ETV Bharat / bharat

బస్తర్‌లో భలే గుహ- గోడలన్నీ ఆకుపచ్చ రంగులోనే- ఈ 'గ్రీన్ కేవ్' గురించి తెలుసా?

ఛత్తీస్​గఢ్​ కాంగేర్ లోయలో కొత్త అద్భుతం- సహజంగా ఏర్పడిన 'గ్రీన్​ కేవ్'- దేశవిదేశాల్లోనూ ప్రసిద్ధి

Bastar Green Caves
Bastar Green Caves (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : January 7, 2026 at 10:24 PM IST

3 Min Read
Choose ETV Bharat

Bastar Green Caves: అజంతా, ఎల్లోరా బేలమ్ బొర్ర గుహలు దేశంలో అత్యంత ప్రసిద్ధి చెందినవి. సహజంగా ఏర్పడిన ఈ ప్రకృతి అందాలను వీక్షించేందుకు ఏటా లక్షల్లో పర్యటకులు ఇక్కడికి వస్తుంటారు. అచ్చం అలాంటిదే ఛత్తీస్​గఢ్​లోని కాంగేర్ లోయలోని కుటుమ్సర్​ గుహ. ఇతర గుహల కంటే భిన్నంగా గోడలు ఆకుపచ్చ రంగులో దర్శనమిస్తాయి. సహజంగా ఏర్పడిన కొత్త గుహ శాస్త్రవేత్తలు, ప్రకృతి ప్రేమికులతో పాటు పర్యటకుల దృష్టిని కూడా ఆకర్షిస్తోంది. గ్రీన్​ కేవ్​పై పిలుస్తున్న ఈ గుహ భారత్​లోనే కాకుండా విదేశాల్లోనూ కూడా ప్రసిద్ధి చెందుతోంది. గ్రీన్​ కేవ్​ గురించి ఈటీవీ భారత్​ ప్రత్యేక కథనం.

గ్రీన్ కేవ్ ఎక్కడ ఉంది?
గ్రీన్ కేవ్ బస్తర్ జిల్లా ప్రధాన కేంద్రం జగదల్‌పూర్ నుంచి సుమారు 45 కిలోమీటర్ల దూరంలో కాంగేర్ లోయ జాతీయ ఉద్యానవనంలో కుటుమ్సర్ గుహ సమీపంలో ఉంది. ఘనమైన అడవులు, కొండల మధ్య ఉన్న చిన్న మార్గాల ద్వారా అక్కడకు చేరుకోవాల్సి ఉంటుంది. అయితే గుహ ప్రవేశ ద్వారం చాలా ప్రమాదకరంగా ఉంది. గుహలోకి వెళ్లేందుకు ఎలాంటి కృత్రిమ నిర్మాణాలు ఉండవు. చట్టాలను (రాళ్లను) ఆసరాగా చేసుకొని గుహలోకి దిగాలి.

Green Caves
గ్రీన్​ కేవ్ (ETV Bharat)
Green Caves
గ్రీన్​ కేవ్ (ETV Bharat)

గుహలోకి దిగగానే మంత్రముగ్ధం చేసే అందం
గుహలోకి దిగగానే ఆకుపచ్చ రంగులతో మెరిసే సున్నపు రాయి గోడలు (స్టలాక్టైట్స్) కళ్ల ముందు దర్శనమిస్తాయి. అవి చూసిన వెంటనే మరో లోకంలోకి అడుగుపెట్టినట్లుగా అనిపిస్తుంది. చుట్టూ తెలుపు, ఆకుపచ్చ రంగుల్లో మెరిసే రాళ్లు కళ్లను మంత్రముగ్ధులను చేస్తాయి. గుహలో కనిపించే ఈ సున్నపు రాయి ఆకృతులు ఒకటి రెండు రోజుల్లో గానీ, కొన్ని సంవత్సరాల్లో గానీ ఏర్పడినవి కాదు. వేల సంవత్సరాలుగా నీటి బిందువులు నిరంతరం చుక్కలుగా జారుతూ స్టాలాక్టైట్స్, స్టాలాగ్మైట్స్ రూపంలో ఏర్పడ్డాయి. ఈ గుహ పొడవు సుమారు 50 నుంచి 60 మీటర్లకు మించి ఉంది. దీనిలో అనేక రకాల సున్నపు రాయి ఆకృతులు దర్శనమిస్తాయి.

Green Caves
తెల్ల రాయి (ETV Bharat)
ఇతర గుహల కంటే గ్రీన్ కేవ్ ప్రత్యేకంబస్తర్ ప్రాంతంలోని చాలా గుహల్లో లోపల కనిపించే సున్నపు రాయి ఆకృతులు సాధారణంగా ఒకేలా ఉంటాయి. అవి ఎక్కువగా తెలుపు రంగులో మెరిసేలా ఉంటాయి. కానీ గ్రీన్ కేవ్‌లో మాత్రం సున్నపు రాయి మీద ఆకుపచ్చ రంగు పొర ఏర్పడింది. ఈ ఆకుపచ్చ పొరే ఈ గుహకు ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చింది. టార్చ్ వెలుగు పడగానే ఆ ఆకుపచ్చ రంగు మరింత ప్రకాశవంతంగా మెరిసిపోతుంది. ఇదే గ్రీన్ కేవ్‌ను బస్తర్ ప్రాంతంలోని ఇతర గుహలకన్నా అత్యంత విశిష్టంగా నిలబెడుతోంది.
Green Caves
తెల్ల రాయి (ETV Bharat)

ఆకుపచ్చగా ఉండటానికి కారణమిదే!
గ్రీన్ కేవ్ గోడలు ఆకుపచ్చగా కనిపించడానికి ప్రధాన కారణం సూర్యకాంతి అని స్థానిక గైడ్ సోమరత్ కశ్యప్ ఈటీవీ భారత్​కు తెలిపారు. 'ఈ గుహలోని సున్నపు రాయి గోడలు గుహ ప్రవేశ ద్వారం వద్దనే ఉన్నాయి. అక్కడికి నేరుగా సూర్యుని కాంతి పడుతుంది. సూర్యకాంతి పడే ప్రాంతాల్లో గోడలపై ఉన్న తేమ (నీరు), సూర్యుని కాంతితో కలిసి నాచులా ఏర్పడింది. గోడలపై సూర్యకాంతి పడే ప్రతి చోట క్రమంగా నాచు పెరుగుతుంది. అనేక సంవత్సరాల పాటు నిరంతరం కాంతి పడుతుండటంతో ఈ నాచు విస్తరిస్తూ గోడలపై పాకింది. ఆ కారణంగానే సున్నపు రాయి గోడలు ఆకుపచ్చ రంగులో కనిపిస్తున్నాయి. గ్రీన్ కేవ్‌కు సమీపంలోనే ఉన్న కొన్ని ఇతర గోడలపై సూర్యకాంతి పడదు. అందువల్ల అక్కడ నాచు ఏర్పడలేదు. దీంతో ఆ గోడలు తెలుపు రంగులో కనిపిస్తున్నాయి' సోమరత్ కశ్యప్​ చెప్పారు.

గోకర్ణ గుహలో రష్యన్ మహిళ, ఇద్దరు పిల్లలు ఎందుకు ? ఏమైంది ?

అక్కమహాదేవి గుహల స్టే ప్యాకేజీ వచ్చేసింది - ధర తక్కువే - ఆన్​లైన్​లో ఇప్పుడే బుక్​ చేసేయండి