'బబ్బర్ షేర్స్ ప్రజలు విరిసే చెప్పుల నుంచి తప్పించుకుంటున్నారు'- యూత్ కాంగ్రెస్‌పై మోదీ ఫైర్!
MODI Summit - యూత్ కాంగ్రెస్ నిరసనపై మండిపడ్డ ప్రధాని మోదీ- విదేశీ అతిథుల ముందు అసమర్థతను బయటపడిందని ఎద్దేవా!

Published : February 27, 2026 at 11:09 PM IST
PM MODI On Youth Congress : దిల్లీ వేదికగా ఇటీవల జరిగిన AI ఇంపాక్ట్ సమ్మిట్‌లో యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు చొక్కాలు విప్పి నిరసన చేయడాన్ని ప్రధాని నరేంద్రమోదీ తప్పుబట్టారు. కాంగ్రెస్ ఎన్ని కుతంత్రాలు చేసినప్పటికీ తమ ప్రభుత్వం మాత్రం భారతదేశ అభివృద్ధికి కృషి చేస్తూనే ఉంటుందని మోదీ అన్నారు. అలాగే దేశంలో కాంగ్రెస్ పార్టీకి మిలీనియల్స్ ఇప్పటికే తగిన గుణపాఠం చెప్పారని, ఇప్పడు జెన్ జీ కూడా ఇదే చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఓ జాతీయ మీడియా శుక్రవారం నిర్వహించిన భారత్ రైజింగ్ సమ్మిట్‌లో పాల్గొన్న మోదీ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.
మీ పులులకు ప్రజలు బుద్ధి చెప్పారు!
కాగా, చొక్కాలు విప్పి నిరసన చేపట్టిన తమ యూత్ కాంగ్రెస్ కార్యకర్తలకు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఇటీవల లోక్‌సభలో పూర్తి మద్దతు ఇచ్చారు. వాళ్లను 'బబ్బర్ షేర్స్' (పులులు) అని అభివర్ణించారు. దీనిపై మోదీ స్పందించారు. కాంగ్రెస్ సింహాలకు ప్రజలు చెప్పులతో బుద్ధి చెప్పారని అన్నారు. 'కాంగ్రెస్ బబ్బర్ షేర్స్ తాము చేసిన పనికి ప్రజలతో చెప్పు దెబ్బలు తిని వెళ్లారు' అని మోదీ విమర్శించారు. కాంగ్రెస్ తనకు కావలసినన్ని బట్టలు చింపివేయగలదు. కానీ మేం భారత్ అభివృద్ధి కోసమే పని చేస్తాం. AI సమ్మిట్‌లో కాంగ్రెస్ చొక్కాలు విప్పడంతో, విదేశీ అతిథుల ముందు మీ అసమర్థత బయటపడింది' అని మోదీ వ్యాఖ్యానించారు.
#WATCH | Delhi: At the News18 Rising Bharat Summit, PM Narendra Modi says, " the congress and its allies have never worked with good intentions. they have no concern for the suffering and pain of the poor. for example, the ayushman bharat scheme has not been implemented in bengal… pic.twitter.com/hcl7ieE5rJ
— ANI (@ANI) February 27, 2026
జెన్ జీ కూడా గుణపాఠం చెబుతుంది!
'మన ప్రభుత్వం తీసుకునే ప్రతి మంచి పనిని దేశ ప్రజలు స్వాగతించారు. కానీ కాంగ్రెస్‌కు మాత్రం ప్రతి దాన్ని ఎలా వ్యతిరేకించాలో మాత్రమే తెలుసు. కాంగ్రెస్ ఓట్లను ఎవరు దొంగిలించడం లేదు. తామ ఓట్లేసే అంత అర్హత కాంగ్రెస్ పార్టీకి లేదని ప్రజలే భావిస్తున్నారు. తొలుత మిలీనియల్స్ కాంగ్రెస్‌కు ఒక పాఠం నేర్పారు. ఇప్పుడు జెన్ జీ కూడా అదే చేయడానికి సిద్ధంగా ఉంది. 1984లో కాంగ్రెస్‌కు 39 శాతం ఓట్లుతో 400 కంటే ఎక్కువ సీట్లు వచ్చాయి. కానీ తరువాతి ఎన్నికలలో ఈపార్టీకి ఓట్లు క్రమంగా తగ్గాయి.ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి కేవలం నాలుగు రాష్ట్రాల్లోనే 50 కంటే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అది వాళ్ల ప్రస్తుత పరిస్థితి. గత 40 ఏళ్లలో దేశంలో యువ ఓటర్ల సంఖ్య పెరిగింది. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ ఓటు శాతం స్పష్టంగా తగ్గింది' అని మోదీ అన్నారు.
సంస్కరణ అజెండా సిద్ధం చేయాలి కోరిన ప్రధాని మోదీ
సంస్కరణ కోసం ప్రతిష్ఠాత్మకమైన అజెండాను రూపొందించాలని మంత్రిత్వశాఖలకు ప్రధాని మోదీ చెప్పారు. రానున్న రోజ్లుల తమ శాఖల్లో తీసుకోవాల్సిన చర్యలపై వివరణాత్మక నివేదికలను సిద్ధం చేయాలని మంత్రి మండలి సహచరులను కోరినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. విధానాల సరళీకరణ, సులభతర వ్యాపారాన్ని మెరుగుపరచడం, సాంకేతిక ఆధారిత పాలనను విస్తరించడం వంటి తదితర అంశాలు ప్రాతిపదికగా ఈ సంస్కరణలు ఉండాలని ప్రధాని మోదీ తెలిపినట్లు చెప్పాయి. దీనిని మంత్రులే స్వయంగా రూపొందించాలని ఆదేశించినట్లు పేర్కొన్నాయి. అంతేకాకుండా మంత్రిమండలి సమావేశాల్లో వారే దాని గురించి వివరించాలని చెప్పిన్నట్లు పేర్కొన్నాయి. అందుకోసం ఓ నమునా పత్రాన్ని కూడా క్యాబినేట్ సెక్రటీ ఇప్పటికే మంత్రులకు పంపినట్లుగా వెల్లడించాయి. భవిష్యత్తులో తమ శాఖల్లో చేపట్టనున్న సంస్కరణల గురించి, అలాగే వాటి అమలు, ఫలితాల గురించి ఈ పత్రంలో మంత్రులు వివరించాల్సి ఉంటుంది.
అంతుకుముందు 'వికసిత్ భారత్' కోసం సాంకేతికత, సంస్కరణలు, ఆర్థికం అనే అంశంపై నిర్వహించిన బడ్జెట్ అనంతర వెబినార్‌లో ప్రధాని మోదీ ప్రసంగించారు. దేశాభివృద్ధికి పరిశ్రమలు, పెట్టుబడులు, ఆవిష్కరణలతో ముందుకు రావాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్రభుత్వం, పరిశ్రమలు, విజ్ఞాన భాగస్వాములు కలిస్తే సంస్కరణలు ఫలితాలుగా మారుతాయని అన్నారు. సంస్కరణల భాగస్వామ్య చార్టర్‌ను రూపొందించాల్సిన అవసరం ఉందని తెలిపారు. 2047కల్లా వికసిత్ భారత్ లక్ష్యం సాధించడానికి ఈ పత్రం చాలా కీలకమని మోదీ చెప్పారు.

