా నాన్నతో చెప్పాను. అందుకు ఆయన ఒప్పుకున్నారు. దాంతో కౌంటర్ వద్దకు వెళ్లి పెద్దగా ఆలోచించకుండానే లాటరీ టికెట్ కొనుగోలు చేసి అక్కడి నుంచి వచ్చేశాను. లాటరీ ఫలితాలు వచ్చిన తర్వాత కూడా నాకు బహుమతి వచ్చిందన్న విషయం తెలియదు. అయితే, రూ. 7 కోట్ల బంపర్ బహుమతి గెలుచుకున్నారంటూ ఫోన్ కాల్స్ రావడం మొదలైంది. ఆ తర్వాత లాటరీ టికెట్ కొనుగోలు చేసిన స్టాల్‌కు వెళ్లి విచారించగా లాటరీ తగిలిందని తెలిసింది"
- గుర్పీత్ సింగ్, మొదటి బహుమతి విజేత

దీంతో పాటు, దీపావళి డ్రాను కూడా ప్రారంభించారు. దీనికి సంబంధించిన డ్రా నవంబర్ 16న జరుగుతుంది. "ఇందులో 36 లక్షల టిక్కెట్లు ఉంటాయి. మొదటి బహుమతిని రూ. 12 కోట్లుగా ఉంచారు. అంటే రాఖీ బంపర్ కంటే ఈ బహుమతిని రూ. 5 కోట్లు పెంచారు. అమ్ముడైన టిక్కెట్ల నుంచి మొదటి బహుమతి, అంటే బంపర్ ప్రైజ్‌ను డ్రా తీస్తారు. బహుమతుల మొత్తాన్ని క్రమక్రమంగా పెంచుతున్నారు. మొదట, ఒక కోటి, తర్వాత 2 కోట్లు, 3 కోట్లు, తర్వాత 5 కోట్లు, రాఖీ బంపర్ మొదటి బహుమతిని రూ. 7 కోట్లుగా ఉంచారు" అని ఫీల్డ్​ ఆఫీసర్ పేర్కొన్నారు.

ట్యాక్సీ డ్రైవర్​కు రూ.3 కోట్ల జాక్​పాట్​(మరో వార్త)
ఇలాంటి లక్కీ డ్రాలు ఇదివరకు కూడా వార్తల్లో నిలిచాయి. దశాబ్దాలుగా ట్యాక్సీ నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్న ఓ సాధారణ డ్రైవర్‌కు రూ.3 కోట్ల జాక్​పాట్​ తగిలింది. దీంతో ఒక్కరోజులోనే ఆయన కోటీశ్వరుడిగా మారాడు. దీంతో ట్యాక్సీ డ్రైవర్ కుటుంబీకులు, బంధువుల ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. ఈ సంఘటన హిమాచల్ ప్రదేశ్​లో గత జూన్​లో జరిగింది.

కాంగ్రా జిల్లా ఫతేపుర్​కు చెందిన కల్యాణ్​ చంద్​ను ఈ అదృష్టం వరించింది. వృత్తి రిత్యా ఓ ప్రయాణికుడిని దింపేందుకు వెళ్లిన ఆయన పంజాబ్​లోని బఠిండాకు వెళ్లారు. అక్కడ రూ.500 విలువైన రెండు లాటరీలను కొనుగోలు చేశారు. అందులో ఒకదాంట్లో ఆయనకు జాక్​పాట్​ తగిలింది. విషయం తెలుసుకున్న కల్యాణ్​ లాటరీ స్టాల్​ వెళ్లగా, ఆయనకు ఘన స్వాగతం లభించింది. సదరు కుటుంబం ఆనందంతో మిఠాయిలు పంచుకుంటూ సంబరాలు జరుపుకున్నారు. డ్రైవర్​గా ఆయనకు నెలకు సగటున రూ.16 వేలు వరకు మాత్రమే ఆదాయం వస్తుందని చెప్పారు. కొన్నిసార్లు కుటుంబ అవసరాల కోసం రోజువారీ కూలీ పనులు కూడా చేయాల్సి వచ్చేదని అన్నారు. అయితే, ఒక్కసారిగా రూ.3 కోట్ల లాటరీ రావడం తమ కుటుంబానికి కొత్త ఆశలను తీసుకొచ్చిందని ఆయన పేర్కొన్నారు.

తబలా వాయించే వ్యక్తికి రూ.1.5 కోట్ల లాటరీ
అలాగే, పంజాబ్​లోనూ గత ఏప్రిల్​లో ఒకరికి లాటరీ తగిలింది. రూ.200 రూపాయలతో కొన్న టికెట్​కు రూ. 1.5 కోట్లు వరించాయి. దీంతో లుథియానాకు చెందిన ఆ కుటుంబం ఒక్కసారిగా కోటీశ్వరులుగా మారిపోయింది. అంతకుముందు, గుర్‌చరణ్ సింగ్(లాటరీ కొనుగోలు దారు) జీవితం సాదాసీదాగా సాగింది. ఒక తబలా మాస్టర్‌గా జాతరలు, ఫంక్షన్లలో వాయిద్యాలు వాయిస్తూ జీవనం సాగించేవారు, కొన్ని సందర్భాల్లో పెయింటింగ్ పనులు కూడా చేసేవారు. అయితే, 40 ఏళ్లుగా ఆయన లాటరీ టికెట్లు కొనుగోలు చేస్తూనే ఉండగా, చివరికి ఆయన్ను అదృష్టం తలుపుతట్టింది.

భార్యను చంపి పాతిపెట్టిన భర్త- చేయి బయటకు కనిపించడంతో అసలు విషయం వెలుగులోకి!

PGలో యువతుల లోదుస్తులు, శానిటరీ ప్యాడ్లు చోరీ- వాటితో లైంగిక సంతృప్తి- కట్​ చేస్తే పోలీసుల చేతిలో!