ETV Bharat / bharat

ఉద్యోగం​ వదిలి వ్యాపారంలోకి- ఏటా రూ.70 లక్షలు సంపాదిస్తున్న 'సమోసా కింగ్'​!

ఉద్యోగం వదిలి వ్యాపారం చేయాలని తలచి - చిన్న బండితో మొదలై 3 దుకాణాలకు చేరిన వైనం - కోట్లు సంపాదిస్తున్న రవి రంజన్​ సక్సెస్​ స్టోరీ ఇదే

samosa king Ravi Ranjan Success story
samosa king Ravi Ranjan Success story (Etv Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : January 10, 2026 at 5:14 PM IST

4 Min Read
Choose ETV Bharat

Samosa King Ravi Ranjan Life Story : ఉద్యోగం కాకుండా వ్యాపారం చేయాలనుకునే వారికి రవి రంజన్​ సక్సెస్​ స్టోరీ ఆదర్శప్రాయంగా నిలుస్తోంది. అతడు చదివింది మెకానికల్ ఇంజినీరే అయినా, అందరూ అతణ్ని 'సమోసా కింగ్' అని పిలుస్తుంటారు. ఎందుకంటే ఒక చిన్న బండిపై వ్యాపారాన్ని మొదలు పెట్టి, ప్రస్తుతం నగరంలో మూడు షాప్​లను నిర్వహిస్తూ, ఏటా రూ.70 లక్షల టర్నోవర్ సాధిస్తున్నారు. మరి అతడి సక్సెస్​ మంత్ర, ఆ వివరాలు ఏమిటో తెలుకుందామా!

జాబ్​ వదిలి వ్యాపారం వైపు
కరోనా సమయంలో నగరాల్లో నివసించే చాలా మంది తమ ఉద్యోగాలు వదిలి సొంత ఊర్లకు పయనమయ్యారు. బిహార్​లోని పట్నాకు చెందిన మెకానికల్ ఇంజినీర్ రవి రంజన్ కూడా​ ఘజియాబాద్​లో ఉద్యోగం చేసేవారు. కరోనా ప్రభావంతో అతడు కూడా జాబ్​ కోల్పోవాల్సి వచ్చింది. తనలాగే ఎంతో మంది ఉద్యోగాలు కోల్పోయి, ఉపాధి లేక అవస్థలు పడటం చూసి, రవి రంజన్​ జాబ్​ పట్ల తన ధోరణి మార్చుకున్నారు. కరోనా మహమ్మారి కారణంగా ఉద్యోగాలకు భద్రత ఉండదని భావించి, తాను ఇక ఏ జాబ్​ చేయకూడదని నిర్ణయించుకున్నారు. పట్నా​లోనే ఉంటూ ఏదైనా స్టార్టప్​ చేయాలని నిశ్చయించుకున్నారు.

ఆలూ సమోసాలతో విసుగు - తానే 'సమోసా కింగ్'​గా
ఏదైనా సొంతంగా వ్యాపారం చేయాలని భావించిన రవి రంజన్​కు ఏం చేయాలో స్పష్టత రాలేదు. అయితే, అతడు ఒక సమోసా ప్రియుడు. కానీ బంగాళ దుంప సమోసాలనే తిని అతడికి విసుగు పుట్టింది. దీంతో రవి రంజన్​కు సమోసాలను వివిధ రకాలుగా చేయవచ్చనే ఆలోచన వచ్చింది. నిజానికి అతడికి సమోసాలు తయారు చేయడం రాకపోయినా, ఇంట్లోనే తన తల్లి సాయంతోనే వాటిని ఎలా చేయాలో నేర్చుకున్నారు. తాను కూడా ముందు బంగాళ దుంప సమోసాలనే నేర్చుకున్నా, క్రమంగా బఠానీ, పనీర్​, చీజ్​కార్న్​ వంటి రకరకాల సమోసాలను కూడా చేసి వాటిని ఇంట్లోవారికి, బంధువులకు తినిపించేవారు. వాటిలో వారు మెచ్చుకున్న వంటకాలను ప్రజలకు కూడా రుచి చూపించి, వ్యాపారం చేయవచ్చని అనుకున్నారు. అలా రవి రంజన్​ పట్నాలోనే ఒక చిన్న సమోసా బండితో తన వ్యాపారాన్ని మొదలు పెట్టారు.

సమోసా కింగ్ రవి రంజన్​ మాట్లాడుతూ, "మేము పట్నాలోని జగదేవ్ పాత్ పిల్లర్ నెం.15 దగ్గర ఒక బండిని పెట్టాము. సమోసాలను తిన్నాక ప్రజల నుంచి విశేష స్పందన రావడం ప్రారంభమైంది. అమ్మకాలు కూడా బాగా జరిగాయి. ఆ తర్వాత మా వ్యాపారాన్ని బండి నుంచి దుకాణానికి మార్చాము . ఇప్పుడు పట్నాలో మాకు మూడు దుకాణాలు ఉన్నాయి" అని తెలిపాడు.

