'స్వతంత్రానంతరం దేశ చరిత్రను చెరిపివేసేందుకు కుట్రలు'- సోమనాథ్ శౌర్య యాత్రలో మోదీ
వలసవాదుల దాడుల నుంచి సోమ్‌నాథ్ ఆలయ రక్షణ కోసం ప్రాణాలర్పించిన వారికి గౌరవ సూచకంగా యాత్ర

Published : January 11, 2026 at 10:54 AM IST
PM Modi Somnath Visit : స్వాతంత్రత్యానంతరం దేశ చరిత్రను చెరిపివేసేందుకు కొందరు కుట్రలు పన్నారని ఆరోపించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. నిజమైన చరిత్రలోని హింస, ద్వేషం, ఉగ్రవాదాన్ని దాచిపెట్టి, సంపంద కోసం సోమనాథ్‌పై దాడి చేశారని చెప్పారని గుర్తు చేశారు. సర్దార్ పటేల్ సోమనాథ్ ఆలయాన్ని పునర్ నిర్మించాలని అనుకుంటే చాలా మంది అడ్డుకున్నారని విమర్శించారు. వెయ్యేళ్ల క్రితం దురాక్రమణదారులు ఈ ప్రాంతాన్ని సొంతం చేసుకున్నామని భావించారని, కానీ నేటికీ ఆలయంపై జెండా ఎగురుతుందన్నారు. ఇదే భారత శక్తి సామర్థ్యాలను, బలాన్ని ప్రపంచానికి చాటి చెపుతుందని అన్నారు. గుజరాత్‌లోని సోమనాథ్ ఆలయంలో నిర్వహించిన స్వాభిమాన్ పర్వ్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
#WATCH | Somnath, Gujarat | PM Narendra Modi says, " ... unfortunately, after independence, people with a colonial mindset tried to get rid of our glorious past. they tried all they could to erase history... those who fought for the somnath temple were not given their due… pic.twitter.com/xNrJFCnRQ6
— ANI (@ANI) January 11, 2026
"గజినీ నుంచి ఔరంగజేబ్ వరకు అనేక మంది సోమనాథ్ ఆలయాన్ని ధ్వంసం చేసేందుకు అనేక ప్రయత్నాలు చేశారు. అచ్చం అలాగే మన దేశాన్ని నాశనం చేసేందుకు విదేశీ దురక్రామణదారులు ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ వారు సోమనాథ్‌ను, భారత్‌ను ఏం చేయలేరు. 1,000 ఏళ్ల క్రితం మన పూర్వీకులు సోమనాథ్ ఆలయం కోసం వారి ప్రాణాలను అర్పించారు. దురాక్రమణదారులు ఆలయాన్ని ధ్వంసం చేసి విజయం సాధించామని అనుకున్నారు. కానీ వెయ్యేళ్ల తర్వాత కూడా సోమనాథ్ ఆలయంపై ఇంకా జెండా ఎగురుతూనే ఉంది. భారత అస్థిత్వానికి, గౌరవానికి సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ అనేది ప్రతీక. ఒకవేళ సోమనాథ్ ఆలయం సంపద కోసమే అయితే, మొదటి సారి జరిగింది సరిపోయేది. కానీ ఆలయంపై పదేపదే దాడి చేసి దేవుడిని అపవిత్రం చేశారు. సోమనాథ్ స్వాభిమాన్ యాత్రకు వెయేళ్లు, ఆలయ పునర్ నిర్మాణానికి 75 ఏళ్లు పూర్తయ్యాయి. సోమనాథ్ ఆలయ చరిత్ర కేవలం విధ్వంసం, ఓటమి గురించే కాదు. ఇది పునర్నిర్మాణం, విజయానికి సంబంధించిన కథ. కొందరు దురాక్రమణదారులు చరిత్రను తగ్గించేందుకు ప్రయత్నించారు. కానీ సోమనాథ్ ఆలయం ఇప్పటికీ బలంగా నిలబడింది. అలాంటి సోమనాథ్ ఆలయ ట్రస్ట్ ఛైర్మన్‌గా సేవలందించే అవకాశం రావడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. వెయ్యి మంది విద్యార్థులు 72 గంటల పాటు నిరంతరాయంగా ఓంకార మంత్రాన్ని పటించారు."
--నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి
#WATCH | Gujarat | PM Narendra Modi interacts with 'Rishikumar' in attendance, after offering prayers at Somnath Temple.
— ANI (@ANI) January 11, 2026
Source: DD pic.twitter.com/YBSERYnsQ2
#WATCH | Gujarat | After concluding the 'shaurya yatra', PM Narendra Modi arrives to offer prayers at Somnath Temple.
— ANI (@ANI) January 11, 2026
Source: DD pic.twitter.com/x7AeVPxAhA
డమరుకం మోగించిన మోదీ- సోమనాథ్ శౌర్య యాత్రలో ప్రధాని
అంతకుముందు సోమ్‌నాథ్‌లో స్వాభిమాన్ పర్వ్‌లో భాగంగా నిర్వహించిన శౌర్య యాత్రలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. పూలతో ఆలంకరించిన వాహనంలో యాత్రలో పాల్గొన్న ఆయన, మధ్యలో డమరుకం మోగించారు. ఇందులో ప్రధాని మోదీతో పాటు గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, ఉప ముఖ్యమంత్రి హర్ష్ సింఘ్వీ పాల్గొన్నారు. యాత్ర తర్వాత సోమ్‌నాథ్ ఆలయానికి చేరుకున్న ప్రధాని మోదీ శివునికి ప్రత్యేక పూజలు చేశారు. వలసవాదుల దాడుల నుంచి సోమ్‌నాథ్ ఆలయ రక్షణ కోసం ప్రాణాలర్పించిన వారికి గౌరవ సూచకంగా ఈ యాత్రను చేపట్టారు. శౌర్యం, త్యాగానికి ప్రతీకగా 108 అశ్వాలతో ఊరేగింపు నిర్వహించారు. దాదాపు కిలోమీటరు మేర సాగిన ఈ యాత్రలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొనగా, హరహర మహాదేవ్ నామస్మరణతో ఆ ప్రాంతమంతా మార్మోగింది.
#WATCH | Prime Minister Narendra Modi holds 'Shaurya Yatra', a symbolic procession organised as part of the Somnath Swabhiman Parv. CM Bhupendra Patel and Dy CM Harsh Sanghavi are also present.
— ANI (@ANI) January 11, 2026
The Shaurya Yatra represents courage, sacrifice and the indomitable spirit that… pic.twitter.com/ilmksrc0Uo
#WATCH | Gujarat | PM Narendra Modi interacts with 'Rishikumar' in attendance, after offering prayers at Somnath Temple.
— ANI (@ANI) January 11, 2026
Source: DD pic.twitter.com/YBSERYnsQ2
3వేల డ్రోన్లతో షో
అంతకుముందు గుజరాత్‌లో మూడు రోజుల పర్యటన భాగంగా శనివారం ప్రధాని నరేంద్ర మోదీ సోమనాథ్ చేరుకున్నారు. సోమనాథ్‌లోని మహాదేవుడి ఆలయం సమీపంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద ప్రధానికి ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ తదితరులు మోదీకి ఘన స్వాగతం పలికారు. అనంతరం శనివారం సాయంత్రం 'ఓంకార్ మంత్ర' సామూహిక ఆలాపనలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. 3,000 డ్రోన్లతో నిర్వహించిన షోను ఆయన తిలకించారు. ఇందులో ఆలయ చారిత్రక ఘట్టాలను అద్భుతంగా ఆవిష్కరించారు. "మన సాంస్కృతిక వారసత్వ ధైర్యసాహసాలకు ప్రతీక అయిన సోమనాథ్‌లో స్వాభిమాన్ పర్వ్ సందర్భంగా ఉండటాన్ని ఆశీర్వచనంగా భావిస్తున్నా. 1026లో సోమనాథ్‌పై దాడి జరిగి వెయ్యేళ్లు అయిన ఈ సందర్భాన్ని దేశమంతా కలిసి స్మరించుకుంటోంది. ఇక్కడి ప్రజల స్వాగతానికి కృతజ్ఞతలు" అని ఎక్స్‌లో మోదీ పేర్కొన్నారు.

