ETV Bharat / bharat

హిందూ సంప్రదాయాలతో ఒక్కటైన మెక్సికో జంట- పూల వర్షం కురిపించిన స్థానికులు!

హిందూ సంస్కృతి సంప్రదాయాలకు ఆకర్షితులైన మెక్సికో జంట- వారణాసిలో గంగానదిలో పడవపై పెళ్లి

Mexican Couple Got Married Hindu Rituals
Mexican Couple Got Married Hindu Rituals (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : February 25, 2026 at 6:03 PM IST

3 Min Read
Choose ETV Bharat

Mexican Couple Got Married Hindu Rituals : ఎంత టెక్నాలజీ మారినా, ఎన్ని లెటెస్ట్​ ట్రెండ్స్​ వచ్చినా మన దేశ సంస్కృతి, సంప్రదాయాలకు ఎంతో మంది ఆకర్షితులు అవుతూనే ఉన్నారు. అదేవిధంగా మెక్సికోకు చెందిన ఓ జంట కూడా మన ఆచార సంప్రదాయాలకు ఆకర్షితులయ్యారు. హిందూ ఆచారాల ప్రకారం పెళ్లి చేసుకున్నారు. మన సంస్కృతి సంప్రదాయాలకు దేశ విదేశాల్లోనూ మంచి గుర్తింపు ఉందని మరోసారి నిరూపించారు. నది ప్రవాహంలో చూపరులను మైమరపించేలా వీరి వివాహం జరిగింది. నీటిపై ఉన్న పడవలో వేద మంత్రాల సాక్షిగా ఈ జంట ఒక్కటైంది. వీరి వివాహానికి ఆధ్యాత్మిక నగరమైన కాశీ చక్కని వేదికగా నిలిచింది. ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి స్థానికులు, భక్తులు, పర్యాటకులు పెద్ద సంఖ్యలో అస్సీ ఘాట్‌ వద్ద గుమిగూడారు.

గంగానదిలో పడవపై పెళ్లి
వివరాల్లోకి వెళితే, మెక్సికోకు చెందిన రూయిజ్ కాబ్రోల్, గొంజలో మిగ్యుల్​కు హిందూ సంస్కృతి సంప్రదాయాలంటే చాలా ఇష్టం. చాలా కాలంగా హిందూ సంస్కృతులపై మమకారం పెంచుకున్నారు. ఈ క్రమంలో భారతదేశ ఆధ్యాత్మిక రాజధాని వారణాసిలో తమ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఓ శుభ ముహూర్తాన పెళ్లి నిశ్చయం చేసుకున్నారు. అయితే, వీరి వివాహం మాత్రం విన్నూత రీతిలో జరిగింది. గంగానదిలో ఓ పడవపై వీరి పెళ్లి ఏర్పాట్లు జరిగాయి. అనంతరం వేద మంత్రాల సాక్షిగా వీరి వివాహం జరిగింది.

గంగా అలల మధ్య హిందూ సంప్రదాయలతో ఒక్కటైన జంట!
అంతేకాదు, వివాహ సమయంలో ధోతి, కుర్తా, ఎరుపు బనారసి చీర దుస్తులను ధరించి హిందూ సంప్రదాయాలను పాటించారు ఈ మెక్సికో​ జంట. "ఈ జంట వివాహం హిందూ ఆచారాల ప్రకారం ఘనంగా జరిగింది. ఓ వైపు వేద మంత్రాలు, మరోవైపు ధూపపు కర్రలు, దీపాల సువాసనతో ఆ ప్రాంతమంతా పూర్తిగా ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయింది. అదేవిధంగా ప్రశాంతమైన గంగా అలల మధ్య వధూవరులిద్దరూ సాంప్రదాయ వస్త్రాలను ధరించి వివాహ వేడుకలో పాల్గొన్నారు" అని ఈ పెళ్లి వేడుకను నిర్వహించిన ఆచార్య దీపక్ పాండే పేర్కొన్నారు.

ఘాట్​ వద్ద పూల వర్షం కురిపించిన స్థానికులు
ఇదిలా ఉండగా, నూతన వధూవరుల పెళ్లి వేడుకను ఆసక్తిగా తిలకించిన స్థానిక ప్రజలు వారిద్దరిని ఆశీర్వదించారు. ఘాట్ వద్ద పూల వర్షం కురిపించారు. అంతేకాదు, దేశ, విదేశీ పర్యాటకులు సైతం ఈ అద్భుతమైన క్షణాన్ని తమ కెమెరాల్లో చిత్రీకరించారు. కొంతమంది ఈ వివాహాన్ని సంస్కృతుల సంగమమని అభివర్ణించారు.

Mexican Couple Got Married Hindu Rituals
భారత సంస్కృతి సంప్రదాయాలకు ఆకర్షితులైన మెక్సికో జంట (ETV Bharat)

భారత సంప్రదాయాలతో రష్యన్​ జంట వివాహం!
కొద్దిరోజుల క్రితం కూడా ఇలాంటి సంఘటనే జరిగింది. రష్యాకు చెందిన ఓ యువ జంట భారత వివాహా ఆచారాలను పాటిస్తూ వేదమంత్రాల సాక్షిగా వివాహం చేసుకున్నారు. అయితే, వారి వివాహం కూడా వారణాసిలోనే జరగడం విశేషం. దశాశ్వమేధ ఘాట్‌లోని నల్వా వీర్ బాబా మందిర్‌లో రష్యాకు చెందిన మెరిన్​(36), కాన్‌స్టాంటిన్ (48) పెళ్లి చేసుకున్నారు. భారత ఆచారాల ప్రకారం కాశీలోనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో రష్యా నుంచి వారణాసికి చేరుకున్నారు. పూజరుల సమక్షంలో నూతన వధూవరులు దండలు మార్చుకున్నారు. వేద మంత్రాల మధ్య అగ్ని సాక్షిగా ఏడడగులు వేశారు. ఆ సమయంలో అక్కడే ఉన్న మహిళలు మంగళకరమైన పాటలు పాడి అందరిని ఆనంద పరిచారు. అయితే, ఈ జంటకు స్థానికులు కన్యాదానం చేయడం మరో విశేషంగా మారింది. అనంతరం అక్కడున్న వారంతా నూతన వధూవరులను ఆశీర్వదించారు. అయితే, హిందూ సంప్రదాయాల మీద ఇష్టంతోనే వివాహాం చేసుకున్నామని వరుడు తెలిపాడు. అలాగే శివుడు, పార్వతీ దేవీలు తనకు ప్రేరణ అని చెప్పాడు. అదే విధంగా హిందూ సంప్రదాయం ప్రకారం కాశీలో పెళ్లి చేసుకుంటానని 5 సంవత్సరాల కిందటే ప్రమాణం చేసుకున్నానని ఆయన చెప్పుకొచ్చారు.

హిందూ ఆచారాల ప్రకారం రష్యా జంట పెళ్లి- కన్యాదానం చేసిన కాశీవాసులు

ఆ ఊరిలో కరెంట్ స్తంభాలే బ్లాక్‌బోర్డులు- రోడ్డే ఓపెన్ ఎయిర్ స్కూల్- ఆ విలేజ్ ఎక్కడుందంటే?