మోదీ సరికొత్త రికార్డు- ఇన్‌స్టాలో 100 మిలియన్లు దాటిన ఫాలోవర్స్ - ట్రంప్ కంటే రెండు రెట్లు ఎక్కువే
సోషల్ మీడియాలో ప్రధాని మోదీ సత్తా- ఇన్‌స్టాలో మోదీకి 100 మిలియన్లు దాటిన ఫాలోవర్లు- గ్లోబల్‌తో పాటు దేశంలోని రాజకీయా నాయకుల్లో మోదీనే టాప్

Published : February 26, 2026 at 6:49 AM IST
PM Modi Instagram Followers : ప్రధాని మోదీకి సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఇప్పుడు ఆ ఫాలోయింగ్‌లో కొత్త మైలురాయిని అధిగమించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో మోదీ ఫాలోవర్స్ 100 మిలియన్లు దాటారు. ప్రస్తుతం ఇజ్రాయెల్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ సోషల్ మీడియాలో ఫాలోయింగ్ విషయంలోనూ, ఇటు అంతర్జాతీయ దౌత్య సంబంధాల బలోపేతంలోనూ ప్రధాని మోదీ సరికొత్త శిఖరాలను అధిరోహంచారు. ప్రపంచంలో ఏ దేశ అధినేతకు కూడా ఇంతమంది ఫాలోవర్లు లేరు. దీంతో ఇన్‌స్టా వేదికగా 10కోట్ల మందికి కనెక్ట్ అయిన ఏకైక గ్లోబల్ నేతగా మోదీ రికార్డు సృష్టించారు.
ఇన్‌స్టాగ్రామ్‌లో 'మోదీ మార్క్'
2014లో ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రధాని మోదీ ఖాతా తెరిచారు. అనతి కాలంలోనే ప్రపంచంలోని అగ్రశ్రేణి నాయకులందరినీ వెనక్కి నెట్టారు. ప్రస్తుతం ఆయన ఫాలోవర్ల సంఖ్య ఎంతగా పెరిగిందంటే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కంటే మోదీకి రెండు రెట్లు ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇక్క ఇంకో ఆసక్తికరమైన విశేషం ఏంటంటే, ఇన్‌స్టాగ్రామ్‌లో మోదీ తర్వాత ఉన్న దేశాధినేతల మొత్తం ఫాలోవర్ల సంఖ్యను కలిపినా 100 మిలినయన్ల కంటే తక్కువ ఉండటం సోషల్ మీడియాలో మోదీ మార్క్‌ను చాటి చెబుతోంది. ప్రపంచ నేతల ఫాలోవర్ల జాబితాను ఓసారి పరిశీలిద్దాం.
100 మిలియన్లు(10కోట్ల)తో ప్రధాని మోదీ అగ్రస్థానంలో ఉన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 4.32 కోట్ల (43.2 మిలియన్లు) ఫాలోవర్లతో రెండో స్థానంలో ఉండగా, ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో (1.5 కోట్లు), బ్రెజిల్ అధ్యక్షుడు లూలా (1.44 కోట్లు), టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ (1.16 కోట్లు), అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలీ (64 లక్షలు) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
STORY | PM Modi becomes most followed world leader on Instagram with 100 million followers
— Press Trust of India (@PTI_News) February 26, 2026
Prime Minister Narendra Modi has crossed the massive milestone of 100 million followers on Instagram, making him the first world leader and politician to achieve this feat on the platform,… https://t.co/2ZdFxpkkb1
అంతర్జాతీయ స్థాయిలోనే కాకుండా భారత రాజకీయాల్లోనూ సోషల్ మీడియా మోదీ ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది. దేశంలోని ఇతర రాజకీయ నాయకులెవరూ ఆయన దరిదాపుల్లో కూడా లేరు. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ 1.61 కోట్ల ఫాలోవర్లతో రెండో స్థానంలో ఉండగా, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ 1.26 కోట్లతో మూడో స్థానంలో ఉన్నారు.
ఇజ్రాయెల్ పర్యటనలో మోదీ
రెండు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం ఇజ్రాయెల్‌కు వెళ్లి ప్రధాని మోదీకి అక్కడ అపూర్వ స్వాగతం లభించింది. బుధవారం ఇజ్రాయెల్ పార్లమెంట్ అయిన 'నెస్సెట్' ప్రధాని మోదీకి ‘స్పీకర్ ఆఫ్ ది నెస్సెట్ మెడల్’ ప్రదానం చేసింది. ఇది నెస్సెట్ అందించే అత్యున్నత పురస్కారం. భారత్, ఇజ్రాయెల్ దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేయడంలో మోదీ చూపిన చొరవకు గానూ ఈ మెడల్‌ను అందించారు. ఈ గౌరవాన్ని అందుకున్న మొదటి భారత ప్రధానిగా ఆయన సరికొత్త చరిత్ర సృష్టించారు.
పార్లమెంట్‌లో మోదీ ప్రసంగం
నెస్సెట్‌లో ప్రధాని మోదీ కీలక ప్రసంగం చేశారు. ఆయన చేసిన ప్రసంగం యావత్ ఇజ్రాయెల్ దేశాన్ని ఆకట్టుకుంది. ఆయన ప్రసంగిస్తున్నంత సేపు పార్లమెంట్ చప్పట్లతో మారుమోగిపోయింది. మోదీ తన ప్రసంగంలో భారత్-ఇజ్రాయెల్ మధ్య ఉన్న వేల ఏళ్ల నాటి చారిత్రక బంధాన్ని గుర్తుచేశారు. భారత్- ఇజ్రాయెల్ ఆధునిక దేశాలుగా ఏర్పడకముందే, గత రెండు వేల ఏళ్లకు పైగా రెండు ప్రాంతాల మధ్య విడదీయలేని సంబంధాలు ఉన్నాయని మోదీ పేర్కొన్నారు. యూదుల పవిత్ర గ్రంథం 'బుక్ ఆఫ్ ఎస్తేర్'లో భారతదేశాన్ని 'హోదు' అని ప్రస్తావించారని, అలాగే 'తాల్ముడ్' గ్రంథాల్లో ప్రాచీన కాలంలో భారత్‌తో జరిగిన వాణిజ్య లావాదేవీల రికార్డులు ఉన్నాయని ఆయన గుర్తుచేశారు. ఇజ్రాయెల్ ప్రజల ధైర్యం, వారు సాధించిన విజయాల పట్ల భారతదేశంలో అపారమైన గౌరవం ఉందని మోదీ కొనియాడారు. ప్రసంగం అనంతరం ఇజ్రాయెల్ పార్లమెంట్ సభ్యులు ప్రధాని మోదీతో ఫొటోలు, సెల్ఫీలు దిగేందుకు ఆసక్తిని కనబర్చారు
ఇజ్రాయెల్ పార్లమెంటులో మోదీ ప్రసంగం- భారత తొలి ప్రధానిగా రికార్డ్
బంగాల్‌లో అధికార మార్పు తీసుకురావాలి : ఆ రాష్ట్ర ప్రజలకు మోదీ లేఖ