చీజ్ కార్న్ సమోసాకు ఫుల్​ డిమాండ్
రవి రంజన్ తయారుచేసే చీజ్ కార్న్ సమోసా చాలా ప్రసిద్ధి చెందింది. ఈ సమోసాలలో వెన్నతో పాటు మొక్కజొన్న ఉంటాయి. దీంతో పాటు తందూరి పనీర్ సమోసా కూడా ప్రజలలో చాలా ప్రాచుర్యం పొందింది. వీటిలో ఉల్లిపాయలు, పనీర్, క్యాప్సికమ్ వేయించి ఉంటాయి. పుట్టగొడుగుల చీజ్ మిశ్రమాన్ని నింపి కూడా సమోసాలు తయారు చేస్తారు. ఈ రకమైన సమోసా ఫాస్ట్ ఫుడ్ ఫ్లేవర్‌లో చాలా ప్రసిద్ధి చెందింది.

Manchurian samaosa in  Ravi Ranjan cafe
రవి రంజన్ దుకాణంలో ఏర్పాటు చేసిన మంచూరియన్​ సమోస (Etv Bharat)

షాహీ సమోసా క్రేజ్
రవి రంజన్​ తన షాప్​లో మలై పనీర్ సమోసాను షాహీ శైలిలో తయారు చేస్తారు. దీనిలో ఉల్లిపాయ, పన్నీర్, క్యాప్సికమ్, క్రీమ్​తో పాటు చీజ్ మిశ్రమాన్ని నింపుతారు. పిజ్జా సమోసాను కూడా ప్రజలు బాగా ఇష్టపడుతున్నారనీ రవి తెలిపారు. వీటి తయారీ కోసం ముందుగా ఆకుపచ్చ కూరగాయల బీన్స్, క్యారెట్లు, సాస్‌తో మ్యారినేట్ చేస్తారు. ఆ తర్వాత పిజ్జా సమోసాను తయారు చేస్తారు.

ఖోయా సమోసా ఒక డెజర్ట్‌గా మారింది

cheese corn samosa in Ravi Ranjan cafe
రవి రంజన్ కెఫేలో ఏర్పాటు చేసిన చీజ్ కార్న్​ సమోస (Etv Bharat)
ఖోయా సమోసా, ఇది ఒక విభిన్న రుచి గల సమోసా. వీటిలో ఖోయాను నింపి తయారు చేస్తారు. చాలా మంది భోజనం తర్వాత దీనిని డెజర్ట్‌గా తినేందుకు ఇష్టపడతున్నారని రవి రంజన్​ చెప్పారు. చాక్లెట్ సమోసాలను పిల్లలు ఎంతో ఆదరణ లభిస్తోందని ఆయన అన్నారు. మంచూరియన్ సమోసాలు కూడా ఇక్కడ ఎంతో ప్రత్యేకం. వీటిని చేయడానికి ముందు మంచూరియన్ చిల్లీని తయారు చేస్తారు. తర్వాత దానిని ఫ్రై చేసి, ప్రత్యేక మసాలాలను జోడించి మంచూరియన్ సమోసాలను తయారు చేస్తారు.
Mushroom samosa in ravi ranjan cafe
రవి రంజన్ దుకాణంలో తయారు చేసిన మష్రూమ్​ సమోస (Etv Bharat)

సమోసా ధరలు ఇలా

సమోసా కింగ్ పట్నాలో సమోసా రకాల ఆధారంగా రూ.13 నుంచి 35 రూపాయల వరకు అందుబాటులో ఉంచామని రవి రంజన్ తెలిపారు. ఇందులో చీజ్ కార్న్ సమోసా రూ.35, పంజాబీ పన్నీర్ సమోసాకు రూ.25, తందూరి పన్నీర్ సమోసాకు రూ. 25, మలై పన్నీర్ సమోసాకు రూ. 25, మష్రూమ్ పన్నీర్​కు రూ. 30, పిజ్జా సమోసాకు రూ. 20, మంచూరియన్ సమోసాకు రూ.22, ఆలూ వెజ్ పనీర్​కు రూ. 30గా వాటి ధరలను ధృవీకరించినట్లు రవి రంజన్​ తెలిపారు.

రూ.70 లక్షల టర్నోవర్
ఐదారేళ్ల క్రితమే ప్రారంభమైన రవిరంజన్​కు చెందిన మూడు దుకాణాల మొత్తం టర్నోవర్ సుమారు రూ. 60 నుంచి రూ.70 లక్షల వరకు ఉంటుందని ఆయన వెల్లడించారు. ఆయన తన షాపుల్లో దాదాపు 20 రకాల సమోసాలను తయారు చేస్తూ, వాటిని అనుగుణంగా ధరలు ఏర్పాటు చేశామని తెలిపారు. దీంతో సమోసాలు అమ్మి రవి రంజన్​ కోట్లాది రూపాయలు సంపాదిస్తూ, వ్యాపారాన్ని ఇష్టంగా చేస్తే ఎన్నో విజయాలు సాధించవచ్చని​ నిరూపిస్తున్నారు.

మహారాష్ట్రలో 'హుర్దా పార్టీ' ట్రెండ్- రైతులకు కాసుల పంట- సీజన్​లో రూ.12 లక్షల చొప్పున ఆదాయం!

చింతపండుతో 'చాకో' - రూ.600 కోట్ల ఆఫర్ వదులుకున్న ఇంజినీర్ సక్సెస్ స్టోరీ!