యూట్యూబ్‌లోనూ మోదీనే టాప్- 3 కోట్లకు పైగా సబ్స్క్రైబర్లతో రికార్డ్
ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫాం యూట్యూబ్‌లో మోదీ ఛానల్ సబ్‌స్ర్కైబర్ సంఖ్య 3 కోట్లు- రెండో స్థానంలో బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో

Published : March 3, 2026 at 2:08 PM IST
PM Modi Youtube Subscribers : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ క్రేజ్ రోజురోజుకి భారీగా పెరిగిపోతోంది. కొద్దిరోజుల క్రితం ఆయన ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్య 10 కోట్లు దాటి, ప్రపంచంలోనే అత్యధిక మంది ఫాలోవర్లు ఉన్న రాజకీయనేతగా రికార్డు సృష్టించారు. అయితే, తాజా మరో రికార్డు కూడా ఆయన సొంతం చేసుకున్నారు. ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫాం యూట్యూబ్‌లో మోదీ ఛానల్ సబ్స్క్రైబర్ల సంఖ్య 3 కోట్లకు పైగా దాటింది. వీడియో షేరింగ్ ప్లాట్‌ఫామ్‌లో అత్యధిక ఫాలోవర్లు అనుసరించే ప్రపంచ నాయకుడిగా ఆయన నిలిచారు. 2007లో ప్రధాని మోదీ యూట్యూబ్ ఛానల్ ప్రారంభించగా, ఇప్పటి వరకు ఆయన 33వేలకు పైగా వీడియోలను షేర్ చేశారు.
మరోవైపు, 6.6 మిలియన్లతో బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో రెండో స్థానంలో ఉన్నారు. అదేవిధంగా అమెరిగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కంటే ప్రధాని మోదీకి ఉన్న సబ్స్క్రైబర్ల సంఖ్య ఏడు రెట్లు ఎక్కువ. భారత్‌లోనూ ప్రధాని మోదీకి ఇతర రాజకీయ నాయకుల కంటే ఎక్కువ మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధీ కంటే దాదాపు 3 రెట్లు ఎక్కువ సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ రెండింటి కంటే నాలుగు రెట్లు ఎక్కువ మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు.
ఇన్‌స్టాలో మోదీ హవా
ఇక ఇన్‌స్టా విషయానికొస్తే, ప్రధాని మోదీ 2014లో ఇన్‌స్టాగ్రామ్‌లో చేరారు. గడిచిన దశాబ్ద కాలంలో, ప్రపంచ నాయకులోకెల్లా ఎక్కువ మంది ఫాలోవర్లను సంపాదించుకున్నారు. ఆయనకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కంటే ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్నారు. కాగా, 43.2 మిలియన్ల ఫాలోవర్లతో ట్రంప్ రెండో స్థానంలో ఉన్నారు. ఇక ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో 15 మిలియన్ల మంది ఫాలోవర్లు, బ్రెజిల్ అధ్యక్షుడు లూలా 14.4 మిలియన్ల మంది ఫాలోవర్లు, టర్కిష్ అధ్యక్షుడు ఎర్డోగాన్ 11.6 మిలియన్ల మంది ఫాలోవర్లు, అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలీ 6.4 మిలియన్ల మంది ఫాలోవర్లను కలిగి ఉన్నారు. అయితే, వీరంతా ప్రధాని మోదీ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
స్వదేశంలోనూ మోదీనే టాప్
ఇక స్వదేశంలో ఉన్న రాజకీయ నేతల్లోకెల్లా మోదీనే టాప్‌లో ఉన్నారు. అంతర్జాతీయ స్థాయిలోనే కాకుండా భారత రాజకీయాల్లోనూ సోషల్ మీడియా మోదీ ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది. దేశంలోని ఇతర రాజకీయ నాయకులెవరూ ఆయన దరిదాపుల్లో కూడా లేరు. ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ 16.1 మిలియన్ల మంది ఫాలోవర్లతో రెండో స్థానంలో ఉండగా, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ 12.6 కోట్ల ఫాలోవర్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు. వీటితో పాటు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో, ప్రధాని మోదీకి 106 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉండగా, ఫేస్‌బుక్‌లో 54 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.
2023లో 2 కోట్లకు పైగా సబ్స్క్రిప్షన్లు
2023లోనూ ప్రపంచంలోనే అత్యధిక యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్లు కలిగిన నేతగా మోదీ రికార్డు సాధించారు. అప్పుడే మోదీ యూట్యూబ్ ఛానెల్‌కు 2 కోట్లకు పైగా సబ్స్క్రిప్షన్లు ఉన్నారు. వ్యక్తిగత యూట్యూబ్ ఖాతాతో ఈ ఘనత సాధించిన ఏకైక ప్రపంచ నేతగా నిలిచారు. సబ్స్క్రైబర్లతో పాటు వ్యూస్‌లోనూ మిగతా అందరి నేతలకు అందనంత దూరంలో మోదీ ఉన్నారు. సుమారు 450 కోట్ల వ్యూస్‌తో మోదీ అగ్రస్థానంలో నిలిచారు. ఆ తర్వాత 22.4 కోట్ల వ్యూస్‌తో జెలెన్స్కీ రెండో స్థానంలో నిలిచారు.
భారత్ ఎల్లప్పుడూ శాంతినే కోరుకుంటోంది : కెనడా ప్రధానితో ప్రెస్మీట్లో మోదీ
మోదీ సరికొత్త రికార్డు- ఇన్‌స్టాలో 100 మిలియన్లు దాటిన ఫాలోవర్స్ - ట్రంప్ కంటే రెండు రెట్లు ఎక్కువే

